డబ్బును అర్థం చేసుకుందాం రండి !
(మిమ్మల్ని సంపన్నులు చేయగల డబ్బు గురించిన లైంగిక –మానసిక సత్యాలు )

చిత్తూరు.మురుగేశన్

ముందు మాట
గతంలో చిత్తూరు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జరిగిన డబ్బును అర్థం చేసుకుందాం రండి ! సెమినార్లో నేను చేసిన ప్రసంగం యొక్క పూర్తి పాఠం ఇది . మిమ్మల్ని సంపన్నులు చేయగల డబ్బు గురించిన లైంగిక –మానసిక సత్యాలు అని పాజిటివ్గా ట్యేగ్ లైన్ పెట్టినప్పటికి ఈ పుస్తకం ఖచ్చితంగా మీరు సంపాదించ లేక పోయినందుకు కారణాలను తెలుసుకునేందుకు ఉపకరిస్తుంది .పైగా సంపాదిస్తున్నవార్ని సంపాదించేలా చేసే అంశాలను తెలుసుకునేలా చేస్తుంది . దీంతో మీరు సంపాదించి సంపన్నులు అయ్యే అవకాశం ఉంది . లేదా ఓస్సి ఇంతేనా అని సం తృప్తి చెందే అవకాశమూ ఉంది .

సెమినార్ స్పాన్సర్ చేసిన చిత్తూరు ,శ్రీ కృష్ణా జ్యుయలర్స్ వారికి కృతజ్ఞతలు.
-చిత్తూరు .మురుగేశన్ 

సచ్చితానంద స్వరూపుడైన ఆ భగవంతుని అసలు సిసలైన వారసులారా !

డబ్బు గురించిన మర్మాల పై తల పెట్టిన ఈ సెమినారుకు పెద్ద ఎత్తున హాజరై ఈ సత్యాన్ని రుజువు చేసేరు. ఎందుకంటే డబ్బుతో ఆనందం కలుగుతుంది. ఈ భూ ప్రపంచం మీద ఉన్న ఏ మానవుడైనా ఆనందాన్నే కోరుకుంటాడు. ఎందుకంటే ప్రతి మానవుడు ఆ సచ్చితానంద స్వరూపుని అసలు సిసలైన వారసుడు కాబట్టి.

మీలో చిన్నవాళ్ళున్నారు,పెద్దవాళ్ళున్నారు,సంపాదనలో సక్సెస్ అయినవారున్నారు,కాని వారున్నారు. కాని ప్రతి ఒక్కరికి డబ్బు గురించిన మర్మాలను తెలుసుకోవాలన్న ఆసక్తి మాత్రం ఉంది. మనలో చాలా మందికి డబ్బు అంటె ఏమిటో అర్థం కావడం లేదు .

అదెప్పుడు వస్తుందో ,ఎంతవరకు ఉంటుందో ఎప్పుడు రాదో ,ఎప్పుడు పోతుందో కూడ తెలియడం లేదు . ఇవేమి తెలియకున్నా ప్రతి ఒక్కరం డబ్బు సంపాదింఛాలనే ఉవ్విళ్ళూరుతుంటాం.

ఎందుకు ? డబ్బు అవసరం కాబట్టి అని మీరు చెప్ప వచ్చు. నిజమే డబ్బు అవసరం ప్రతి ఒక్కరికి ఉంది , కాని అదేదో అవసరం మెరకే అయితే ఓకే ,మనకు ఎంత అవసరమో అంతే సంపాదించుకోవచ్చుగా ?

అలా జరగడం లేదే. ప్రతి ఒక్కరం అవసరం ఉన్నా లేకున్నా ఇంకా ఇంకా సంపాదించాలని తపిస్తున్నామే..ఎందుకు ? కుటుంభం కోసమే ఈ సంపాదన అని ప్రారంభించి చివరికి ఆ కుటుంభాన్ని ,భార్యా పిల్లలను ,తల్లి తండ్రులను సైతం నిర్లక్ష్యం చేసి సంపాదనకు మరికి సంపాదనలోని మునిగి పోతామే ?

ఈ తపన వెనుకున్న ప్రేరణ ఏది ? ఇంతకీ మనలో ప్రతి ఒక్కరం కాస్తో కూస్తో, ఎప్పుడో ,ఎక్కడో,ఎలాగో సంపాదిస్తూనే ఉన్నాం. అయినా ఇంకా ఇంకా అన్న ఆరాటం ఎందుకు మనలో కలుగుతుంది ? ఈ ఆరాటం వెనుక ప్రేరణ ఏది ?

సంపాదించాం ఖర్చులు పెట్టుకుంటాం అనే తత్వం దాదాపుగా ఎవరిలోను లేదే .ఎలాగన్నా దానిని దక్కించుకోవాలనుకుంటున్నాం . దాచుకోవాలని అనుకుంటాం. డబ్బు మరి అవసరానికి మించిన డబ్బు,

ఖర్చు పెట్టడానికి ఇష్ఠం లేని డబ్బు ,బ్యాంకు ఖాతాలో,ఇనుప పెట్టెలో మరుగుతున్న మగ్గి పోతున్న డబ్బు మనకు ఏం ఇస్తుంది ? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుస్తే కాని డబ్బు గురించిన మర్మాలను మనం చేధించ లేము.

డబ్బు మానవ జీవన విధానంలో విడదీయలేని భాగమై చాలా కాలమే అయ్యింది. ఒక వస్తువు గురించిన మర్మాలను తెలుసుకోవాలంటే దాని పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవాలి. మద్యలోనుండి చదవడం మొదలు పెడితే పావలా తెలుగు నవలలు సైతం అర్థం కావు.

డబ్బును ప్రవేశ పెట్టింది మానవుడే. మానవుడు డబ్బును ప్రవేశ పెట్టిన నాటి నుండి అది మానవుని మనస్సు,బుద్దితో పెనవేసుకుని ఉంది. విడ దీయ లేని భాగమైంది. మానవుడు ప్రవేశ పెట్టిన డబ్బు మానవుడిని శాసించే స్థాయికి వచ్చింది . ఇదెలా జరిగింది ? తెలుసుకుందాం. ఈ ప్రశ్నకు సమాదానం చరిత్రలో లేదు..మనో తత్వ శాస్త్రంలోను లేదు. మరెక్కడుంది ? సృష్ఠి ఆదిలో ఉంది.

కాబట్టి మనం మావవుని సృష్ఠి ఎలా జరిగిందన్న పాయింట్ నుండి ప్రారంభిస్తే కాని డబ్బు ఎలా పుట్టిందో, తనను సృష్ఠించిన మానవుడినే శాసించే స్థాయికెలా ఎదిగిందో అర్థం చేసుకోవడం కష్ఠ తరం అవుతుంది.

సృ)ష్ఠి:
ఒక మహావిశ్ఫోటంతోనే ఈ భూమి పుట్టిందని .సముద్రంలోనే మొదటి జీవ రాశి పుట్తిందని అది ఏక కణ జీవి అయిన అమీభా అని సైన్స్ చెబుతూంది. ఆ ఏ కణం బలిసి తనను తాను కాపి చేసుకుని స్వతంత్రించి వ్యాపించింది. ఆ తరువాత కాపియింగ్లో ఏర్పడ్డ జెనటిక్ ఎరర్స్ తో –మ్యూటేషన్ తో కొత్త జీవాలు పుట్టాయి ఈ క్రమంలోనే కోతి – కోతినుండి మానవుడు వచ్చారు .డార్విన్ చెప్పిన ఎవాల్యూషన్ థియరి ఇది .

ఆదిలోన మొట్ట మొదటి అమీభా పుట్టినప్పుడు ఒకటే శరీరం,ఒకటే ప్రాణంగా ఎటువంటి లక్ష్యం,గమ్యం,భయం బెంగ,కాలం గురించిన ద్యాస,పోటి,ఆత్మ రక్షణలకు అవసరం లేక నిశ్చింతగా ఉండి ఉంటుంది. అలా ఉన్న ఆ స్మ్రు)తులు ప్రతి జీవిలోను దాని మస్తిష్కపు పొరల్లో దాగి ఉన్నాయి.ఉంటున్నాయి .ఉంటాయి. మన ప్రతి చర్యకు మూలం ఇదే. (సంపాదనతో సహా)

విలీనం:
ఆ చీకు చింత లేని మధుర స్మ్రుతులు ప్రతి జీవిని ప్రేరేపిస్తూనే ఉంది . ఈ సృ)ష్ఠితో –సాటి జీవులతో విలీనం కమ్మని. ఆవిలీనం ఎలా జరగాలి ? ఆ విలీనానికి అడ్డు ఏమిటి ?

జంతువుల కథ వేరేగా సాగుతుంది. వాటికి సృష్ఠికి మద్య విలీనం చెదిరి పోలేదు.జంతువుకు జంతువుకు మద్య అనుసందానం /కమ్యూనికేషన్ చెడి పోలేదు. పెంపుడు జంతువులు సైతం వేరే వేరే యజామణుల చేత /వేరే వేరే ప్రాంతాల్లో పెంచ బడినా వాటి ప్రవర్తన ఒకేలా ఉంటుంది.

గ్రహణకాలంలో కాని భూకంపం వంటి ప్రకృతి వైపరిత్యాలు జరుగనున్న వేళల్లో కాని వాటి ప్రవర్తన ఒకేలా ఉంటుంది. ఇందుకు కారణం ఏమంటే వాటిలో నేను అనే స్ఫురణ లేనే లేదు.

మానవునికి దగ్గరగా ఉన్న జంతువుల్లో మానవుని పుణ్యమా అంటూ కొంత వరకు ఈ స్ఫురణ ఉన్నా తన జాతి అందించే సందేశాలను వాటి మస్త్రిష్కాలు ఇట్టే స్వీకరిస్తాయి.స్పందిస్తాయు.

నేను :
బిడ్డ నేను అనే స్ఫురణ లేకనే పుడుతుంది. అందుకు తనకు –తన ఆట బొమ్మకు తేడా తెలీదు. దానిని కూడ పాప అనే అంటుంది. ప్రాణం లేని డెడి బేర్ బొమ్మను తన తమ్ముడిలా/చెల్లెల్లా చూసుకుంటుంది. కాని క్రమేణా ఆ బిడ్డలో నేను అనేది పెరిగి ఈ భూ ప్రపంచమంతా తన చుట్టే తిరగాలి అనే స్థాయికి వెళ్ళి పోతుంది . దీనినే అహం అంటారు .

శరీరం పై అలక:
మానవులు ఏ చర్యకు పాల్పడినా వాటి వెనుక ఉన్న ఏకైక ఉద్దేశం చావడం లేదా చంపడమే అని మనోవైజ్నానికులు తేల్చారు. ఎందుకు చంపాలి ? ఎందుకు చావాలి ? ఈ సృ)ష్ఠితో విలీనానికి అడ్దంగా ఉంది కాబట్టి శరీరాన్ని త్యజించాలి అన్న భ్రమ మానవునిలో నాటుకు పోయింది.

మాంసాహారుల ద్యేయం కూడ ఇదే. మానవునికి నేను అనే ఈగో పెద్ద తలనొప్పిగా మారింది. ఆత్మకు నకలుగా మారింది. ఆత్మను కప్పివేసే తెరగా,పొరగా మారింది. కొంత కాలానికి ఆత్మంటూ ఏది లేదని వాదించే స్థితికి తెచ్చింది. తన అహం దెబ్బ తింటే తనె మరణించినంతగా కృంగి పోతాడు మానవుడు. ఈ సృష్ఠికి తనను కేంద్ర భింధువుగా ఊహించుకుని ఆలోచించడం మొదలు పెడతాడు. ఆ అహం ఇచ్చే ప్రేరణ ఇది. మానవులు పరస్పరం విలీనం కావడానికి సృష్ఠితో మమేకం కావడానికి ఈ శరీరాలే అడ్డమన్నతప్పుడు సంకేతాన్ని,సందేశాన్ని ఇచ్చింది మన అహం.

అందుకేనేమో ప్రతి ఒక్కరం ఒకరి అహాన్ని మరొకరు దెబ్బ కొట్టడానికి / తుడిచి వేటానికి సర్వదా కృషి చేస్తుంటాము. అహం తొలిగితే అర్థమవుతుంది. తను ఈ సృష్ఠికి కేంద్ర భింధువు కాదని. తను ఇప్పటికే సమస్త సృష్థితో విలీనమై ఉన్నాడని.

మరణ భయం:
ఎప్పుడైతే మానవుడు తనను ఈ సృష్ఠికి కేంద్ర భిందువుగా భ్రమించడం మొదలు పెట్టాడో /ఎప్పుడైతే అతనిలో అహం పుట్టిందో అక్కడనుండి అతనిని మరణ భయం పట్టుకుంది.

సృష్ఠి ఒడిలో నిశ్చింతగా ఉన్న మానవుడు కాల క్రమంలో అహం పెంచుకున్నాడు. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ప్లేగు వ్యాధి సోకినప్పుడు లక్షలాది మంది కుప్పలు తెప్పలుగా చని పోయారు ఎందుకంటే మనిషిలో సెల్ఫ్ అనేది చాలా పలుచగా ఉన్న రోజులవి.

ఇప్పట్లో కూడ ఒక కోళ్ళ ఫారంలో ఒక కోడికి జబ్బు చేస్టే చాలు ఆఫారంలో ఉన్న వేలాది కోళ్ళు ఇట్టే వ్యాధి సోకి చచ్చి పోతాయి. ఎస్.టి.ల తాండాల్లో చూడండి వ్యాది సోకితే ప్రతి ఒక్కరికి ప్రవలి పోతుంది. ఎందుకంటె వారిలో వారి మద్య కంటికి కనబడని ఒక అనుసందానం ఉంది. వారు తమకు జరుగుతున్నవాటిని ఏమాత్రం ప్రశ్నించ లేనంతగా సెల్ఫ్ లెస్ గా ఉన్నారు. అంటు వ్యాధులు గ్రామాల్లో ప్రవలినట్టుగా నగరాల్లో ప్రవలడం లేదు. ఎందుకంటే మన మద్య అనుసందానం లేదు. ఆ లింక్ ఊడి పోయింది. ఊడ కొట్టింది మన అహం.

పునరభి జననం పునరభిమరణం :
స్ర్ష్ఠిలో మరణమన్నది సర్వ సాధారణమైన ఒక సంఘఠణ. పునరభి జననం పునరభిమరణం. కాని అహంతో నిండిన హృదయం మరణాన్ని వ్యతిరేకిస్తుంది. ఈ వ్యతిరేకతతో మరణం చాలా భలీయమైంది. ఇలా విశ్వరూపం దాల్చిన చావు భయం ఒక వైపు తరుముతుంది.

ఈ మరణ భయం నుండి విడిపడాలంటే ఉన్నది ఒకే మార్గం అది మరణించడం. మరణీంచిన వానికే చావు భయం ఉండదు గా?

ఒక వైపు మరణ భయం బెంబేలెత్తించినా , మరో వైపు సృష్ఠితో విలీనానికి అడ్డంగా తాను భావించే శరీరం మరణంతో రాలి పోతుందన్న స్ఫురణ మానవుడ్ని చావుకేసి నడపడం కూడ మొదలు పెట్టింది.

చీకటి మరణానికి ప్రతీక. అందుకే మానవుడు అగ్నిని పూజించాడు,సూర్యుడ్ని పూజించాడు. చంద్రుడ్ని పూజించాడు. ఏకాంతం మరణానికి ప్రతీక. ఇతరులతో కమ్యూనికేట్ కాక పోవడం మరణానికి ప్రతీక .అందుకే మానవుడు గుంపులుగనే బ్రతికాడు. అడవులు అతని అంత:కరణంలోని ప్రాథమిక – ప్రధాన ఇచ్చలు నెరవేరడానికి వీలు కల్పించింది.

చావుతో చెలగాటం :
ఏదైనా దాడులు జరిగినప్పుడు ఆఠవికం-పాశవికం అని విలెకరులు వ్రాస్తుంటారు.నిజానికి మానవుడు ఆఠవిక జీవితంలోనే –పాశవిక జీవితంలోనే ఎటువంటి కాంప్లెక్స్ /ఫోబియాలు లేక బ్రతికాడు.

ఆఠవిక జీవితం ఎన్నెన్నో ఆపదలతో కూడుకున్నది . కృర మృగాలు, విష సర్పాలు ఏ క్షణమన్నా మరణం కర చాలనం చేయ వచ్చు . మానవ మస్తిష్కంలో నిక్షిప్తమైన ఆ రెండు కోరికలు స్థూలంగానే నెరవేరాయి (చంపడం –చావడం)

కాలమే కాలుడు: కాలాతీత స్థితియే స్వర్గం:
ఆరణ్య వాసంలో సెక్స్ అన్నది కేవలం అంత:కరణ స్ఫురణతో తనంతట తనే తఠస్థించే ఒక రిఫ్లెక్స్ యాక్షన్గా మాత్రమే మొదలయ్యుండాలి

చెప్పలేని –వర్ణనాతీతమైనటువంటి అదో రకమైన ఇబ్బందిని తొలగించుకునే చర్య మాత్రమే అయ్యుండాలి .అదో రకమైన రిలీఫ్ /విముక్తిలా ఉండి ఉండాలి .కాల కృత్యం తీర్చుకునే తరహాలోనే ఉండి ఉండాలి. ( కారణం క్షణం క్షణం –ఏ క్షణమన్నా కాసింత ఏమారుపాటుగా ఉన్నా / కన్నార్పినా మరణంతో కర చాలనం చేయవలసి వస్తుందనేటువంటి విపత్కర పరిస్థితులు)

మానవుడు ఆరణ్యం వదలి సంచార జీవిగా మారినప్పుడు – కౄర జంతువులు ,సర్పాలు తదితర సవాళ్ళు లేని ప్రాంతాల్లో స్వల్ప కాలమైనా మకాం వేసినప్పుడే అతనిలో సెక్స్ గురించిన పరిశీలన మొదలై ఉండాలి . ఆరణ్య వాసంతో పోల్చుకుంటే సంచార వాసంలో ప్రాణహానికి అవకాశం కొద్దో గొప్పో తగ్గడంతో ఈ పరిశీలనలు సాధ్యమై ఉండాలి . అదే సమయంలో అంతర్లీనంగా తన ప్రాథమిక కోరికలైన చంపడం –చావడం అనే రెండిండికి ప్రత్యామ్నాయ వెతుకులాట కూడ మొదలై ఉండాలి .

ఆఠవిక జీవితంలో కన్నా సంచార జీవితంలో గుంపు – గుంపు నాయకుడు – విధి విదానాలు ఇంకాస్త కరకుగా మారి ఉండాలి . ఇష్ఠమొచ్చిన వాడి పై ఇష్ఠమొచ్చినప్పుడు దాడి చేసే /చంపే స్వాతంత్ర్యం తగ్గి ఉండాలి . అందుకే చావడానికి చంపడానికున్న అవకాశాల కాస్త తగ్గే సరికి మానవ మస్తిష్కం వీటికి ఆల్టర్నేటివ్ గురించిన వెతుకులాటను మొదలు పెట్టి ఉండాలి .

సెక్స్ లో పురుషునికి వీర్య స్కలనం జరిగే వేళ / స్త్రీకి భావ ప్రాప్తి కలిగే వేళ తఠస్తించే కాలాతీత స్థితి మరణాన్ని పోలి ఉండడంతో దాని పై ఆసక్తి పెరిగింది .

సంచార జీవితానంతరం స్థిర వాసం ఏర్పడినప్పుడే ఈ అన్వేష్ణ – అద్యయనం ఇంకాస్త ఎక్కువయ్యుండాలి . అప్పుడే ఇంకొన్ని విషయాలను మానవుడు తెలుసుకొని ఉండాలి .

స్త్రీ) 60 శాతమే స్త్రీ) , ఆమెలో 40 శాతం పుంశత్వం ఉంది. పురుషుడు 60 శాతమే పురుషుడు, అతనిలో 40 శాతం స్త్రీత్వం ఉంది. (60 -40 అన్నది శిలా శాసనం ఏమి కాదు – మనిషి మనిషికి ఈ రేషేలో తేడా ఉండొచ్చు గాక )

ఏ స్త్రీ) కూడ సంపూర్ణ స్త్రీ) కాదు. ఏ పురుషుడు కూడ సంపూర్ణ పురుషుడు కాడు. అర కొరే ! ఇది వరకే చెప్పినట్టుగా విలీనమే, విలీనంతో నిండుతనమే అంత:కరణంలోని ఇచ్చగా ఉన్నప్పుడు ఇలా అర కొరగా ,అనాధలుగా బ్రతకాటానికి మానవుడు ఎలా ఇష్ఠపడతాడు.

అందుకే స్త్రీ) ,పురుషునితో కలిసింది , తనలో ఉన్న పుంశత్వ లోటును పూడ్చుకునే ప్రయత్నం చేసింది. పురుషుడు స్త్రీ)తో కలిసాడు. తనలో ఉన్న స్త్రీ)త్వ లోటును పూడ్చుకునే ప్రయత్నం చేసాడు. ఇలా సభ్య సమాజం కేవలం శారిరక ఇచ్చలు అని కొట్టి పారేసే సంయోగం మానవునికి ఎన్నో విదాలుగా అతని ప్రాధమిక ఇచ్చను, సృష్ఠితో విలోనం కావాలన్న తపనకు ఊరట కల్గిస్తూ వచ్చింది.
స్థిరవాసంతో వచ్చిన చిక్కు :
తను కండలు కరిగించి సాగుకు అర్హంగా మార్చిన పొలం ,అదనపు పంట వ్యక్తిగత ఆస్తులుగా మారాయి. ఇవి తన మరణానంతరం తన వారసునికే చెందాలన్న కకృత్తి మానవునిలో కలిగింది.

ఇక స్త్రి) పై అనచి వేత మొదలైంది. . సెక్స్ సెకండరిగా మారి వారసుడు ప్రాధమిక లక్ష్యమయ్యాడు. స్త్రీ) బంధీ అయ్యింది. పోరాటమయమైన ఆఠవిక జీవితంలో పురుషునికి సమానమైన భలం పొందియున్న స్త్రీ) ఇంటి పట్ల ఉండి శారిరకంగా బలహీనురాలైంది. అన్యులు ఎవరు ఆమెతో సంయోగం నడిపి సంతానోత్పత్తి చేసేసే ప్రమాదం ఉంది కాబట్టి /ఆమె యోణిని బంధించ లేని పురుషుడు ఆమెనే బంధించేసాడు .

ఏకాకి:
ఏకంగా సృష్ఠితోనే విలీనం కావాలని కోరుకున్న స్త్రీ) పురుషులు తమలో తామే మానసికంగా విడిఫోయేరు. మానవుడు మరింత సభ్యత సాధించే సరికి సెక్స్ దాదాపుగా నిషేదించ బడింది. సెక్స్ కు ప్రత్యామ్నాయం అవసరమైంది. వాడు చావాలి లేదా చంపాలి ,స్థి)రవాసంతో ఈ అవకాశాలు తగ్గి పోయాయి. యుద్దాలు వచ్చినప్పుడుకదా చంపడాలు,చావడాలు !
సెక్స్ సెకండరి అయ్యింది. ఈ రోజుల్లో లాగా కు.ని ఉండదు కాబట్టి ,యుద్దాలకు వీరులు అవసరం కాబట్టి,పొలాల్లో పని చెయ్యడానికి మానవ వనరులు అవసరం కాబట్టి, పుట్టిన పిల్లలు రోగాల భారిన పడి ఎప్పుడన్నా చచ్చి పోయే ప్రమాదం ఉంది కాబట్టి స్త్రీ) పిల్లలను కనిపెట్టే మెషిన్ గా తయారైంది.

ప్రత్యామ్నాయం:
స్థిరవాసంతో అదనపు పంట ఏర్పడింది. ఉండ మార్పిడి మొదలైంది. మానవుడు తాను చావడానికి,చంపడానికి, ఈ సృష్ఠితో విలీనం కావడానికి మరణం,సెక్స్ లకు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుంటున్న సమయంలో స్వర్ణం కనుగొన్నాడు. తక్కువ డెనామిషన్లోని లావాదేవికి స్వర్ణం ఉపకరించదు కాబట్టి నాణాలు వచ్చాయి.అదే డబ్బు.

అదనపు పంట ఎలా సాధ్యమైంది ? వాడు చచ్చి సున్నమైతే వచ్చింది. ఆ అదనపు పంటతో డబ్బు వచ్చింది. ఆ డబ్బు సెక్స్ కు ప్రత్యామ్నాయంగా ఉండడం అతని మనస్సుకు భాగా నచ్చింది.(సబ్ కాన్షియస్ మైండ్)

డబ్బుతో చావనూ వచ్చు. చంపనూ వచ్చు. అందుకె డబ్బు మీద పడ్డాడు మానవుడు. డబ్బు డబ్బును సంపాదించటం మొదలు పెట్టింది. అంటె పిల్లలు పెట్టింది. అతనిని సమాజంతో కమ్యూనికేట్ చేయగలిగేట్లు చేసింది. ఇంకేముంది డభ్భు మాయలో పడ్డాడు మానవుడు. అందుకు పూర్వం శారీరకంగా ఒక్కసారిగా చచ్చే, చంపే దమ్ము దైర్యం చాలని వాడు వాయిదాలలో చచ్చే వాడు. చంపే వాడు.

డబ్బు సంపాదించటానికి ఆ దమ్ము,దైర్యం,అంగ భలం అవసరం లేదు కాబట్టి డబ్బు మానవుడ్ని బలే భాగ ఆ కట్టుకుంది. అది ఎందాక వెళ్ళిందంటే ..అతను ఏ సెక్స్ కు ప్రత్యామ్నాయంగా ఈ డబ్బును ఎంపిక చేసుకున్నాడో ఆ సెక్స్ నే మరిచి పోయేంతగా ఆకట్టుకుంది.

భాగా డబ్బున్న సెలిబ్రిటిస్ (ఆడా/మగ ) మెనోఫస్ సమయంలో తమకంటే వయస్సులో చాలా చిన్నవారిని ఉంచుకోవడం /పెళ్ళి చేసుకోవడానికి కూడ ఇదే కారణం. సెక్సుకు ప్రత్యామ్నాయంగా డబ్బు మీద పడినా – ఒక దశలో ఇది ప్రత్యామ్నాయమే అన్న జ్ఞానోదయం కలిగి ఇలా చేస్తుంటారు . కొందరు డబ్బుతో సెక్సును కొనుక్కుంటారు

డబ్బుతో ఏం చేస్తాం? పప్పు ,ఉప్పు,భియ్యం కొంటాం !
ఎందుకు తినకుంటే చచ్చి పోతామా ? నేను 10 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసాను. మొదటి రోజైతే భాగా ఆకలైంది. రెండో రోజునుండి ఆకలి శుద్దంగా లేదు.. మళ్ళీ ఐదో రోజో ఆరో రోజో కాస్త ఆకలైంది. పదవ రోజుదాకా ఆకలంటే ఏమో కూడ మరిచి పోయాను.
మరి ఎందుకు తింటున్నాం ? రోజూ తింటున్నాం. మూడు పూట్ల తింటున్నాం. వండి,ఉడక పెట్టి,వేంచి,తాలింపు చేసి, తింటాం. మూడు పూటలు తింటున్నాం. ఇది చాలక స్నేక్స్,ఐస్ క్రీం . బ్రతకడానికి తింటున్నామా ? లేక తిని తిని చావడానికి తింటున్నామా ? బహుసా బతకడానికి అన్న ముసుగులో చావడానికే తింటున్నామేమో ?
మరి చావడానికేనా డబ్బు ? చావడానికేనా డబ్బు సంపాదిస్తున్నామా?

ప్రతి మానవునిలోను ఈ సంస్థ ప్రాణకోటిని దాచుకునే వెలితి ఉంది . దానిని ప్రేమానురాగాలతో నింపడం తెలీక / నా చెత్తతో ఆ వెలితిని నింప చూస్తున్నాం.

బాడుగలు కడుతున్నాం / లేదా హవుసింగ్ లోన్ వాయిదాలు కడుతున్నాం:
ఏ మాత్రం గాలి ఆడని, సూర్య చంద్రుల వెలుతురు తొంగి చూడని ,వాన నీటి చుక్కన్నా పడని ఇళ్ళకు వేలాది రూపాయలు బాడుగలు కడుతున్నాం. కొన్ని బాడుగ ఇళ్ళల్లో అయితే గేట్ బీగాలు ఇంటి ఓనర్ వద్ద ఉంటుంది. రాత్రి పదికంతా గేట్ లాక్ చేస్తారు. మీరు ఇల్లు చేరడానికి రాత్రి పదై పోతే మీ బతుకు బస్ స్టాండే ! ఇలా ఒకటి కాదు రెండు కాదు సవా లక్షా ఉన్నాయి

ఇక స్వంత ఇల్లు నిర్మించిన వారి కథ చూస్తే జీవిత కాలపు పొదుపును దార పోసి జీవిత కాలపు అప్పులతో , అడ్డమైన పన్నులు కడుతూ ఉన్నారు, ఇవన్ని మనం బతకాలనా ? చావాలనా?

స్త్రీతో (భార్య) ఎటువంటి అవరోధాలు లేక అనుసందానం కావడం కోసమే ఇల్లు . కాని బెడ్ రూంలో సైతం భార్య ఒక ఫోన్లో వాట్సప్ చూస్తుంటే / భర్త మరో ఫోన్లో ఫెస్ బుక్ చూస్తున్నాడు . ఒంటరి తనం మరణం.

కరెంటు బిల్లులు కడుతున్నాం:
మన రాష్ఠ్రంలోనైతే బాబు గారి రాక మునుపు కరెంటు ఎప్పుడుంటుందో, ఎప్పుడు పోతుందో తెలీదు. బాబోరు సంస్కరణల పుణ్యమా అంటూ పవర్ కట్ లేకున్నా ఎడా పెడా విద్యుత్ చార్జీలు పెంచి పడేసారు . డిమాండ్ థియరి ప్రకారం దర పెరిగితే డిమాండు తగ్గాలి ..కాని విద్యుత్ వినియోగం ఏమాత్రం తగ్గలేదు .పైగా పెరుగుతూనే ఉంది . మనం కరెంటు బిల్లులు కడ్తూనే ఉన్నాం. ఆఖరు తేది దాటితే యాభై రూపాయల ఫైన్ తో కూడ కడుతున్నాం.

మిక్సీలు,గ్రైండర్లు,ఎలక్ట్రిక్ కుక్కర్లు,వాషింగ్ మెషిన్లు పని చెయ్యడంతో మన ఇంట్లోని స్త్ర్రీలు బొత్తిగా వ్యాయామం లేక స్థూల కాయులై, బి.పి, షుగర్ వ్యాదులకు గురవుతున్నారు. చచ్చు టి.వి.సీరియళ్ల మద్యలో వచ్చే అడ్వర్టైజ్ మెంట్ బ్రేకుల్లో అన్నం పెడుతుంటారు అయినా సంపాదిస్తూనే ఉన్నాం కరెంటు బిల్లులు కడ్తూనే ఉన్నాం. ఇవన్ని మనం బతకాలనా ? చావాలనా?
లేదు చీకటి మరణం .విద్యుత్ వెలుగులు దాన్ని తరుముతాయి. నిశబ్దం మరణం .విద్యుత్ దాన్ని దూరం చేస్తుంది .( కాలింగ్ బెల్ మొదల్గొని టివిల దాక)

మొబైల్ ఫోన్స్ కొంటున్నాం ఫోన్ బిల్లులు కడుతున్నాం:

ఫోన్ ఏం చేస్తుంది ? ఈ ప్రపంచముతో మనలను అనుసందానం చేస్తుంది. నేను ఒంటరిని కాదు అన్న సంగతిని గుర్తు చేస్తూ ఉంటుంది. ఒంటరి తనం మరణంతో సమానం.

మొబైల్ ఫోన్ మనలను ప్రపంచంతో అనుసందానం చేస్తుందట. నిజంగా..నిజంగా అది అనుసందానం చేసేది ప్రపంచముతోనా ? కాదే ఎంత బిజిగా ఉండే ఏ మొబైలరునన్నా తీసుకొండి. అతనితో నిత్యం అనుసందించబడి ఉన్న కాలర్స్ ను వేళ్ళ మీద లెక్క పెట్ట వచ్చు.

పోనీ ఆ అనుసందానమన్నా ఆనందాన్ని ఇస్తుందా ? లేదే…………..రకరకాలైన ఇబ్బందులు.

టూ వీలర్లకు/ఫోర్ వీలర్లకు పెట్రోలు కొట్టిస్తాం:
పొల్యూషన్ ……….ఏయిర్ పొల్యూషన్ ,సౌండ్ పొల్యూషన్,ప్రమాదం జరిగే ప్రమాదం. ఇవి దూరాన్ని గెలిచే శక్తినిస్తాయి. మన వారికి మనం దూరంగా ఉండడం మరణం . ( సరే అంత త్వరగా ఇంటికొచ్చి చేసేదేమి? భార్య భర్తతో / భర్త భార్యతో – తల్లి తండ్రులు కొడుకు కూతుళ్ళతో గొడవపడడమే కదా –కాని గొడవ పడడం కూడ ఒక రకమైన కమ్యూనికేషనే గా)

పిల్లల స్కూలు ఫీజులు , ట్యూషన్ ఫీజులు కడుతున్నాం:
పిల్లలను విపరీతంగా కొడుతున్నారని,మానసికంగా హింసించడంతో పిల్లలు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని,లైంగిక వేదింపులకు గురవుతున్నారని పత్రికల్లో చదువుతూనే ఉన్నాం. పిల్లలకి విపరీతమైన మానసిక వత్తిడినిచ్చే విద్యను వారిపై రుద్దుతున్నాం.

టేప్ రెకార్డర్లు వచ్చి ఎంతో కాలమైనా పిల్లల మస్తిష్కాలను కేవలం రికార్డర్లుగా మార్చుతున్నాం ఇలా ఒకటి కాదు రెండు సవా లక్షా ఖర్చులు పెడుతున్నాం . ఇవన్ని మనం బతకాలనా ? చావాలనా?

లేదు పిల్లలను మీ కొనసాగింపుగా భ్రమిస్తారు . పార్ట్ టూ సినిమాగా భావిస్తారు . బాల కృష్ణ ఎన్.టి.ఆర్ కొనసాగింపా ? పార్ట్ టూనా ? గాడిదె గుడ్డేం కాదు ?

పొదుపు:
ఇవి చాలక మనలో చాలా మంది పొదుపు కూడ చేస్తుంటాం. ప్రభుత్వ రంగ సంస్థల్లో అయితే సర్వీసు బెటరుగా ఉండదని ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల్లొ అధిక వడ్డికి ఆశ పడి పెట్టి గోచీ సైతం ఊడిపోతుంది. (లేటెస్ట్ అగ్రి గోల్డ్ – ఏదో కొత్త సి.ఎం పుణ్యమా అంటూ ఎంతో కొంత రికవరి కావచ్చు కాక )

పోని నేష్నలైజ్డ్ బ్యాంకుల్లో మన డబ్బు దాచుకుంటామనుకుంటే వారు మాల్యా ,లలిత్ మోడీలకు ఎడా పెడా అప్పివ్వడం వారు దేశం వదిలి వెళ్ళి పోవడం జరుగుతుంది . నరేంద్ర మోడి అయితే ఏకంగా మీ జేబులోని కరెన్సి నోటు చెల్లదని నరకం చూపాడు . అయినా ఆ తరువాత జరిగిన యుపి ఎన్నికల్లో భాజపా బంపర్ మెజారిటి సాధించింది . దీని వెనుక ఉన్న సైకాలజి ఏంటో అడిగితే చెబుతా .

కొంత దైర్యం చేసి షేర్ మార్కెట్ లోనే పెట్టుబడి పెడితే ఎవడో బాత్ రూంలో కాలు జారి పడినా, మరి ఇంకెవడో తాగి పడిపోయినా షేర్ మార్కెట్ కుప్ప కూలి పోతుంది ఎందుకొచ్చిన గొడవా అని మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే అది కాస్త షేర్ మార్కెట్లోకే వెళ్తుంది ,ఎల్.ఐ.సి పాలిసి తీసుకుంటామంటే 3 సం.లు ప్రిమియం కట్టి ఉంటేనే మన వినతులు పరిశీలిస్తారు . మరి మన సంపాదనలు బతకడానికా చావడానికా?

ఇందాకా చెప్పుకున్న అంశాలను పాయింట్ టు పాయింట్ ఇప్పుడూ చూద్దాం .

1.ప్రతి మానవుడు సచ్చితానంద స్వరూపుడైన భగవంతుని వారసుడు
2. అతనికి ఆనందంగా జీవించే హక్కు- అవకాశం
3. సృష్ఠి ఆదిలోన ఆవిర్భవించిన తొలి ఏక కణ జీవిలోని ఒక్క ప్రాణమే మన అందరి ప్రాణాలకు మూలం
4.ఒకే శరీరంగా, ఒకే ప్రాణంగా పోటి, అభధ్రత,కాలం,లక్ష్యం,గమ్యం లేక గడిపిన ఆ నిశ్చింత జీవితం గురించిన తియ్యటి శ్మృతులు ఇంకా మన మస్తిష్కపు పొరల్లో దాగి ఉన్నాయి.
5.పోటి, అభధ్రత,కాలం,లక్ష్యం,గమ్యం ఇవన్ని మరో ప్రాణి ఉంటేనే సాధ్యం
6. ఆ నిశ్చింత జీవితం గురించిన శ్మృతులు మనిషిని మళ్ళి ఆ స్థితిని పొందటానికి ప్రేరేపిస్తున్నాయి
7. అయితే ఇప్పటికే మనమందరం ఒకే ప్రాణంగా ఉన్నామని , మన మద్య భలమైన అనుసంథానం ఉందని – అందుకు మన అహం ఒక్కటే ఆటంకం ని గుర్తించ లేక పోతున్నాం.
8. అయితే మానవుడు మళ్ళి ఒకే ప్రాణంగా మారడానికి ఈ శరీరాలే అడ్డమని లోలోన భావించి పప్పులోకాలేస్తున్నాం.
9. సైక్రియాట్రిస్టులు మానవుని ప్రతి చర్య వెనుక చంపే/చచ్చే కోరికలు దాగి ఉందని చెబుతుండటం సబబేనని అయితే ఆ కోరికకు కారణం శరీరాలను వదిలించుకుని మళ్ళీ ఒకే ప్రాణంగా ఏకం కావడమే
10.మళ్ళీ ఏకమయ్యే ప్రయత్నంలో భాగమే రతి
11. స్థిరవాసం కారణంగా ఆస్తి ఏర్పడిందని, ఆస్తికి వారసుడు కావాలన్న తపనతో పురుషుడు స్త్రీ పై అనచివేత మొదలు పెట్టి ఏకాకి అయ్యాడు
12. స్త్రీ అనచి వేతతో ఆమె పై పూర్తి విశ్వాశం ఉంచ లేక పోయిన పురుషునికి రతి పెద్దగా రుచించక పోయింది.
13. అందుకు ప్రత్యామ్నాయంగా డబ్బును ఎన్నుకున్నాడు (సబ్ కాన్షియస్ మైండులో)
14. రతితో ఏవైతే సాధ్యమో అవన్ని డబ్బుతో కూడ సాధ్యమని, రతి కూడ సాధ్యం
15.ఈ భ్రమలు –కల్పనలు –కాంప్లెక్సులతోనే డబ్బుకు ఎనలేని ప్రాధన్యత ఇస్తూ తాను ప్రవేశ పెట్టిన డబ్బుకు తనే భానిసయ్యాడు .
16.డబ్బును కేవలం డబ్బుగా చూస్టే ఎవరన్నా సంపాదించ గలరని. కాని డబ్బును సర్వ రోగ నివారణిగా ,సంజీవణిగా భావించి ఆతృతతో ప్రయత్నిచటం వలనే ఆ ప్రయత్నం బెడిసి కొడుతుంది.
17.మానవుడు డబ్బును కాలం –దూరం –చీకటి –ఒంటరితనం వంతి మరణం యొక్క ప్రతీకలతో తాను చేశే యుద్దానికి ఆయుధంగా వినియోగిస్తాడు.
18.ఆకలి , చీకటి,అవిద్య,ఒంటరితనం,కాలచక్ర కదలిక,ముసలితనం, నిరాకరణ, అవమానం ఇవన్ని మరణానికి ప్రతీకలుగా మానవ మస్తిష్కంలో నిక్షిప్తమై ఉన్నాయి.
19. ఇలా అన్నింటిని మరణంతో ముడి వేసి ఆలోచించి వీటిలోనుండి డబ్బు తనను రక్షిస్తుందని భావించే సంపాదనకు పరిమితమైపోయాడు మానవుడు
20.సంపాదనకు అనువుగా తన శరీరం,మనస్సు,బుద్ది,, కుటుంభం, మిత్రులను మలచుకోగలిగితే సంపాదన అందరికి సాధ్యమే

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.