Jayalalitha_TC_0223_II
ఎన్ని చానళ్ళు ? ఎన్ని పత్రికలు ? కాని జయ ఆరోగ్యం గురించిన అర్ద సత్యాలు భయిట పడాలంటే కూడ ఎయిమ్స్ డాక్టర్ల టీమ్ అపోలో రావల్సి ఉంది.

మొదటి రోజు ” జ్వరం – డి హైడ్రేషన్” అని చెప్పేరు. జ్వరం తగ్గిందనేరు. ఆసుపత్రి నుండే రాచ కార్యాలు నడుపుతున్నారని వార్తలొచ్చాయి. మామూలు ఆహారం తీసుకుంటున్నారనేరు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టి అభ్యర్దుల లిస్టు విడుదల చేసేరు.(సంతకం లేకనే). కావేరి ఇష్యూలో ప్రధాని ముందు సి.ఎంల సమావేశంలో ఏం మాట్లాడాలో కూడ “డిక్టేట్” చేసేరని వార్తలు వ్రాసేరు .

అర్ద సత్యాలు వెలుబడడానికి సైతం గవర్నర్ విజిట్ అనివార్యమాయే. “చావు కబురు చల్లగా “చెబుతున్నారు. ఇన్ఫెక్షనట – కృత్రిమ స్వాశట.
ఈ పోస్టు తమిళంలో వేస్తే చిప్ప కూడు పెడ్తారేమో? వదంతులు ప్రవలింప చేశే వారి పై కేసులట. నిజానికి కేసు పెట్టాలంటే “అపోలో” మీద పెట్టాలీ .వారేగా “అబ్బే ఏమీ లేదు ..జ్వరమంతే” అంటూ బులిటిన్ విడుదల చేసింది.

ఈ టపాను తెలుగులో వేయడానికి కారణం కేసు భయమే. నగ్నంగా తిరిగే ఊళ్ళో గోచి పెట్టుకున్నవాడు పిచ్చోడట.అలా తయారైంది తమిళ నాడు .
ఇంతకీ ఏం జరిగింది? జయ ఆరోగ్యం ఎలా ఉంది??
నేను ఇక్కడ మీకందిస్తున్న వివరాలన్ని సోషియల్ మీడియాలో మేధావులు ,వైద్య నిపుణులచే చర్చించ బడుతున్న విషయాలే. అందుకని ఈ విశేషాల పట్ల నాకు ఏ మాత్రం భాద్యత లేదని చేతులెత్తెయ్యను . కేసులు పెట్టే అవకాశం పూర్తిగా లేదని కూడ అనుకోను. పెట్టనీ .

ఎలాగో అసలు విషయం ఇంకొన్ని గంటల్లోనో -రోజుల్లోనో భయిట పెట్టాల్సిందే.
ఇక అసలు విషయానికొస్తే.. జయ ఆరోగ్యం పై చావు దెబ్బ కొట్టింది కేవలం షుగర్ .పార్క్ షెరటన్ స్కూల్లో చదువుకునే రోజుల్లోనుండి “చాక్లెట్” అంటే జయకు ప్రాణం.

దీనికి తోడు “యాంగ్సైటి” పైగా మధ్యపానం అలవాటు కూడ ఉందని అనుకుంటున్నారు (వైన్) ఇవన్ని కలిసి మధుమేఘం వచ్చింది.ఆమె శాస్త్రోక్తంగా నృత్యం నేర్చిన నర్తకి.
నృత్యం నేర్చిన వారికి /ప్రాక్టిస్ చేసే వారికి కీళ్ళ నొప్పులు రావడం సహజం. షుగర్ వచ్చిన వారికి / వృద్యాప్యంలో కీళ్ళ నొప్పులు తప్పక వస్తాయి. జయకూ వచ్చింది.
కరుణ ‘ వెన్ను పూసలో ఆపరేషన్ తరువాత వీల్ చేర్ ఎక్కాడు .దీనిని జయ ఎడా పెడా ఎద్దేవా చేయడం, ఇతరులచే ఎద్దేవా చెయించడం ఆన వాయితి.

డాక్టర్లు జయకు సైతం వీల్ చేర్ శిఫార్సు చేసేరు. ఇంట్లో ఉన్న సమయంలో వీల్ చేరు వాడుతున్నప్పటికి భయిటకు వచ్చినప్పుడు మాత్రం పెయిన్ కిల్లర్స్ సాయంతో అతి కష్ఠం మీడ నడిచే వచ్చేది ఆమె.
షుగర్ -నృత్యం -వృద్యాప్యం ఇచ్చిన కీళ్ళ నొప్పులు అందుకు కాను వాడిన పెయిన్ కిల్లర్స్ ఇవన్ని కలిసి జయ కిడ్ని పై ప్రభావం చూపాయి.
మధ్యపాన అలవాటు లివర్ పై దెబ్బ కొట్టింది . పైగా డాక్టర్ల సలహాలు పాటించక తీసుకుంటూ వచ్చిన స్వీట్/చాక్లెట్ ఇత్యాదుల కారణంగా వ్యాధి ముదిరింది. షుగర్ ప్రమాద స్థాయికి వెళ్ళినప్పుడు మూత్ర నాళాల్లో ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే కిడ్ని సామర్థ్యం పడి పోతుందో ఊపిరి తిత్తుల్లో నీళ్ళు చేరుతాయి. జ్వరం అసలు సమస్య కాదు . ఇన్ఫెక్షన్ వలన వచ్చిందే ఆ జ్వరం.

షుగర్ ఉన్నవారు తమ పాదాలను జాగ్రత్తగా చూసుకోవాలని అంటుంటారు. ఎందుకంటే షుగర్ వ్యాధిగ్రస్తులకు పాదాల్లో స్పర్శ తగ్గి పోతుంది కాబట్టి.
షుగర్ లెవల్స్ మరీ పెరిగితే ఏమవుతుంది? ఇన్ఫెక్షనుకు ఇచ్చే యాంటి బయాడిక్స్ సైతం కిడ్ని మీద దెబ్బ కొడతాయన్నది నిర్వివాదాంశం.ఇన్ఫెక్షన్ రక్త ప్రసరణ ద్వారా శరీరమంతా వ్యాప్సిస్తే దాదాపు అన్ని అవయవాల సామర్థ్యం తగ్గి పోతుంది (మల్టి ఆర్గన్ ఫెయిలియర్) పేస్ మేకర్ పెట్టారని కూడ వార్తలున్నాయి.

ఇన్నాళ్ళకి ఇప్పుడు అపోలో వారు కృత్రిమ స్వాశ పై నోరు మెదిపేరు . కాని అపోలో నందు అడుగు పెట్టిన నాటినుండి జయ పరిస్థితి ఇదేనేమోనన్న అనుమానాలున్నాయి.
ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో జయకు -కరుణకు ఉన్న తేడా కేవలం 20 ఎం.ఎల్.ఏలు మాత్రమే . కేవలం వ్యక్తి పూజతో నడిచే అన్నా డి.ఎం.కె లాంటి పార్టిలో అధినేత్రి ఆసుపత్రి పాలైతే ఎటువంటి పరిస్థితి నెలకొంటుందో జయకు తెలియనేదేమి కాదు.

ఏమాత్రం వీలున్నా తాను చికిత్స పొందుతున్న ఫోటోలను మీడియాకిచ్చి తన ఆరోగ్యం పై షికార్లు చేస్తున్న పుకార్లకు చరమ గీతం పాడి ఉండేది.
ఇక గతంలో వచ్చిన లండన్ డాక్టర్ ఇన్ఫెక్షన్లో స్పెషలిస్టైతే తాజాగా వచ్చిన డాక్టర్ బ్రెయిన్ డెత్ కేసుల్లో నిఫుణుడు. ఇక వేరే చెప్పనక్కర్లేదనుకుంటా.
ఇందాక నేను చెప్పిన విషయాలన్ని కేవలం వదంతులుగా తేలి -అపోలో వారు చెప్పేవే నిజమై -అతి త్వరలో జయ కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో భయిటపడితే సంతోషించే మొదటి వ్యక్తిని నేనే.
రాజకీయంగా ఎన్ని విమర్శలు ఉన్నప్పటికి ఆమె పోవాలని కోరుకునేటంత అమానుషం నాలో లేదు.

ప్రకటనలు