Jr-NTR-to-imitate-Sr-NTR--1498109385-118

ఆధునిక మానవుల ఆరోగ్యాన్ని -అస్తిత్వాన్ని అతలా కుతలం చేస్తున్న సమస్య అధిక భరువు. దీంతో వచ్చే సమస్యలు రోగాలు ఇన్ని కావు . ఇందుకు సమూల పరిష్కారమే పేల్యో డైట్. దీని పై నియాండర్ సెల్వన్ తమిళలో రచించిన పుస్తకాన్ని సెందజల్ రవి ప్రోత్సాహంతో నెను తెలుగులో అనువదించాను.

మిని సీయల్గా ప్రచురణ కానుంది. సేవ్ ఫార్ యు అండ్ షేర్ ఫార్ ఆల్

ప్రొఫెష్నల్ అస్ట్రాలజరుగా నా రొటీన్ టాస్క్ + నా తమిళ రచనలను కిండిల్ ఇ బుక్స్ గా మలచే ప్రాసస్ + రాజకీయంగా నాకున్న పరిమిత భాధ్యతలు వీటితో పాటుగా ఈ పేలియో డైట్ సీరియల్ .

రౌండ్ ది క్లాక్ పని చేస్తున్నా పనులు హనుమన్న తోకలా పెరుగుతూనే ఉన్నాయి. అయినా సరే నాకున్న పరిమిత వనరులతో వర్క్ అవుట్ చేస్తూనే ఉన్నా. ఎంత మంది చదువుతారు ? ఎంత మంది షేర్ చేస్తారు ? ఇవేమి పట్టించుకో కుండా పని చేస్తూనే ఉన్నాను.

తమిళంలో నా రచనలను 2000 -2009 మద్య చదివిన వారు కేవలం 2006 మంది మాత్రమే .కాని 2009-2019 మధ్యన 10 కోట్ల పేజ్ వ్యూస్ వచ్చాయి. ఎంతో మంది అధిక భరువుతో – మధు మేఘంతో – ఇక దాని సైడ్ ఎఫెక్త్శ్ తో నరకం అనుభవిస్తున్నారు .

మొదట నేను చెప్పినట్టుగా రౌండ్ ది క్లాక్ కంప్యూటర్ ముందు కూర్చోవడం వలన 48 కేజీల భరువుతో ఉన్న నేను క్రమేనా భరువు పెరిగి షుగర్ సోకకున్నా అధిక భరువుతో ఎన్నో ఇబ్బందులు పడ్డాను .సరిగ్గా ఆ సమయంలో నియాండర్ శెల్వన్ మిత్రులు సెందళల్ రవి ఈ కంటెంట్ నాకు పంపి తెలుగులో అనువదింపమని కోరారు .

ఇంత పొడవాటి సీరియల్ యొక్క సారాంశం లెస్ కార్బ్ మోర్ కొలస్ట్రాల్ అన్నదే. పాయింట్ పట్టుకున్నాను. డైట్ మార్చాను . ఏ మాత్రం వ్యాయామం లేకున్నా పూర్తిగా పేలియో డైట్ ఫాలో కాకున్నా 30-40 కేజీల భరువు తగ్గించుకో కలిగాను .

అందుకే ..నియాండర్ శెల్వన్ ఎంతో ఔదార్యంతో అనుమతి ఇవ్వగా దీనిని మీకు సీరియల్గా అందిస్తున్నాను. చదవండ్ ! పాటించండి .. ఫలితాలు మీకే తెలుస్తాయి. ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్తులు డైట్ మార్చినా ఇది వరకు ఎలా రెగులర్ బ్లడ్ టెస్ట్ -డాక్టరుగారిని సంప్రదించడం చేస్తూ వచ్చారో దానిని అలానే కొన సాగించండి .

మీ బ్లడ్ రిపోర్ట్ చూసి డాక్టర్ గారే మందులు /ఇన్సులిన్ డొసేజ్ క్రమేనా తగ్గిస్తారు .పేలియో డైట్ కొనసాగిస్తే మందులు -ఇన్సులిన్ గొడవల్లోనుండి పూర్తిగా స్వేచ్చను పొందుతారు .

ఇది ఓ పది మందికి జరిగినా ఈ నా శ్రమ సత్ఫలితాన్ని ఇచ్చినట్టే .

!A42

Untitled

CfcJOBLk_400x400