మనిషిలో శరీరం, మనస్సు,భుద్ది అంటూ మూడుంటాయి. నాల్గవదైన ఆత్మ గురించి ఉద్దేశ పూర్వకంగానే ఇక్కడ ప్రస్తావించుట లేదు. మానవుడు ఈ ప్రకృతినుండే పుట్టాడు. ప్రకృతినిచ్చే వాటితో తన శరీరాన్ని పోషించుకుంటాడు. ముఖ్యంగా మానవుడు ప్రకృతికి ఎంతగా దూరమైనా మానవ శరీరం మటుకు ఎంతకాదన్నా ప్రకృతితో విలీనమై ఉన్నది.

ఈ ప్రకృతికి ఒక శ్రుతి ఉంది లయ ఉంది. వేర్వేరు అంశాలు వేర్వేరు దిక్కు,దిశల్లో నుండి పని చేస్తున్నా వివిధ కళాకారులు వివిధ మ్యూజికల్ పరికరాలను వివిధ స్థాయిలో  వాయించినా అవి కల కలసి  ఓ సింఫోని అయినట్టుగా ఈ ప్రకృతి నడుస్తుంది.

మానవుని మనస్సు కల్పనలతో, కోరికలతో కలుషితమైంది. బుద్ది అహంకారంతో కలుషితమైంది. కాని శరీరం మటుకు ఒకింతవరకు ప్రకృతియొక్క లయకనుగుణంగానె పని చేస్తూ  ఉంటూంది. ప్రకృతికి స్పందిస్తూ ఉంటూంది.

మానవుడు ఎన్ని బట్టలు వాడి సూర్యచంద్ర కిరణాలనుండి, గాలులనుండి తన శరీరాన్ని దాచినా మనస్సును బుద్దితో బుద్దిని అహంకారంతో దాచినా మానవ శరీరం మటుకు ప్రకృతి చేతిలో కీలు బొమ్మగానే ఉంది.

మరణం అన్నది ప్రకృతియొక్క ఆజ్న. దీనిని శరీరం మరణానికి ఆరు నెలల మునుపే పసి గట్టి తన కార్యాచరణను రూపు దిద్దుకుంటూంది. మరణ ఆజ్నను శిరసా వహిస్తుంది. మనసైతే కల్పనలతో ,కోరికలతో మరణాన్ని పసి కట్ట లేక పోవచ్చు. బుద్దైతే అహంకారంతో కలుషితమై గుమ్మం దాక వచ్చేసిన  మరణాన్ని గుర్తించలేక పోవచ్చు. కాని శరీరం ముందుగానే పసి కడుతుంది.

మరణాన్ని పసి కట్టిన శరీరం ప్రకృతి యొక్క సతరు ఆజ్నను శిరసా వహించి కొన్ని చర్యలకు పాల్పడుతుంది. ఇదీ కాక ఒకతను మరణించ పోతున్నాడంటే ఆ సంగతి అతనికి తప్ప చాలా వస్తువులకు జీవాలకు తెలిసి పోతుంది. అందుకే మరణ పూర్వం కొన్ని సంఘఠణలు జరుగుతూ ఉంటాయి. అయితే మానవుడు వీటిని మరణముతో ముడి పెట్టి ఆలోచించ లేక ఏమారు పాటుగా ఉండి హఠాత్తుగా మరణిస్తాడు (?)

ఒక వ్యక్తి మరణించటానికి పూర్వం ఏం జరుగుతుంది?

* చిన్నప్పటి జ్నాపకాలు ఎక్కువగా వస్తుంటాయి.స్వగ్రామానికి వెళ్ళాలని చిన్ననాటి స్నేహితులను చూడాలని ఉవ్విళ్ళూరుతుంటారు
*తమ ముక్కు కొనను చూడలేక పోతారు (కనుపాపల పొజిషన్ కొన్ని డిగ్రీలు  లోపలికి తిరుగుతుంటాయి  కాబట్టి)
*పది ఇరవై సం.లుగా కనీశం కన బడని అప్పులవాడో, దూరపు చుట్టమో అప్పు కట్టమని లేదా సాయం చెయ్యమని రచ్చ చేస్తాడు
*చిన్ననాటి సంఘఠణలు మళ్ళి జరుగుతాయి. (చిన్న నాటి పేదరికం లేదా ఐస్వర్యం మళ్ళి తలుపు తడుతుంది)
*పాత మనుషులను చూసినప్పుడు ఎక్కువగా ఉద్రేకపడతారు (ఇంతకీ వారికి ఇతనికి పెద్దగా అవినాభావ సంభంధాలు కూడ ఉండవు
*ఇంటిలోని ఒక దేవుని పటమో, ముఖం చూసుకునే అద్దమో పగులుతుంది
*ఇంటి గోడకు పెద్దగా పగుళ్ళు రావచ్చు
*ఇంటిలోపలికి ఒక కాకి దూరి ఒక రవుండేసుకు పోతుంది
*ఇంటిలోని పెంపుడు జంతువో, గొడ్డు,గోదో చని పోతుంది/లేదా చాలా అప్రశాంతంగా వికృతంగా అరుస్తూ ఉంటుంది
*చాలా కాలంగా ఏ సమస్యా లేక పోతున్న గడియారం ఆగిపోతుంది
*చని పోనున్న వ్యక్తి కుర్చీనుండి జారి, తూలి పడతాడు,
*ఇతనికి మరణం సంభవించటానికి ముందు ఇంటిలోని ( కుటుంభ  సభ్యుల్లో ) ఒకరికి చాలా సీరియస్ అయ్యి సర్దుకుంటుంది)
*భాగా నడిచే స్థితిలో ఉన్న వ్యక్తైతే మరణానికి కొన్ని గంటల ముందో రోజుల ముందో చక్కగా ముస్తాబై భయిటకు వెళ్ళ పోతుండగా విరేచనాలవుతాయి

ఇటువంటి సూచికలు కనబడినప్పుడు మరణాన్ని ముందుగా పసి గట్టినప్పుడు ఆ మరణాన్ని ఎలా వారించడం? కనీశం ఎలా వాయిదా వేసుకోవడం?

ఈ వివరాలను తదుపరి టపాలో చూద్దాం.

1 thoughts on “మరణాన్ని ముందుగా గుర్తించడం ఎలా?

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.