సాంబారు అన్నది తమిళులకు ప్రీతి పాత్రమైన ఐటమ్. అందుకని తంఇళులను సాంబాగాళ్ళు అంటారు. హైదరాబాద్ లో టమోటా అని కూడా అంటారట. మానన్నకు నేటివ్  తమిళనాడు లోని ఆరణి, అమ్మకు  అరక్కోనం. బాల్యంలోనే చిత్తూరులో స్థిరపడిన మా నాన్న జిల్లా ఖజాణా అధికారిగా పని చేసారు.

నా మాతృ భాష తమిళమే అయినా ఎన్.టి.ఆర్ మీద అభిమానంతో తెలుగు నేర్చుకున్నాను. నాఉ నచ్చిన తెలుగు సిని గేయ రచయిత వేటూరి, స్క్రిప్ట్ రైటర్ పరచూరి బ్రదర్స్, డైరక్టరు కె.రాఘవేంద్రరావు.

ఇంతకీ నాకు బ్లాగ్ ప్రపంచంలో ఈ టైటిల్ ఎలా వచ్చిందో చెప్పాలిగా?

2009 ఎన్నికల్లో వై.ఎస్. మళ్ళీ  సెఇఎమ్ అవుతారని, చిరంజీవికి యాబై లోపే సీట్లు వస్తాయని. జ్యోతిష్య రీత్యా ముందుగా గణించి తెలపడంతో చిరు అభిమానులు, తెలుగు తమ్ముళ్ళు (తె.దే.పా కార్యకర్తలు ) నన్ను ఈ పద ప్రయోగంతో తిట్టేవారు.

ఈ పదం ఏదో విదంగా ప్రాభల్యం పొందటంతో  నా తదుపరి బ్లాగుకు ఈ పెరే పెట్టుకున్నాను

4 thoughts on “సాంబారు గాడి వృత్తాంతం

  1. కోరికలను అణచటం పారమార్ధిక విజయానికి దారితీస్తుంది. వైరాగ్యం దీనికి మార్గం. సంకల్పాలను అణచటం ప్రాపంచిక విజయానికి దారితీస్తుంది. అభ్యాసం దీనికి మార్గం…(జ్ఞానయోగం సమాప్తం)
    అద్భుతం అనే పదం చిన్నగా (క)అనిపించడం ఇప్పుడే అనుభవమయ్యింది. నిజంగా “నాన్నారూ” అనే పదం లో ఉన్న (ఉన్న)తత్త్వాన్ని తొలి నాలుగు పంక్తుల్లో పదాలుగా మలచిన తీరు ….మాటలు వెతుక్కుంటున్నా…super

  2. ఇంద్రియ విషయాలమీద కానీ, కర్మలమీద కానీ ఆసక్తి లేకుండా సంకల్పాలన్నీ విడిచిపెట్టినవాడిని యోగారూఢుడంటారు.
    సంకల్పము వలన కలిగిన కోరికలన్నింటినీ నిశ్శేషముగా త్యజించి, ఇంద్రియసముదాయములను అన్ని విధములుగా మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలెను.
    సంకల్పాలను అణచడానికి కోరికలను అణచి ఉంచాలనే నియమమేమీ లేదు. అలానే కోరికలనణచినవాడు సంకల్పాలను కూడా అణచాలనే నియమమేమీలేదు. ఎలా అయినా జరగవచ్చు. ఐతే కోరికలు, సంకల్పాలు రెంటినీ అణచినవాడు ఈ లోకంలో ఆదర్శపురుషుడు. గీతలో తనకు ఇష్టుడుగా గీతాకారుడు పేర్కొన్నది అతనినే. ఇట్టి ఆదర్శపురుషుడిలో జీవేచ్ఛే స్వభావంగా, స్వభావమే సంకల్పంగా మారి అంటే ఈ మూడునూ ఎట్టి వైరుధ్యాలు లేక ఒకటే అయిన పరిస్థితి ఏర్పడుతుంది.

    కోరికలను అణచటం పారమార్ధిక విజయానికి దారితీస్తుంది. వైరాగ్యం దీనికి మార్గం. సంకల్పాలను అణచటం ప్రాపంచిక విజయానికి దారితీస్తుంది. అభ్యాసం దీనికి మార్గం…(జ్ఞానయోగం సమాప్తం)
    అద్భుతం అనే పదం చిన్నగా (క)అనిపించడం ఇప్పుడే అనుభవమయ్యింది. నిజంగా “నాన్నారూ” అనే పదం లో ఉన్న (ఉన్న)తత్త్వాన్ని తొలి నాలుగు పంక్తుల్లో పదాలుగా మలచిన తీరు ….మాటలు వెతుక్కుంటున్నా…

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.