మేషం:
మీరు జస్ట్ ఒక సైనికులు వంటివారు. మీకు ఖచ్చితంగా ఒక కమాండర్/సలహాదారు అవసరం( కేవిపి వంటి వారు కాదు ముర్రో)
ఈ సోమరి ప్రపంచంలో చురుగ్గా ఉండి మరి విమర్శలకు గురయ్యేది మీరొకరే. బాస్ తో ప్రత్యక్ష సంభంధమున్న పొజిషన్ లో ఉంటే భాగా రానిస్తారు. లేకుంటే సాటి ఉధ్యోగులు మిమ్మల్ని శతృవుగా పరిగణించే అవకాశం కూడా ఉంది. తగిన ప్లానింగ్ లేకుండా తలకు మించిన పనుల్లో దిగి తిక మక పడతారు. ముందంజలో ఉండాలని ఉవ్విళ్ళురుతారు. కాని దాని కోసం పెద్ద పోరాటమే చెయ్యవలసి వస్తుంది.వీరు అగ్ర సంతానంగా, లెదా కుటుంభాన్ని,సంస్థను ముందుకు తీసుకెళ్ళే పొజిషన్లో ఉంటారు. కాని దీనికోసం ఎన్నో పోగొట్టుకుంటారు. చివరికి ఇతరుల విమర్శలకు సైతం గురవుతారు

2.వృషభం:
వీరిది చిన్నపిల్లల మనస్తత్వం . అల్ప సంతోషులు, ఎదుటివారు కొద్దిగా ఆప్యాయంగా మాట్లాడితే చాలు తమ మనస్సులో మాట ఇట్టే కక్కేసి చిక్కున పడతారు. వీరికి మాట,కుటుంభం, దనం అంటే ప్రాణం.
జీవితం చాలా కౄరమైంది .ఎవరికి ఏదంటే ప్రాణమో దానినే దూరం చేస్తుంది, వీరు అత్యవసర పరిస్థితిలో సైతం టూకిగా మాట్లాడలేనంతగా మాటలకు భానిసలై ఉంటారు. ఇచ్చిన మాట నిలుపుకోవాలని చూస్తారు. దీనినే ఎదుటివారి వద్దనుండి కూడ ఎదురు చూస్తారు.లేకుంటే అలుగుతారు.
కుటుంభాన్ని ప్రేమిస్తారు. ప్రేమతో కుటుంభ అభివృద్ది కోసం వీరు చేసే సూచనలను ఇతరులు నిర్లక్ష్యం చేసినప్పుడు అలుగుతారు. కుటుంభానికే దూరమైనా కావచ్చు. మార్పును వ్యతిరేకించే వీరు సాంప్రదాయ పద్దమైన పెళ్ళికే మొగ్గు చూపుతారు. ఒక వేళ ప్రేమించి పెళ్ళి చేసుకున్నా క్రమేణా కుటుంభంతో దగ్గరవుతారు. గానుగలో ఎద్దులాగా ఒక రొటీన్ కి అలవాటు పడి పోతారు. వీరికి కొంత గడ్డి పడేసి వీరిని ఇతరులు భాగా వాడుకుంటుంటారు
మిథునం:
మిథునం అన్న పథం మైదునం అన్న పదం నుండి వచ్చింది. మైథునం అంటే నేటి తరానికి తెలియదేమో? రతి అని భావం.ఇప్పట్లో వచ్చే పంచాంగాల్లో మిథున రాశి సింబల్ పేరిట విడిగా ఉన్నస్త్ర్రీ పురుషుల బొమ్మలను ముద్రిస్తున్నారు. మా ఇంట 1932 నాటి పంచాంగం చూసాను ( మా తాత మునస్వామి జ్యోతిష్యలో ప్రవేశం మొదల్గొని అన్ని విషయాల్లోను ఇంచుమించు నా టైపే. అంటే నేను మేథావి వర్గం ఆయన శ్రామిక వర్గం . ఆయన చెయ్యని వృత్తి వ్యాపారమంటూ లేదు. అన్నీ ఆరు నెలలకే పరిమితం) పాయింటుకొస్తా..1932 నాటి పంచాంగంలో రతి భంగిమలో ఉన్న స్త్రీ పురుషుల బొమ్మ ఉండే. అప్పుడు కాని నాకు స్పార్క్ కాలేదు.
ఈ రాశి వారి జీవితంలో సెక్స్ అత్యంత ప్రాధన్య కలిగి ఉంటుంది.వారి వారి జాతక విశేషాలను కాబట్టి అతిగా లభ్యం కావడమో, అస్సల్ దొరక్క పోవడమో ఉండొచ్చు గాని ప్రాముఖ్యత ప్రాధన్యత మాత్రం సెక్సుకే. అలానే బ్రదర్స్,సిస్టర్స్ ప్రభావం కూడ ఎక్కువ. మంచైన చెడైనా వారిద్వారే జరుగుతుంటది.
వీరి జీవితంలో నుండి సోదర భంధాన్ని ఎప్పటికి విడదీయలేం. వీరు అధికంగా ప్రయాణాలు చేస్తుండొచ్చు. ( మెడికల్ రెప్స్?) వీరికి రెండు పేర్లు,రెండు వృత్తులు, రెండు చిరునామాలుండవచ్చు. వీరి జీవితంలో మరో వింత కూడ ఉంటుంది. ఏదైన పెద్ద మంచి విషయం జరిగితే వెంటనే ఏదో ఒక పెద్ద దుఖం,కష్ఠం,నష్ఠం కూడ కలుగుతుంటుంది.
ఈ రాశి వారిలో పురుషుల్లో నాజూగు ఎక్కువ ( ఫిమెలిష్) , స్త్రీల్లో మొరటు తనం ఎక్కువ ఉండే అవకాశం గలదు. విద్యా వైద్య జోతిష్య గణిత రంగాల్లో ఆసక్తిగలవారై, అన్ని వర్గాల ప్రజలతో మాటా మంతి గలవారై ఉంటారు.

కర్కాటకం:
వీరి సమస్యల్లోచాలావరకు మనోసంభంధమైనవే ఉంటవి. మనస్సు అనే పదం అడుగడుగున వీరి మాటల్లో చోటు చేసుకుంటుంటుంది. అప్పుడప్పుడు మూడ్ అవుట్ కావడం.తేలిగ్గా చికాకు పడటం వెంటనే శాంతించడం ఉండొచ్చు. వీరికి శీతల సంభంధ రోగాలు వస్తవి. చంచలస్వభావం ఎక్కువ. అసలు విషయాలను పక్కన పెట్టి సైడ్ ట్రాక్ పట్టే అవకాశం కూడ ఎక్కువే.
జాగ్రత్తగా పరిశీలిస్తే వీరిలో ఒక నెలలో పన్నెండు రాశులవారి గుణగణాలు కనబడుతుంటవి. ఆలోచన,మాటలు,చేతలు,వృత్తి,సంపాదన, మానవ సంభంధాల్లో సైతం స్థిరత్వం ఉండదు. దైర్యం, భయం తరచూ ఒకటి వెనుక ఒకటి బహిర్గతమవుతుంటవి.
వీరికి ఆశ్చర్యం, దిగ్బ్రాంతి కలిగించే విషయాలంటే ఆసక్తి ఎక్కువ. రాజ విక్రమార్క ఏడాదిలో ఆరు నెలలు రాజుగా,ఆరు నలలు దేశ దిమ్మరిగా బతికాడంటారే ఆ టైపు జీవితం వీరిది. మానసిక ఉద్రిక్తతల వలన వీసింగ్, బి.పి.అల్సర్, నవ్వ వంటి సమస్యలు రావచ్చు.ప్రముఖుల భార్యలు సాయ పడతారు.
వీరి ఫిసిక్ లో సైతం పెనుమార్పులుంటవి.కొంతకాలం బక్క చిక్కి ,మరి కొంతకాలం లావెక్కి కనబడతారు. ఇంచు మించు వీరిది ద్విపాత్రాభినయం. వీరి గురించి తెలుసుకోవాలంటే కొన్ని క్లూస్ ఇస్తా వీరి గుణగణాలకు చంద్రుడు, నది,సముద్రం, మిర్రర్,జలం యొక్క ధర్మాలకు దగ్గర పోలికలుంటవి.
ఉ: రవి కాంతిని చంద్రుడు ప్రతిబింబించినట్టే వీరు సైతం ఎవరో ఒక ఆదర్శ పురుషుని ఖ్యాతిని చాటుతుంటారు. ఈ రాశివారు ద్యానం, భక్తి, సెలిబ్రిటీస్ ను ఆదర్శంగా తీసుకోవడం వంటి ఏదో చిట్కాను వాడకుంటే ఎందుకూ పనికి రానివారిగా తయారవుతారు.
వీరి జీవితంలో తల్లి,ఇల్లు,వాహనం,విద్యలకు అత్యంత ప్రాధన్యత ఉంటుంది. అంటే ఇవి కూడ రెండు విదాలుగా ఎఫెక్ట్ ఇస్తుంటాయి. నెలలో ఒక పెదునాలుగు రోజులు అనుకూలంగాను, మరో పదునాలుగు రోజులు ప్రతికూలంగాను ఉంటవి.
సింహం:
జాతకునిలో ఒకింత వరకు సోమరి తనం, అతి విశ్వాసం, చిటపటలాడటం ఉండొచ్చు. తండ్రితో వైరుధ్యం లేదా అతని వెనుకంజ సాధ్యమే. తల్లి మీద అమిత ప్రేమ ఉంటుంది. ( దీనిని డెపెండెన్స్ అని కూడ చెప్పొచ్చు) భవిష్యత్తులో అత్తా కోడళ్ళ పోరులో వీరు భలి పశువు అయ్యే ప్రమాదం కూడ ఉంది.( తల్లికి ఇచ్చే అత్యంత ప్రాధన్యత వలన). వీరు ఇతరులకు అప్పిస్తే తిరిగి రావడం కష్ఠమే వీర్ని ప్రశ్నించే స్థాయిలో ఉన్నవారు అతిత్వరలో బలహీన పడి పోతారు.( ఆర్థికంగా/శారీరకంగా). దాన గుణం ఉంటుంది. గుడి గోపురాలకన్నా క్రమ శిక్షణ, విద్యుక్త ధర్మానికే అధిక ప్రాధన్యత ఇస్తారు. మానవత్వమూ ఉంటుంది. సూర్యుని గురించి సైంటిఫిక్ గా తెలుసుకుని సూర్య నమస్కారం చేస్తూ వస్తే గొప్ప వారుగా తయారవుతారు. ఉ. ఆరు నుండి సా.ఆరు దాక ఉత్సాహంగా ఉంటారు.ఆ తరువాత డల్ ఫీలవుతారు. వీరున్న ఇంటికి ఎదురిల్లు పాత పడి పోతుంది అని ఒక విశ్వాసం
కన్యా :
కన్యా రాశివారి గురించి చెప్పాలంటే మూడే ముక్కలు శతృ,రోగం,రుణం, ఇవి ఈ రాశి వారిని కాదండోయి వీరి చుట్టూ ఉన్నవారిని సైతం బాధిస్తాయి.ఇందుకు చక్కని పరిహారం ఉంది, కన్యా లగ్నం లో జన్మించిన వారే కాదు, వారి చుట్టూ ఉన్న వారు కూడ క్రింది పరిహారాలు చేసుకుంటే మంచిది. లేకుంటే చుట్టూ ఉన్నవారితో బాటు జాతకుడు సైతం రోగిష్ఠిగానో, అప్పుల అప్పారావుగానో, కోర్టు కేసులంటూ తిరుగు వాడుగనో తయరవుతారు.
పరిహారం:
ఏ మంచి పని మొదలు పెట్టినా ఒక్క రూపాయన్న అప్పు చేసిన సొమ్ముతోనే ప్రారంభించాలి. గ్రీన్ కలర్ దుస్తులు,వస్తువులు ఎక్కువగా వాడాలి. తమ ఆఫీసు రూమ్/ పడక గదిని ఆసుపత్రి/కోర్టు /బ్యాంకును తలపించే విదంగా అలంకరించుకోవాలి
ఉ. గ్రీన్ కలర్ స్క్ర్రీన్స్, బెడ్ కవర్,పిల్లో కవర్ వాడండి, మీకు అవసరం లేక పోయినా ఖాళి ప్రొనోట్స్,రెవిన్యూ స్టాంపులు, స్తాంపు పేపర్లు నిల్వ ఉంచండి, చక్క సుత్తి, న్యాయ దేవత బొమ్మ వాడండి. మీ అభిమాన నాయకుల్లో/ కథానాయకుల్లో ఎవరన్నా లాయర్/ డాక్టర్ ఉంటే వారు సతరు డ్రెస్ లో ఉన్న ఫోటో మీ కళ్ళ ముందు పెట్టుకొండి. ఒక ఐదు వారాలు ఏదైన విష్ణు ఆలయానికి వెళ్ళి తులశి మాల వేసి దండం పెట్టుకుని రండి (మరెప్పుడన్నా మీకు శతృ,రోగ,రుణ బాధలు కల్గినా ఈ పని చెయ్యండి)

తుల:
పుట్టిన ఊళ్ళో ఉన్నంత వరకు కుండలో దీపం. దానిని విడిచాక కొండ మీద దీపం. మీ ఆర్థిక పురోగతిని చూస్తే రొటేషన్ చక్రవర్తి అని చెప్పొచ్చు. మీ జీవితం పై ఫ్రెండ్,లవర్, భాగస్వాముల ప్రభావం అదికంగా ఉండొచ్చు. మంచైనా చెడ్డైనా వారి వల్లే జరిగే అవకాశం ఉంది.

సుఖాన్వేషిగా వృషభరాశివారికి ఏమాత్రం తీసిపోరు. అయితే వృషభరాశివారు అటు ఇటుగా సర్దుకు పోయి సుఖాన్ని పొందితే మీరు పోట్లాడైనా సరే సుఖాన్ని పొందుతారు. వారు కాస్త స్లో , మీరు కస్త ఫాస్ట్ . వారు డబ్బును ఫణంగా పెట్టడానికి సైతం వెనుకాడుతురు. మీరు ఎదగడం కోసం జీవితాన్నే ఫణంగా పెట్టే దమ్ము గలవారు.మీ పెళ్ళి కూడ శతృ కుటుంభ జనిత అమ్మాయి/అబ్బాయితోనే అవుతుంది. కొత్త సంభంధమైతే క్రమేణా అత్తా మామలకు దూరమవుతారు. మీకు పొదుపు చాలా అవసరం. ఆస్తుల పై పెట్టుబడి పెట్టి ఏ పరిస్థితిలోను వాటి జోలికి పోకుండా ఉండాలి. లేకుంటే మీ వింత వైఖరి వలన అయినవారే మిమ్మల్ని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. తస్మాన్ జాగ్రత్తా!

వృశ్చికం:
వీరు ఎంత ఓర్పుగా ఉండ దలచినా పరిస్థితి అందుకు సహకరించదు. వీరికే తెలియకుండా వీరి మాటలు ఎదుటివారికి కాసింత బాధ కల్గించి వేస్తాయి. వీరికి ఊపిరితిత్తులు సంభంధ సమస్యలు రావచ్చును ( పొగ,సెగ,మానసిక వత్తిడి కారణంగా) .వీరికి యుద్దమంటే ఎంతో మక్కువ. చాలాసార్లు వీరే సమర శంఖం పూరిస్తారు. ఒక శతృవు ఉన్నంత కాలం ఎంతో యాక్టివ్ గా ఉంటారు. లేకుంటే బోర్ అనిపిస్తుంది. వీరికి బాల్యంలో అమ్మోరు, ట్యూమర్స్ వంటివి వచ్చుండొచ్చు. లేదా ఎత్తైన చోటునుండి క్రింద పడిపోవడం,కొమ్మున్న జంతువులు, కరెంట్,అగ్ని సంభంధంగా నష్ఠం జరిగి ఉండవచ్చు. కొమ్మున్న జంతువుల వలన ఆర్థిక నష్ఠం కూడ కలిగి ఉండవచ్చు వీరిలో శక్తి జెనరేట్ అవుతూ ఉంటుంది. దానిని సక్రమంగా వినియోగించుకోకుంటే మానసిక వత్తిడి,షుగర్, వంటివి రావచ్చు. ఫిసికల్ ఎక్సర్ సైజు అనివార్యం. వీరికి ప్రజా జీవితం అంతగా అచ్చురాదు.

దనస్సు:
ఒకింతవరకు దూర దృష్థి ,పొదుపు,భవిష్యత్ గురించిన ఆలోచన గలవారే. కాని డబ్బులిచ్చి మోస పోయినవారు, ప్రైవేటు చిట్ ఫండ్స్, చిన్నా చితకా బ్యాంకుల్లో పొదుపు చేసి మోస పోయినవారు, ఆస్తి వివాదాల్లో తలమునకలయ్యేవారొలో దనుర్ రాశి వారు ఎక్కువగా ఉంటారు. మగవాడన్నాక సంపాదనార్థం దూరదేశాలకు సైతం వెళ్ళాల్సిందేననే ఆలోచన గలవారు. పుణ్యక్షేత్ర యానం, తీర్థయాత్రలకు ప్రాధన్య ఇస్తారు. మీరు భవిష్యత్తులో పది మందికి మంచి చెడ్డా చెప్పే గురు స్థానంలో ఉండాల్సినవారు.కాని బాల్యం,యవ్వనంలో “అటు ఇటుగా” ప్రవర్తిస్తుంటారు. కొందరు మద్య వయస్సులో సైతం డబుల్ యాక్ట్ ఇస్తుంటారు ( చదివేది రామాయణం – దూరేది ….గుడిసెలు అన్న చందంగా) .ఒక వ్యవహారం క్లీష్థంగా తయారవ్వాలంటే వీరిని రంగంలో దింపితే సరి. తమ మాటలతో పరిష్కారమవుతున్న వ్యవహారాన్ని మొదటికి తెస్తారు. వీరి జీవితంలో తండ్రి ,తండ్రి ఆస్తి, ఆయన తరపు బంధువులు,దూర ప్రయాణాలు,పూజా పునస్కారాలు, తీర్థ యాత్రలు అధిక ప్రాధన్యత కలిగి ఉంటాయి. దూర దేశాలతో సంభంధాలు కలిగి ఉంటారు. ఈ ఏడాది ఆదాయాన్ని ఈ ఏడాదే అనుభవించే యోగం తక్కువనే చెప్పాలి. దానిని డంప్ చేసి దాని పై పెద్ద పోరాటం చేసి తదుపరి ఏడాది అనుభవించేలా చేసుకుంటారు.
మకరం:
మీ లగ్నం మకరం .ఇది రాశి చక్రంలో పదో రాశి కాబట్టి మీరు ఒర్కహాలిక్ గా ఉంటారు ( మీ లగ్నాధిపతి శని అయినందున కాస్త ఆలశ్యం తామసం ఉన్నప్పటికి మీరు ఒర్క హాలిక్. లగ్నాధిపతితో చంద్రుడు చేరాడు కాబట్టి మీ చురుకుదనంలో నిలకడ లేని తనం ఉండొచ్చు. ముఖ్యంగా అమావాశ్య తరువాత వచ్చే పద్నాలుగు రోజుల్లో కాస్త సోమరిగా ,ఊహల్లో మునిగి తేలుతూ ఉండొచ్చేమో గాని పౌర్ణమి తరువాత మాత్రం కర్మయోగి లెవల్లో పనుల మీద దృష్ఠి పెడతారు)

మీరు చేసే పని ఏది? దాని విలువెంత? అందుకుగాను మీకు ముట్టేదెంత? అసలు దాని ప్రతిఫలం ఎవరికి చేరుతుందని కూడ ఆలోచించరంటే చూసుకొండి.
కుంభం:
వీరి జీవితంలో ఎంతటి గడ్డు స్థితి వచ్చినా ఏదైనా సరే బొత్తిగా ఖాళి కాదు. అది డబ్బుకావచ్చు, పలుకుబడి కావచ్చు ప్రేమ కావచ్చు, లోపలి మనుషులు .రహస్యాలుంటవి. ఏది చేసినా “నాకేంటి?” అని ప్రశ్నించుకుని (లాభమండి బాబు) కాని పనిలో దిగరు. యవ్వనంలో ఈ నేచర్ కనబడక పోవచ్చేమో క్రమేణా స్వార్థపరులుగా తయారవుతారు. వీరి పనితీరులో కాస్త నిదానం ఉండవచ్చేమోగాని డాబు,డబ్బాల పై ఆసక్తి ఉండదు. ముఖ్యంగా నాలవల్టీస్, ఫేన్సి, కాస్మెటిక్స్ పై నిరాసక్తత ఉండును. జీవితాంతం యూనిఫార్మ్/జిడ్డు/ మురికి/కంపు కనీశం ఆ వాతావరణం వీరిని వీడదు. మీ జీవితంలో వృద్ద సోదర,సోదరిమణుల ప్రభావం అత్యధికంగా ఉండొచ్చ్యు. ఎవడు ఏమై పోతే నాకేంటి నా పని నాది,నా కూలి నాకు గిట్టిందా అని ఉన్నప్పటికి ఏదైన సందర్భంలో ఓనరు/ఉన్నతాధికారులతో డీ అంటే డీ అని దిగే అవకాశం కూడ లేక పోలేదు.

మీనం:
ఇది మీ చివరి జన్మ అని కూడ కొందరు చెబుతారు. మీకు ఇతరులకి బేసికల్ గా ఉండే వ్యత్యాసం ఇది.ఇతరులు అన్ని కావాలని ఉవ్విళ్ళూరి అన్నీ పొందే ప్రయత్నంలో ఖర్మ ఖాతాలో ఖర్మను సైతం ఎక్కువ చేసుకుంటూ పోతారు (దీని ఫలితంగా తదుపరి జన్మల్లో కష్థ నష్ఠాలకు గురై ఈ ఖర్మలను పోగొట్టుకుంటారు)
కాని మీకు ఇదె చివరి జన్మ కాబట్టి మీరు అంటి ముట్టనట్టే ఉంటారు. పతి దానిలోను కొద్దిగానైనా కష్ఠ నష్ఠాలకు గురవుతుంటారు. కాని జీవితపు మొదటి గట్టంలో రివర్స్ ఎఫెక్ట్ కారణంగా అన్నీ తమకే కావాలని ఉవ్విళ్ళూరే అవకాశం కూడ ఉంది.
ప్రారంభ దశలో భాగా సంపాదించినప్పటికి ఆ తరువాత అంత:కరణ ప్రేరణతో ఆదాయం చేతికందే మునుపే ఖర్చులు ప్లాన్ చెయ్యడం, అప్పులు చేసైనా ఖర్చులు చెయ్యడం మొదలవుతుంది. సుదూర ప్రయాణాల్లో ఆసక్తి ఉంటుంది. అసలు గమ్యం తెలీని ప్రయాణాల పై కూడ ఆసక్త్ గలదు. వీరికి పాదాలు, నడకలో కొంత తేడా కనిపించే అవకాశం కూడ ఉంది.ఎందులోను పెద్దగా కమిట్ కారు. జారిపోతుంటారు. అందుకేనేమో ఇతరులు మిమ్మల్ని చిక్కడు దొరకుడు అంటుండవచ్చు.

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.