(ఈ దేశం- దేశంలోని రాష్ఠ్రాలు –పుణ్యక్షేత్రాలు –పోలీసు వ్యవస్థ –నగరాలు ఎలా ఉండాలి? అందుకు ప్రభుత్వాలు ఏం చెయ్యాలి అన్న సలహాల  సమాహారం)

ఉపోద్ఘాతం

కరోనా దెబ్బకు అగ్ర రాజ్యం తో సహా ప్రపంచ దేశాలు  అన్ని ఆర్థికంగా వెలవెలబోతున్నా  కేంద్ర ప్రభుత్వం సైతం  నిమ్మకు నీరెత్తినట్టు గా ఉన్నా –  కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం –  అంతకు పూర్వం గత ఐదు సంవత్సరాల అస్థిరత – ఆ తరువాత 5 సం.లుగా కేవలం గ్రాఫిక్స్ –కే  పరిమితమై ఉన్న పాలన  కేవలం  సొంత డబ్బా కోసం  ఖజానా కాళి  చేసినటువంటి పరిస్థితి అయినా సరే ..రాజధాని లేకున్నా ,   పది జిల్లాలు పోగొట్టుకున్నా ,ప్రత్యేక హోదా లేకున్నా –  ప్రత్యేక ప్యాకేజీ రాకున్నా అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని బేరేజు చేసుకుంటూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై  పచ్చ మీడియా , పచ్చ తమ్ముళ్లు మాత్రమే  కాకుండా కోర్టులు కూడా పగపట్టాయి.

ఈ బుక్లెట్లో  నేను పొందుపరచిన అంశాలు  చంద్రబాబు గారి  రెండవ రెజిమ్లోనే ఆయన గారిచే  అద్భుతం తగిన రీతిలో వాడుకుందామని కితాబు ఇవ్వబడినవే.  ఒక  వేళ ప్రభుత్వం ఈ అంశాలను  పరిశీలించి అమలు చేయడానికి పూనుకుంటే యథాప్రకారం బాబు గారు కోర్టులను  అడ్డం పెట్టుకొని అడ్డుపుల్ల వేస్తారేమో అని  ముందు జాగ్రత్త చర్యగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి నేను ఒక లేఖ పంపడం జరిగింది . (ఆ లేఖ పూర్తి పాఠం ఈ బుక్లెట్లో ఉంది )  

సమస్త రాష్ట్ర ప్రజానీకం బాగోగుల కొరకు పోరాడవలసిన బాబు గారు మందుబాబులు ,ఇసుక బకాసురులు, రాజధాని ప్రాంత భూస్వాములు ,లంచావతారాల కొరకు నానా తంటాలు పడుతున్నారు. 

కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి / అలానే వైయస్సార్ కాంగ్రెస్ కి భారతీయ జనతా పార్టీకి  ఎలాగైనా తగువ  పెట్టాలని తెగ ప్రయత్నం చేస్తున్నారు .ఇంకో అడుగు ముందుకు వేసి  జగన్మోహన్ రెడ్డి పై  హిందూ వ్యతిరేకి అనే ముద్ర వెయ్యాలని ప్రయత్నిస్తున్నారు.

 గ్రౌండ్ లెవెల్ లో చూస్తే ప్రజలు ప్రభుత్వానికి , ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ- అభివృద్ధి పథకాలకు – సాగునీటి ప్రాజెక్టులకు అనుకూలంగానే ఉన్నారు . కానీ జగన్మోహన్ రెడ్డి  ప్రజా సంక్షేమం కొరకు ఖర్చు పెడుతూ ఉంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటారు లేదా అప్పులు  చేసేస్తున్నారు బాబో !  అని రొమ్ములు బాదుకుంటున్నారు.  వారి నోరు మూయించడానికి  జగన్మోహన్ రెడ్డి  నవరత్నాలను  అభివృద్ధి పథకాలను సాగునీటి ప్రాజెక్టులను  ఏకబిగిన పూర్తి చేయటానికి ఆర్థిక వనరులు ఎంతో అవసరం.

  ప్రజలపై ఏ మాత్రం భారం వేయకుండా  ప్రభుత్వ నిర్వహణను  సరళీకృతం చేస్తూ తద్వారా నిర్వహణ వ్యయాన్ని గుదించుకుంటూ  వ్యూహాత్మకంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే  మార్గాలనే ఈ  బుక్లెట్లో ఇచ్చాను. వీటి అమలుకు నేను చేసిన కృషి – సీఎం  పేషి స్పందన  – రాష్ట్ర |శచివాలయంలో ని శాఖాధిపతుల చొరవ అన్నింటిని సీఎం గారికి నేను పంపిన తాజా లేఖ ద్వారా తెలుసుకోవచ్చు (పూర్తి పాఠం పొందు పరచాను).

 కాని క్రింది స్థాయికి వచ్చేసరికి ఆ ఉత్సాహం చొరవ పొరబడి  పోతున్న ఈ ఉదంతం సీఎం దృష్టికి వెళ్లాలనే ఈ బుక్ లెట్ –ను  ప్రచురించి రాజకీయ రాజకీయేతర ప్రముఖులకు పంపాలని నిర్ణయించాను.   మీలో ఔత్సాహికులు  ఈ బుక్లెట్ను జిరాక్సులు చేసి గాని స్కాన్ చేసి గాని సీఎం గారి దృష్టికి వెళ్ళేంత వరకు జనబాహుళ్యానికి చేరవేయాలని కోరి ప్రార్థిస్తున్నాను.

గమనిక :

ఇవి 1992 సం.లోనే నాలో నాటుకు పోయిన నదుల అనుసంథానం – సమిష్ఠి వ్యవసాయ అమలును సుసాధ్యం చేసేందుకు కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం కొరకు  1995 లో రూపొందించిన అంశాలు.

కాల క్రమేణా అప్పుడప్పుడు అప్డేట్ చేస్తూ /స్ప్రెడ్ చేస్తూ వస్తున్నాను. ఈ బుక్లెట్ మొదట తాజాగా ఆంద్ర రాష్ఠ్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డిగారికి వ్రాసిన లేఖను /మరియు అడుగుడగున రాష్ఠ్ర ప్రభుత్వ సత్ప్రయత్నాలకు మోకాలడ్డుతున్న హై కోర్టు ప్రధాన న్యాయ మూర్తిగారికి పంపిన లేఖను పొందుపరచాను.

లేటెస్ట్ అప్డేట్ కొరకు . మీ విమర్శలు –అభిప్రాయాలను తెలుపుటకు సంప్రదించండి  : swamy7867@gmail.com  లేదా whatsapp: 9397036815  

ఆంద్రప్రదేశ్ రాష్ఠ్ర ముఖ్యమంత్రిగారికి నా తాజా లేఖ

గౌరవనీయులైన అయ్యా !

విషయం :

రాష్ఠ్ర ఆర్థిక దుస్థితి – మెరుగుకు ప్రయత్నాలు – ఒకే విడతలో నవరత్నాల అమలు –   దేశంలోని రాష్ఠ్ర ప్రభుత్వాలు -ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల పై భారం మోపక నిర్వహణా వ్యయాన్ని కుదించుకుని  అర్థికంగా పుంజుకోవడం – సంస్కరణల సమాహారం – ఎకానమి ప్యేకేజి – సి.ఎం.ఓ –ఆర్థిక శాఖ –ప్లానింగ్ శాఖ స్పందనలు –ఎక్స్ పెర్ట్ కమిటి – Reguest –Regarding

– 0  –

నేను ఎన్.టి.ఆర్ అభిమానిని –వెన్ను పోటుతో ఎన్.టి.ఆర్ని పన్ను పోటుతో ప్రజలను చంపుకు తిన్నాడు కాబట్టి చంద్రబాబు వ్యతిరేకిని. చంద్రబాబును దెబ్బ కొట్ట గల సమర్థుడు కాబట్టి వై.ఎస్.ఆర్ మద్దత్తు దారుడ్ని అయ్యాను. 2004 ,2009 ఎన్నికల్లోను ప్రత్యక్షంగాను అంతర్జాలం లోను  కాంగ్రెస్ పార్టి విజయానికి కృషి చేసినవాడ్ని .

మీరు అదిష్థానంతో విభేదించిన నాటినుండి – మీ వ్యూహాల పై  ఎన్ని విమర్శలున్నా మనస్పూర్తిగా మీకు సంఫూర్ణ మద్దత్తు ఇస్తూనే వచ్చాను .

ఎన్.టి.ఆర్ మానవీయ పరిపాలనను వై.ఎస్.ఆర్ తన దూకుడు విదానంతో మరో స్థాయికి తీసుకెళ్ళారు కాబట్టి వై.ఎస్సార్ అభిమానిని అయ్యాను. మీరు పేదవాని కోసం  నా  తండ్రి ఒకడుగు ముందుకేస్తే నేను  రెండు అడుగులు వేస్తానన్న విదానం నాకు బాగా నచ్చింది. మీ పై విశ్వాసంతో అభిమానంతో అంతర్జాలంలో మీ పార్టి విజయానికి నా వంతు కృషి చేసాను. 2014 ,2019 ఎన్నికల్లోను ఇదే పంథా కొనసాగించాను .కొనసాగిస్తున్నాను .కొనసాగిస్తాను .

మన కృషి ఫలించింది .ప్రభుత్వ పగ్గాలు నేడు మీ చేతుల్లో ఉన్నప్పటికి ప్రతిపక్షాల కుట్రలు – న్యాయ స్థానాల మోకాలడ్డు –ఆర్థిక వనరుల కొరతలకు ఎదురీదుతూ సరి కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. అయితే …

రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందుల్లో ఉన్నమాట తమకు విధితమే. ప్రస్తుతం కరోనా  నేపథ్యంలో మరిన్ని సవాళ్ళు ఎదురవుతున్నాయి .ప్రజలపై భారం మోపకుండా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునేందుకు +తద్వారా తమ నవరత్నాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమలు పరచటానికి  చేపట్టవలసిన నిర్వహణ  సంస్కరణలు మరియు చర్యలను క్రోడీకరించి తమ కార్యాలయానికి పంపడం జరిగింది .(2019,మే)

దానిపై  ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని తెలుపు కోరుతూ నేను తమ కార్యాలయాన్ని   6-6 – 2019 న   ఆర్ టి ఐ ప్రకారం కోరగా నా లేఖ మరియు సతరు లేఖ + నా ప్రతి పాదనలను ఆర్థిక శాఖకు నివేదించినట్లు గా 31 -1 2020 నాటి లేఖ ద్వారా తెలిపేరు. (సతరు లేఖ యొక్క ప్రతి  జత పరిచాను )

ఈ విషయమై నేను ఆర్థిక శాఖ వారిని ఆర్.టి.ఐ ప్రకారం సంప్రదించగా  నా లేఖ + ప్రతి పాదనలను

1 ప్లానింగ్ శాఖ 2 రెవెన్యూ దేవాదాయ శాఖ 3 హోం శాఖ 4 టి ఆర్ అండ్ బి శాఖ 5 జి (ఎ) సర్వీసెస్ శాఖలకు పరిశీలన నిమిత్తం పంపినట్లు తేదీ 4-3- 2020 నాటి  లేఖలో నాకు తెలిపారు.( సతరు లేఖ యొక్క ప్రతి  జత పరిచాను)  పై శాఖల వారు నా లేఖ+ప్రతిపాదనల పై ఏం చేసారో క్లుప్తంగా తెలియ చేస్తున్నాను .

1.ప్లానింగ్ డిపార్ట్మెంట్:

వీరు తమ 11 /3 /2020 నాటి  లేఖలో నా లేఖ మరియు  ప్రతి పాదనలను తదుపరి చర్యల నిమిత్తం చిత్తూరు కలెక్టర్ వారికి పంపినట్లు తెలిపారు. ( సతరు లేఖ యొక్క ప్రతి  జత పరిచాను)

 2. హోమ్ డిపార్ట్మెంట్

 వీరు నా సలహాలు మరియు ప్రతి పాదనలను రాష్ట్ర డిజిపి గారికి పంపినట్లుగా 6/3/ 2020 నాటి లేఖలో తెలిపారు (సతరు లేఖ యొక్క ప్రతి  జత పరిచాను )

3 .టి ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ :

వీరు ఆర్థిక శాఖ వారు  పంపిన నా లేఖ + ప్రతి పాదనలు  తమ కార్యాలయానికి అందలేదని 6/ 3/ 2020 నాటి లేఖలో  తెలిపారు (సతరు లేఖ యొక్క ప్రతి  జత పరిచాను)  నేను కాలయాపనను  వారించడం కొరకు వారం రోజుల్లో నా సలహాలను ప్రతి పాదనలను వెంటనే వీరికి  పంపాను.

 ఇప్పటికే విలువైన ఐదు  నెలల కాలం గడిచిపోయి నందున తమకు  ఈ  లేఖ రాయవలసి వచ్చినది.  గత 5 నెలల  కాలంలో లాక్ డౌన్ మరియు కరోనా కట్టడి పై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారిస్తున్న కీలక విపత్కర పరిస్థితుల్లో  ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టకూడదని మౌనంగా వేచి ఉన్నాను.

ఇంతకీ ఆర్థిక శాఖ  ద్వారా నా  లేఖ+ ప్రతి పాదనలను అందుకున్న శాఖలు/ శాఖాధిపతులకు  సైతం లేఖ ద్వారా కూడా సంప్రదించలేదు.  ఈరోజున తమకు పంపుతున్నట్లు గానే వారికి కూడా లేఖలను పంపుతున్నాను . ( నా లేఖ పై స్పందిస్తారో లేదో ? ఒక స్పందించినా ఎప్పుడు స్పందిస్తారో ? తెలీదు. నిజానికి వీరు నా ప్రతిపాదన అమలు యొక్క సాధ్యా సాధ్యాల పై తమ అభిప్రాయాలను ఇప్పటికే ఆర్థిక శాఖకు తెలియ చేసి ఉండాలి. అలా తెలియ చేసి ఉంటే నాకూ  కాపి మార్క్ చేసి ఉంటారు.

రాష్ట్ర అభివృద్ధి – సంక్షేమం  పై చిత్తశుద్ధితో తమరు అహర్నిశం కృషి చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయంలో చాలా భాగం నిర్వహణ వ్యయానికే ఖర్చు అయిపోతున్నది . చాలీచాలని వనరులతోనే  రాష్ట్రం ఇంతగా అభివృద్ధి చెందుతోంది అంటే ఆపై నా సలహాలు ప్రతి పాదనలు అమలైతే అటు అభివృద్ధి ఇటు సంక్షేమం జోరందుకున్నాయి.

కావున నా పై దయ ఉంచి ఈ విషయమై చొరవ తీసుకుని పై తెలిపిన / ఈ లేఖతో పాటు జతపరుస్తున్న ప్రతిపాదనల పై ఒక ఎక్స్ పెర్ట్ కమిటి వేసి వారి సూచనలు తీసుకుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీటిని అమలు చెయ్యండి.

ఇప్పటికే నాకు 53 సం.ల వయస్సు. ఈ ప్రతిపాదనలను 1995 నుండి మన ప్రభుత్వాలకు పంపి –రిమైండ్ చేస్తూ అలసి పోయాను. నాకింకా ఓపొక లేదు కాబట్టి భారాన్ని మీ మీదకు నెట్తి వేస్తున్నాను. దయ చేసి అర్థం చేసుకుని సత్వరమే చర్యలు తీసుకోగలరు.

ఇట్లు

చిత్తూరు.మురుగేశన్

నా ప్రతిపాదనల పూర్తి పాఠం (అంశాలవారిగా)

ఎకానమి పేకేజ్

(భారత దేశంలోని రాష్ఠ్ర ప్రభుత్వాలు -ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల పై భారం మోపక నిర్వహణా వ్యయాన్ని కుదించుకుని  అర్థికంగా పుంజుకోవడానికి నేను కూర్చిన సంస్కరణలు . 1995 నుండి ఎడతెరపి లేకుండా చంద్రబాబు నాయుడు గారికి పంపుతూ వస్తే 2003 న “తగిన రీతిలో వినియోగించుకుంటామని లేఖ కూడ వ్రాసేరు.ఇందులోని పలు అంశాలు ఇప్పటికే అమలు చేయబడినట్టు కూడ సమాచారం )

1.ప్రభుత్వ ఉద్యోగులు అందరు అనర్హులు కారు . అందుకని ప్రతి ఒక్కరు అర్హులు కూడ కారు .అందుకే గత 10 సం.ల్లో రాజకీయ -ఆర్థిక-సామాజిక -విద్యా రంగాల్లో ఇటీవల చోటు చేసుకున్న మార్పుల పై వీరికి ఒక వ్రాత పరీక్ష నిర్వహించాలి .అలానే మెడికల్ ఫిట్నెస్ పరీక్ష జరపాలి. ముఖ్యంగా ప్రపంచీకరణ -ప్రైవేటి కరణ కారణంగా మారుతున్న ప్రభుత్వ పాత్రను -వారికి నూరి పొయ్యాలి. వారి జీత బత్యాలు ఖజాణా నుండి రావని – వారు చొరవ తీసుకుని ప్రభుత్వానికి ఆదాయం రాబట్టాలన్న సంగతిని వారికి అర్థమయ్యేలా చేసి -ప్రజలతో ఎలా మొసలుకోవాలో నేర్పే సైకో మెట్రి కౌన్సిలింగ్ ఇచ్చి -దాని పై కూడ ఒక పరీక్ష నిర్వహించాలి .ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారే కొన సాగించ బడాలి .తప్పిన వారికి గోల్డెన్ షేక్ హ్యేండ్ ఇవ్వాలి .

వీరి వారసుల్లో అర్హులైన వారుంటే వారికి అవకాశం కల్పించ వచ్చు (అయితే పై తెలిపిన అన్ని పరీక్షల్లోను ఉత్తీర్ణులైతే)

2.అయితే పై తెలిపిన పాయింట్ పై జీ.ఓ విడుదల కాగానే ప్రభుత్వ ఉధ్యోగులంతా సమ్మెలో దిగే ప్రమాదం ఉంది కాబట్టి ముందుగానే ప్రస్తుత ఖాళీలు – సమ్మె కాలంలో అత్యవసర సర్వీసులుకు అవసరమైన ఉధ్యోగాలను “టెండర్” పద్దతిలో పూరించి సిద్దంగా ఉండాలి .

3.ఇటీవల చదువులు పూర్తి చేసి ( ఈ కాల పరిమితి 2 ఏళ్ళకు మీంచకూడదు ) నిరుధ్యోగులుగా ఉన్న యువతను కన్సాలిడేటడ్ పే క్రింద అబ్జర్వర్లుగా అప్పాయింట్ చేసుకోవాలి . వీరిని జంబ్లింగ్ పద్దతిలో ప్రభుత్వ కార్యాలయలాను /వాటి పని తీరు / ప్రజల ఇబ్బందులను అబ్జర్వ్ చేసి రిపోర్ట్ ఇచ్చే విదంగా వినియోగించాలి. ఈ ఉధ్యోగ కాల పరిమితి 11 నెలలకు మించ రాదు .

4.ప్రజల్లో 18 నుండి 35 వయస్సులోపు అవివాహితులుగా ఉన్న ప్రతి ఒక్కరికి పోలీస్ ట్రెయినింగ్ ఇప్పించాలి .(డైవర్సీలు /విడోయర్లు కూడ అర్హులే). వీరిని స్టాండ్ బైలో పెట్టి అవసరమైన చోట /అవసరమైన సమయంలో వాడుకోవాలి .

5. సర్వేల పేరుతో ప్రభుత్వ దనాన్ని వెచ్చించడం అనవసరం. నిర్ణీత ఫార్మెట్లో ప్రజలే స్వచ్చందంగా తమ వివరాలను అందించే విదంగా చెయ్యొచ్చు .

ఆన్లైన్ అయితే బెస్ట్ . అయితే తాము తెలిపిన వివరాలన్ని సరైనవి అని నిర్ధారిస్తూ అఫిడవిట్ జతపరచేలా చూడాలి.

తప్పుడు సమాచారమిచ్చిన వారిని శిక్షిస్తామని విరివిగా ప్రచారం చెయ్యాలి. ఆతరువాత

రేండంగా క్రాస్ చెక్ చేసి తప్పుడు సమాచారం ఇచ్చిన వారిని శిక్షించవచ్చు

6.ప్రభుత్వ ప్రకటనలు (యాడ్స్) ప్రభుత్వ పత్రికలోనే (ఆంద్రప్రదేశ్?) ప్రచురితం కావాలి .ముందుగా సతరు పత్రికను “దిన పత్రికగా అప్డేట్ చేయాలి . సతరు పత్రికకు ప్రముఖ పాత్రికేయులు ఒక్కొక్కరు ఒక్కో దినం ఎడిటర్ షిప్ వహించేలా చెయ్యాలి.

7.ప్రభుత్వ భవనాలను టైం షేర్ పద్దతిలోకి మార్చాలి . ప్రైవేటు సంస్థలు సైతం తగిన బాడుగలు/అడ్వాన్సులు /బ్యాంక్ గ్యారంటితో వాడుకునేలా చూడాలి

8.అంతకు ముందుగా సతరు భవనాలను తగిన గాలి వెలుతురు వచ్చేలా రీ మోడల్ చెయ్యాలి ( విద్యుత్ వినియోగం తగ్గడానికి) తామే ముందుకొచ్చి రీ మోడల్ చేసుకునే ప్రైవేటు సంస్థలకు ప్రాధన్యత ఇవ్వాలి.

9.ఇంతటితో ఆగక సతరు భవంతుల నుండి అదనపు ఆదాయం రాబట్ట డానికి అవసరమైన చర్యలు చేపట్టాలి . షాపింగ్ కాంప్లెక్స్ ,పవన విద్యుత్, బయోగ్యాస్,ఫలవంతమైన చెట్లు నాటడం,

10.కాలం చెల్లిన భవనాలైతే కూల దోసి కొంత భవంతులు కట్టుకుని -అందులో తమ కార్యకలాపాలను టైం షేర్ పద్దతిలో నడుపుకోవడానికి ముందుకొచ్చే ప్రైవేటు సంస్థలను ఐడెంటి ఫై చేసి అవకాశం ఇవ్వాలి .

11.ముఖ్యంగా ప్రభుత్వ రవాణా సంస్థకు స్వంతమైన బస్ స్టాండులను గ్రౌండ్ ఫ్లోర్లో బస్ స్టాండు – ఫర్స్ట్ ఫ్లోర్లో షాపింగ్ కాంప్లెక్స్ కలిగి ఉండేలా నిర్మించే ప్రైవేటు సంస్థలకు అవకాశం ఇవ్వొచ్చు

12.వారానికి ఒక దినాన్ని కాలుష్య వ్యతిరేక దినంగా ప్రకటించి ఆ రోజున రైళ్ళు /బస్సులు/అత్యవసర సర్వీసులను మినహాయించి ఫోర్ /టూ వీలర్స్ లను నిషేదించవచ్చు .సైకిళ్ పై ట్యాక్స్ మినహాయింపు .యాబై శాతం రాయితీ

13.పోలీసు శాఖ సహా అన్ని ప్రభుత్వ శాఖలకు ప్రజలు ఇచ్చే వినతులను 10 రూ.బాండ్ పేపర్లోనే ఇవ్వాలని రూల్ పెట్టొచ్చు. అయితే 15 రోజుల్లోపు చర్యలు తీసుకుని తీరాలి . (తప్పుడు వినతి/ఫిర్యాదు చేసిన వారికి రూ.500 దాక అపరాధం విధించవచ్చు .

14.పాంచాయితీ నుండి శాసన సభ మీటింగ్ హాలు దాక పని లేని రోజుల్లో ప్రైవేటు వారికి అద్దెకు ఇవ్వొచ్చు

15.స్వంత వాహణం మరీ ఫోర్ వీలర్ కలిగి ఉండడం పెళ్ళి మార్కెట్ నుండి సమాజంలో ఒక గౌరవ చిహ్నంగా మారింది. ప్రభుత్వ రంగ రవాణా వ్యవస్థను ప్రపంచ స్థాయిలోకి మార్చ కలిగితే స్వంత వాహణం కలిగి ఉండడం అన్నది “ఎకానమి” తెలియని తనంగా మారుతుంది.

అయితే ఈ పనికి కావల్సిన నిదులు ఎల సమకూర్చగలమని ప్రశ్నిస్తారు . సంస్థ ఉధ్యోగులు /పూర్వోద్యూగులు ,ప్రయాణికులు సభ్యులుగా ఒక కో ఆపరేటివ్ సొసైటి ఫార్మ్ చేసి ప్రతి సభ్యుడు కొంత సొమ్మును అందులో డిపాజిట్ చేసేలా చెయ్యాలి. ఆ సొసైటి రవాణా సంస్థకు అప్పు ఇచ్చేలా చోడొచ్చు . దీంతో “సంస్థ” నాది అనే భావన కలుగుతుంది.తప్పులు దొర్లినప్పుడు ప్రతి ఒక్కరు చొరవ చూపి దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తారు.

16.ప్రభుత్వ వాహణాలను గ్లోబల్ టెండర్ పిలిచి అమ్మి వెయ్యాలి . గ్లోబల్ టెండర్ ద్వారా కి.మీ కి ఇంత అని కుదుర్చుకోవచ్చు .

17.రోజుకి 24 గంటలు అలర్టుగా ఉండవలసిన శాఖలు తప్ప ప్రతి కార్యాలయం ఉ.6.30 నుండి మద్యాహ్నం 2 దాక వాస్తవంగా పని చేస్తే చాలు .( అయితే ఏ ఉధ్యోగి తన సీటు నుండి కదిలే ప్రసక్తి ఉండ కూడదు) ప్రతి కార్యాలయంలోను సిసి టివి కేమరాలు అమర్చి -పౌరులు ఏ ఒక్కరైనా చూసేలా నెట్ కాస్టింగ్ చెయ్యాలి.

18.శాస్త్ర ప్రకారం ఆస్తుల విక్రయం -కొనుగోలు చేయ కూడని నెలల్లో జరిగే రెజిస్ట్రేషన్ల పై తగిన రాయితీ

19.బిల్డర్స్ తమ టర్నోవర్లో కనీశం 10 శాతమైనా పేదప్రజలకు పనికొచ్చే ఇళ్ళు /షాపింగ్ కాంప్లెక్సులు నిర్మించేలా చూడొచ్చు .

20.ముస్లీమ్లు ఏ ఊరికి వెళ్ళినా అక్కడి మసీదులో బస చేసే వీలుంటుంది. ఆ విదంగా ఏ ప్రభుత్వ ఉధ్యోగి అయినా ఏ ఊరికి వెళ్ళినా (ప్రభుత్వ కార్యార్థం) ఏ ఒక్క ప్రభుత్వ కార్యాలయంలోనైనా (మాత్రమే) బస చేసే ఏర్పాటు.

21.దినపత్రికల్లో సగం పేజికన్నా ఎక్కువ యాడ్లు ఇచ్చే సంస్థలకు /వ్యక్తులకు ప్రత్యేక పన్ను

22. ఇళ్ళను అద్దెకు ఇచ్చే వారు స్వీకరించే అడ్వాన్సు పైకం ప్రభుత్వ పొదుపు పత్రంగా మాత్రమే ఉండాలి .

23.లైసెన్సులు /సర్టిఫికేట్ల జారిలో అర్జెంట్ /ఆర్డినరి అంటూ కేటగిరిస్ పెట్టాలి .అర్జెంట్ కేటగిరి వారికి అదనపు రుసుము వర్తింప చెయ్యాలి .

24.కాలుష్యాన్ని వెదజల్లే సంస్థలకు -ఆ కాలుష్యాన్ని బ్యేలెన్స్ చెయ్యడానికి ఎన్ని చెట్లు నాటాలో -అందుకు ఎంత మెరకు ఖర్చవుతుందో లెక్కించి వసూలు చెయ్యాలి (శాస్వత పరిష్కారం అమలయ్యేదాక)

25.అవివాహితులు ,డివోర్సీలు ,విడోయర్లు ,దంపత్య జీవితానికి అనర్హులుగా ఉన్న జీవిత భాగస్వామి కలిగిన వారిని ఐడెంటి ఫై చేసి వీరు తమ ఖాళి సమయాల్లో కలిసి సంఘ సేవ చేసేలా ప్లాన్ రూపొందించాలి .

26.ప్రతి చిన్న ఊరికి ఒక కమ్యూనిటి హాల్ -బాడుగ + విద్యుత్ చార్జీలు రూ .1000 కి మించ రాదు .మెయింటెనెన్స్ ఆయా ప్రాంతాల డ్వాక్రా గ్రూపులకు ఇవ్వాలి .

27.కలిసి జీవించ కోరేవారికి తాత్కాలిక రెజిస్ట్రేషన్

28.వంద మందికి మించి భోజనం చేసే మెస్/హోటల్ /కళ్యాణ మండపాలు /కాలేజ్ హాస్టల్సులో బయో గ్యాస్ యూనిట్ తప్పని సరి .

29.వాణిజ్య పన్నుల వసూలును ఆయా ప్రాంతాల వ్యాపారుల సంఘాలకు అప్ప గించాలి. (సంఘం బ్యాంక్ గ్యారంటి ఇవ్వాలి ) గతంలోని వసూలుకంటే కనీశం 25% అదనంగా టార్గెట్ పెట్టాలి .ఐదేళ్ళకు ఒక సారి రెనీవల్ చేసుకోవచ్చు.

30.రోగ నివారణ,రోగ నియంత్రణ, చికిత్స, నేరాల నివారణ/అదుపు, మానవ సంభంధాలు ,లైంగిక జీవితం, గర్బ నివారణ వంటి విషయాలను ఆసక్తి కరంగా చిత్రీకరించే షార్ట్ ఫిలింస్ పోటీలను ప్రతి సం. నిర్వహించాలి .వీటిని లోకల్ కేబుళ్ళు /సినిమా హాళ్ళు తప్పక ప్రదర్శించేలా చూడాలి ( ఇంటర్నెట్లో పెట్టడం అనివార్యం)

44.ప్రభుత్వ ఉధ్యోగులకు యూనిఫార్మ్ ,(సాంప్రదాయిక /చేనేత వస్త్రాలు ) ఆఫీసుల్లో ఏ గదికి /చాంబరుకి చక్క తలుపులు ఉండకూడదు .ఒన్లి గ్లాస్ డోర్స్.

45.సెక్స్ వర్కర్స్ కి తగిన కౌన్సిలింగ్ ( లైంగిక వ్యాదులు /వ్యాధి నివారణల పై) ఇచ్చి వర్క్ పర్మిట్

46.ముఖ్యంగా పౌరులు జీవనోపాది -తద్వారా తగినంత నెలసరి ఆదాయం పొందేలా చూడాలి . ఇందుకు గాను రాష్ఠ్ర వ్యాప్తంగా మేన్ పవర్ డేటా బ్యాంక్ ఏర్పాటు చేసి -కొంత రుసుము చెల్లిస్తే అందుబాటులో వచ్చేలా చెయ్యాలి .గ్రామ ఉపాది పథకం లాగా నగర ఉపాది పథకం అమలు చెయ్యాలి . ఉధ్యోగ అవకాశం ఉన్న రంగాల్లో అర్హులైన వారు తగు శిక్షణ పొందేలా విరివిగా -నిరంతర ప్రక్రియగా ఒక ప్లాన్ అమలు చెయ్యాలి ( ఇప్పట్లోలాగా తూ తూ మంత్రంగా కాదు )

TIRUMALA VISION 1900

(ఇప్పటికే గత రెండున్నర దశాబ్దాలు పలువురు ఈ.ఓలు , బోర్డ్ చేర్మన్లకు పంపుతూ వచ్చాను కాబట్టి వీటిలో కొన్ని అంశాలను అర కొరగా /స్వార్థ పుర్తి అజెండాతో / నష్ఠ దాయికంగా అమలు చేస్తున్నారు )

 (It is a bunch of suggestions to get back the novelty in Tirumala as in 1900 A.D and minimizing administrative expenditure of the TTD. It was sent on 19/9/1999 it self. Reminded many times. Rs.10 was sent by MO at least to return. But nothing was done)

The legend around Tirumala says that Sreevaru had borrowed a huge sum from Lord kubhera for his marriage expenditures and he has to return it at the end of kaliyuga. But the TTD is going on spending the revenue of Tirumala. It is nothing but vanishing the trust of countless devotees and degrading the legend. So the TTD must minimize the administrative expenditures and it has to buy gold coins with the surplus revenue. The gold coins must be kept at the gold investment scheme of central government.

1.The Tirumala must be filled only with spirituality . All the things other than sreevaru must be be banned. An amusement park must be planned at the out skirts of Tirupathi. The devotees who are interested to have thrill,pastime must go there. first. After fulfilling their perversion then only they may be permitted in to Tirumala.

2.In Tirupathi bus station it self unnecessary luggages of the devotees must be kept safely with free of cost. DVDs must be made with dos and don’ts with film actors and actresses must be projected even in the TTD chowltries (where the devotees have their sudarshan tokens.), Tirupathi bus station and also in the buses which carry devotees to Tirumala.

3.Traveling other than with govt transport corporation buses must be banned. Even the VIPs must be carried with RTC buses having bullet proof.

4.The image of Garuda must be painted on the buses. only Spiritual movies must be projected or spiritual songs must be broad coasted in buses.

5.The environment in Tirumala must make the devotees to feel that they have switched on the Time machine to 1900 A.D. All the things which remember 20 th century must bee removed. ie. pepsi -cok hoardings

6.The services of the intellectuals (ie. civil engineers artists, doctors, auditors ) , who are the devotees of Sreevaru in the world must be used at free of cost at least for a month in a year. Free accommodation and darshan must be given to them.(The TTD is implementing Sreevari seva -using devotees to work for serving food in nithyannadhanam etc.. It is nothing but the pirated copy of my vision sent on 18/9/1999 it self by courier service)

7.All the employees of TTD must under go a complete medical-psychological test. Who found deceased must be sent on leave. for necessary treatment. Only after submitting fitness certificate they must be given postings.

8.The employees must under go an examination conducted on the history of Tirumala and sreevaru , who fails must be sent on leave. Only after passing re examination they can be given postings. If they fail again they must be deputed to any other department of government.

9.The employees having consumption of Alcohol must be deputed to any other department of govt.

10.The economical conditions of the employees must be reviewed. TTD has to help its employees to come out from the private credits.

11.TTD has to conduct picnics to the members of the families of TTD employees and it has to motivate them to feel proud that their head of the family is blessed to serve for sreevaru. TTD has to motivate them to lead a simple life with high thinking.

12.All the employees in TTD must wear uniforms ie; pancha ,dhothi, kanduva and thala paga. They have to work with desks and beds.

13.No employee must be permitted to work in a same seat more than 6 days. A jumbling method must be followed.

14.TTD’s magazine Sapthagiiri must be edited by various VIPs every month ie. by mega star chiranjeevi, super star rajinikanth etc

15.Advertisements belong to TTD mustn’t be published in any news papers. The must be placed only at the website of TTD. The website may offer matrimonial services for reasonable cost.

16.Every employee of the AP state government must be given an opportunity to serve for Sreevaru at least for a week in a year. In the same way TTD employees must be deputed at least for a week to any department of the state government.

17.TTD must have a own TV channel. (It is been implemented.)

18.TTD must generate power only through solar system, biogas units. But it must be supplied to Tirupathi. The power bill of TTD must be paid only out of the power sold to Tirupathi.

19.TTD may think even to arrange yellow sarees and dhothies to devotees for rent to avoid the devotees who come with ultra modern dresses.

20.Retired film ,cricket,political, judicial personalities may be appointed as Honorable PRO s to receive the VIPs who visit Tirumala. The EO may be able to attend his administrative duties.

21.The finger prints of the criminals in India searched for several crimes must be loaded in a computer. It must be at the security cabin . There must be a scanner at the threshold of the temple. Every devotee has to keep his hands on it. The scanner have to scan the hand prints and sent it to the computer. If it finds it at the data base it has to alarm.

22.No product or service must be given to devotees at free of cost. All must be arranged at reasonable cost and in ISI standard. (No devotee is willing to have any thing for free. They are very particular about the quality

నేర నియంత్రణకు కొన్ని సూచనలు

(నేరాలు జరిగాక నేరస్తులను పట్టుకోవడానికి –కోర్టులకు తిప్పడానికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు ఆదా అవుతుంది కదా?)

నేరాలు జరిగాక నేరస్తులను పట్టి శిక్షించడం కన్నా నేరాల అదుపుకే అత్యధిక ప్రాధన్యత ఇవ్వాలి.

+సమాజంలో ఏ ఒకరైనా నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నాయి. నేరాలలో ముఖ్య పాత్ర పోషించేవి అద్దె గదులు,వాహణాలు,సెల్ ఫోన్స్ . కాబట్టి గది అద్దెకు తీసుకోవాలన్నా ,వాహణం కొనాలన్నా,సెల్ ఫోన్ కొనాలన్నా హ్యాండ్ ప్రింట్స్ అవసరమని చట్టం తేవాలి.

+పోలీసు స్టేషన్ లలో బాధితులకు న్యాయం జరిగేట్లుంటే కేసులు లేవు,అప్పీళ్ళు లేవు.పంచాయితీలు లేవు. అవి ముదిరి /వికటించి జరిగే హత్యలూ ఉండవు,ఆత్మ హత్యలు ఉండవు. కాబట్టి సంబందిత స్టేషన్ ఎస్.ఐ. జిల్లాజడ్జి పర్యవేక్షణలో సమస్యలను రాజి చేసే ఏర్పాటు చెయ్యాలి.

+పోలీసు స్టేషన్స్ లో విజిటర్స్ బుక్ ఉండాలి.అందులో సంతకం చెయ్యనిదే ఐ.జి అయినా సరే హోం శాఖా మంత్రి అయినా సరే లోనికి వెళ్ళే ప్రసక్తి ఉండకూడదు.

+స్టేషన్ ఫోనుకి,ఎస్.ఐ.మరియు సిబ్బంది ఫోన్లకు వచ్చే ఇన్కమింగ్ ,అవుట్గోయింగ్ కాల్స్ వివరాలు ప్రతి నెలా నమోదయ్యే ఏర్పాటు చెయ్యాలి

+పాత నేరస్తుల డేటాను వెబ్ సైటులో పొందుపరచాలి. వారికి (వారు కోరితే) ఉపాది కల్పించే ప్రయత్నం చెయ్యాలి. వారి మోవ్ మెంట్స్ మీద నిరంతర నిఘా ఉండాలి. వారు వలస వెళ్ళినప్పుడు ఆ సమాచారాన్ని అన్ని స్టేషన్స్ కి పంపాలి.

+ముఖ్యంగా ప్రతి స్టేషన్ లోను 3 సెట్స్ ఆఫ్ సిబ్బంది ఉండాలి. షిఫ్ట్ సిస్టమ్ ఉండాలి. ప్రతి పని లిఖిత పూర్వకంగా పారదర్శకంగా జరిగేట్లు తదుపరి షిఫ్ట్ లో వచ్చే అధికారి లేదా సిబ్బంది ఎటువంటి ఇబ్బంది లేక విచారణ, చర్యలు కొనసాగించే విదంగా ఉండాలి.

+నూతన వధూవరుల సమాచారాలు వెనువెంటనే సంబందిత స్టేషన్స్ కు చేరే ఏర్పాటు ఉండాలి. (వారి ఫోటోస్, హ్యాండ్ ప్రింట్స్). వరకట్న వేదింపు తదితర నేరాల విషయంలో ఈ సమాచారం సత్వర చర్యలకు ఉపకరిస్తుంది.

+అలాగే పోలీసుల బీట్లో తారాసపడే ప్రేమికుల సమాచారమ్ కూడ పొందుపరచబడి ఉండాలి.( వారి ఫోటోస్, హ్యాండ్ ప్రింట్స్)

+ఆస్తి పంపకం జరిగిన/జరగాల్సిన సోదరులు,భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారు,చిరుధ్యోగులు,నిరుధ్యోగులు,మూత బడ్డ ఫ్యేక్టరిల కార్మికుల సమాచారాలు కూడ 24 గంటలు స్టేషన్ కంప్యూటర్ లో అందుభాటులో ఉండాలి. ప్రతి స్టేషన్ లోను ఇంటర్ నెట్ సౌఖర్యం ఉండాలి. ప్రతి స్టేషన్ కు ఇ మెయిల్ ఐడి ఉండాలి. వారానికొకదినం ఆయా ఎస్.ఐ.లు తమ పరిదిలోని ఏరియాలో పర్యటించాలి .ప్రజలను వాకబు చెయ్యాలి.నెలకొక దినమన్నా ఆన్ లైన్ లో ఉండి యువతతో చాట్ చెయ్యాలి.

+ప్రతి స్టేషన్ పరిదిలోను యువజన సంఘాలు ఏర్పాటు చెయ్యాలి. వారు Hardy body,windy mind,holy soul కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలి.

+పోలీసుల పని భారాన్ని తగ్గించాలి. తర్కం లేని పొంతన లేని చట్టాలను ఎత్తి వెయ్యాలి. ఉ.పైరసి క్యేసట్స్,సి.డి ల వ్యవహారం. పైరసి సి.డి ల దరలకే ఒరిజినల్ సి.డి లు తయారు చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది.  ఇప్పట్లో సినిమా టు హోం అని  ఒక కాన్సెప్ట్ నానుతూంది. దీనిని ఫాస్ట్ అప్ చేస్తే మంచిది. అలాగే కోళ్ళ పందెం,పేకాట వంటివి.

ఇటువంటి షోకులున్నవారు “తమకు అందుకు తగ్గ ఆర్తిక స్థోమత ఉన్నదని,తమకు ప్రభుత్వ రాయితీలు,రుణాలు,రుణ మాఫీలు,ఉచిత వైద్యాలు అవసరమ్ లేదని ఒక అఫిడవిట్ ఇస్తే వారికి లైసెన్స్లులు ఇచ్చి పారెయ్యాలి. ఇలా ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి వ్యభిచారానికి చట్ట బద్దత

+నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు,ఫ్యేక్షన్ ప్రాభల్యం ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వం అత్యధిక ప్రాధన్యతతో మానవ వనరుల అభివ్రుద్దికి,ఉపాదికి చొరవ తీసుకోవాలి. జాతీయ బ్యాంకులు ఈ ప్రాంతాలను దత్తత తీసుకునే ఏర్పాటు చెయ్యాలి. బ్యాంకులు డైలి లోన్స్, మార్కెట్స్ లో ఉదయం పెట్టుబడి సమకూర్చి సాయంత్రం వడ్డితో వసూలు చేసుకునే వీలు కల్పించ వచ్చు. ఈ ప్రాంతాల్లోని యువతకు పోలీసు ఉధ్యోగాల్లో ప్రిఫెరన్స్ ఇవ్వవచ్చు. ( అన్ని స్టేషన్స్ కి 3 సెట్స్ ఆఫ్ సిబ్బంది అవసరమన్నాం కదా !)

+పోలీసు సిబ్బందికి తప్పనిసరి వైద్య,సైక్రియాట్రి పరీక్షలు నిర్వహించాలి. సమస్యలుంటే ఉచిత వైద్యం ,కౌన్సిలింగ్ ఏర్పాటు చెయ్యాలి

+అవివాహితులైయుండి మహిళలతో వ్యవహారం నడిపే స్థితిలోని ఉధ్యోగులు,టీచర్స్,లెక్చరర్స్,రోగిష్ఠి భార్య గల ఉధ్యోగులు,భార్యకు దూరంగా బ్రతుకుతున్న ఉధ్యోగుల వివరాలు శేకరించి వారి పై నిఘా ఉంచాలి. ఇటువంటి సమాచారాల సేకరణకు యువజనసంఘం వారి సహకారం తీసుకోవచ్చు.

+ముఖ్య నగరాల్లోని ప్రజలకు పోలీసులు గుర్తింపు కార్డులివ్వాలి. ప్రతి పౌరుని వివరాలు స్టేషన్ కంప్యూడర్లో ఉండాలి.

+అలాగే ఆ నగరాలను చీస్ చెయ్యాలి. నగరం లోపలికి కొత్తగా ప్రవేశించేవారికి స్థానికులు ఎవరైనా హామి ఇస్తే గాని అనుమతించ రాదు. పర్యాటకులైతే వారిని ఒకటికి రెండుసార్లు క్షున్నంగా పరిశోధించి,ఫోటో,హ్యాండ్ ప్రింట్ సేకరించాకే అనుమతించాలి.

+పోలీసు స్టేషన్స్,చెక్ పోస్టుల్లో పబ్లిక్ నుండి అబ్జర్వర్లను నియమించాలి. ఎవరు ఏ రోజు ఏ స్టేషన్ లేదా ఏ చెక్ పోస్టుకు అబ్జర్వర్ గా వెళ్ళనున్నారో అర గంట ముందుగాని వారికి తెలియ కూడదు.(జంబ్లింగ్ పద్దతి)

+పుణ్యక్షేత్రాల్లో పాత నేరస్తులు,వాంటేడ్ పెర్సన్స్ యొక్క హ్యేండ్ ప్రింట్స్ స్టోర్ అయిన కంప్యూటర్స్ ఏర్పాటు చెయ్యాలి. దాని ప్రక్కనే ఉన్న స్కేనర్ మీద హస్తం పెడితే ఆ హ్యేండ్ ప్రింట్స్ని కంప్యూటర్ రీడ్ చేసి సదరు హ్యాండే ప్రింట్ తన డేటా బేస్ లో ఉందో లేదో చెక్ చేసి ఉంటే బీప్ చెశి అప్రమత్తం చెయ్యాలి.

+కోర్టుల్లో సం.కంటే మించి ఎట్టి కారణం చేత కూడ కేసులు పెండింగ్ పడకుండా చట్ట సంస్కరణలుతేవాలి. సం.నికి మించి ఏదైన కేసు పెండింగ్ లో ఉంటే ఆ కేసు సమ్బందిత వాది,పరతి వాదులు వివరాలను సేకరించి వారి పై నిఘా ఉంచాలి.

+పోలీసు సిబ్బంది వివరాలను( రోగాలు,పరైవేట్ రుణాలు,ఒకరికంటే ఎక్కువ భార్యలు వంటి వివరాలతో సహా) సేకరించాలి. నేరాలకు ఉన్న అవకాశాలను ముందుగనే అంచనా వేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

+రియల్ ఎస్టేట్,గ్రానైట్స్ వంటి రంగాల్లో వారి వివరాలు కూడ తీసుకోవాలి.

+పోలీసు సిబ్బందికి,అతనికి కుటుంభ సబ్యులకు ఉచిత రవాణా,ఉచిత వైద్యం,ఉచిత గ్రుహం ఏర్పాటు చెయ్యాలి

+ఎఫ్.ఐ.ఆర్ వేసాక కేసు నడిపే భాధ్యతను మరో సంస్థకు అప్పగింఛాలి.

+జర్నలిస్టుల్లో చాలా మందికి తాము చట్టానికి అతీతులమన్న భ్రమ ఉంది. వీరి పై పలు సందర్భాల్లో ఫిర్యాదులు వచ్చినప్పటికి  అవి కోర్టుల ద్రుష్ఠికి వెళ్ళడం లేదు. కాబట్టి సిట్టింగ్ జడ్జి నేత్రుత్వంలో ఒక విచారణ కమిషన్ నియామకం జరగాలి. జర్నలిస్టులపై వచ్చిన ఫిర్యాదులు,కేసులన్ సమీక్షింఛి తగిన చర్యలు తీసుకోవాలి.

విజన్ చిత్తూరు

 (జిల్లా కేంద్రమైన  చిత్తూరు నియోజక వర్గం & నగర అభి వృద్ది కొరకు కొన్ని సూచనలు –ప్రతిపాదనలు)

+గతంలో ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కేంద్రమైన చిత్తూరు నుండి తరలించారు. వాటిని మళ్ళి చిత్తూరుకు తెప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి.

+చిత్తూరు పట్టణ పరిదిలో బి.వి.రెడ్డి కన్ఫిక్షనరి,సహకార డైరి తప్ప పెద్దగా ఉపాది కల్పించే ఫ్యేక్టరిలు లేవు. అందులోను సహకార డైరి మూతబడింది. దానిని ఎలాగన్నా మళ్ళి తెరిపించాలి. అలాగే బి.వి.రెడ్డి కన్ఫిక్షనరి దాదాపుగా మూత పడినట్లే. కారణాలు ఏమైనప్పటికి చొరవ తీసుకొని ఫ్యేక్టరి గతంలో లాగా ఫుల్ స్వింగ్ లో ఉత్పత్తి చేపట్టేలా చూడాలి. ఫ్యేక్టరి కార్మికుల భవిష్యత్తును కాపాడాలి.

+జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఒక విశ్వవిద్యాలయం తెప్పిస్తే చాలు. ప్రత్యక్షంగా పరోక్షంగా వందలాది మందికి ఉపాది లభిస్తుంది. చిత్తూరు ప్రాధన్యత పెరుగుతుంది

+టౌన్ బ్యాంక్ / కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులు ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల తరహాలో డెయిలి లోన్స్ ఇచ్చే ఏర్పాటు చెయ్యాలి

+చిత్తూరు రూరల్ మండలం , గుడిపాల మండలం,చిత్తూరు పట్టణ నిరుధ్యోగులకు ఉధ్యోగవకాశం కల్పించే విదంగా మూడు పెద్ద ఫ్యేక్టరిలను ఆయ ప్రాంతాల్లో నెలకొల్పేలా చూడాలి. (Non polluting industries)

+ముందుగా నియోజక వర్గ పరిదిలోని నిరుధ్యోగ యువత బయోడేటాలను తెప్పించుకుని వారికి తగిన సాంకేతిక విథ్య,శిక్షణ లభించేలా చూడాలి. ఆ పై వారికి వ్రుత్తి,ఉధ్యోగ అవకాశాల కల్పనకు, రుణ సహాయానికి ఏర్పాటు చెయ్యాలి.

+తగిన ఉపాది,ఉధ్యోగవాకాశాలు లేక యువతలో అధిక సంఖ్యాకులు మద్యానికి భానిసలైయున్నారు. వారికి డి-ఆల్కహాలిక్ క్యేంపులు నిర్వహించాలి. జనావాస ప్రాంతాలనుండి మద్యం దుకాణాలను దూరం చెయ్యాలి. అమ్మకం వేళలను కుదించాలి

+చిత్తూరు నియోజిక వర్గ పరిదిలో జరుగుతున్న త్రాగు,సాగు నీటి ప్రాజెక్టులు సత్వరమే పూర్తి కావడానికి కృ షి చెయ్యాలి. అవసరమైతే రైతులు/ ప్రజల వద్దనుండి ఆర్థిక సహకారం కూడ తీసుకోవచ్చు (ఓ ఆరు నెలల వాటర్ బిల్స్ ముందుగా చెల్లిస్తే చాలుగా)

కార్పోరేషన్ కార్యాలయంలో –మేయర్ చేంబర్ తో పాటుగా సిసి కేమరాలు ఏర్పాటు చేసి వెబ్ కాస్టింగ్ చెయ్యాలి

+కార్పోరేషన్ పరిదిలో పారిశుద్యం అద్వాన్నంగా ఉంది. సాధారణ పరిపాలన కూడ అంతంత మాత్రమే. కార్పోరేషన్ ఉధ్యోగులు చాలా మందికి వ్యక్తిగత ఆర్థిక సమస్యలు,ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా చాలా మంది ఆల్కహాలిక్స్ గా ఉన్నారు. ఈ అంశాలు వారి పని సామర్థయాన్ని భాగా దెబ్బ కొడుతున్నాయి. ఈ విషయాల పై చొరవ చూపి కార్పోరేషన్ యంత్రాంగాన్ని ప్రక్షాళణ చెయ్యవలసి ఉంది. కార్పోరేషన్ సిబ్బంది పని తీరును మెరుగు పరచాలి.

+ కార్పోరేషన్ ఉధ్యోగులకు వైద్య పరీక్షలు చెయ్యించి ఉచిత వైద్య సౌఖర్యం కల్పింఛాలి. ఆలాగే వారికి వారి కుటుంభ సభ్యులను ఉత్సాహ పరచి మోటివేట్ చేసేవిదంగా కౌన్సిలింగ్,గెట్ టు గెదర్ ప్రోగ్రాములు,టూర్స్ ఏర్పాటు చెయ్యాలి.ప్రైవేటు రుణ వత్తిళ్ళనుండి ఉపసమనం కల్పీంచాలి.

+ట్రాఫిక్ ను అస్త వ్యస్తం చేస్తున్న ఆక్రమణలను పార్టీలకు అతీతంగా తొలగించాలి. హార్ట్ ఆఫ్ ది టౌన్ను గుర్తించి త్రీ /ఫోర్ వీలర్సుల రాక పోకలను నిషేదించాలి. బయిట ప్రదేశాలకు వెళ్ళే వాహనాలు టౌన్ లోని కి రాకుండా చూడాలి

+ వేస్ట్ మ్యేనేజ్మెంట్ – చెత్తలనుండి ఎరువుల తయూరి/ విద్యుత్ తయారీల పై దృష్ఠి సారించాలి

+డాబాల పై పడే వర్షపు నీటిని పివిసి పైప్ ద్వారా సేకరించి మెగా ఇంకుడు గుంతల్లోకి వెళ్ళేలా చూడాలి

+పట్టణ నడిబొడ్డున ఉన్నరాములవారిగుడి ఉత్సవాల పునరుద్ద్రణ పై ద్రుష్ఠి సారిస్తే ఆస్తికుల మన్నెనలు పొందుతారు.

+నూటికి ఐదు పది వడ్ది వసూళ్ళపై ఆంక్షలు కఠిన చర్యలు. జాతీయ బ్యాంకులు సైతం డైలి లోన్ ఇచ్చేలా వత్తిడి చెయ్యడం

+పాత బస్ స్టాండు పరిసర ప్రాంతాల్లో త్రోపుడు బండ్ల వలన ట్రాఫిక్ సమస్యలే కాక ఈవ్ టీజింగ్ సమస్యలు కూడ వస్తున్నాయి. పాత బస్ స్టాండు పై సీలింగ్ ఏర్పాటు చేసి దాని పై వారికి నిరంతర షాపులు నిర్మించి ఇవ్వవచ్చును.

నా దేశం  నా స్వప్నం

 (మన భారత దేశం ,దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు సహేతుక పరిష్కారాలు కూర్చి – మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదిగారికి పంపి – ప్రధాన మంత్రి కార్యాలయం అధికారికంగా “కెప్ట్ ఆన్ రెకార్డ్” అని యాబై ఒక్క రూపాయలు వెచ్చించి మరి ఉత్తరా ముఖంగా తెలిపిన నా సలహాలను   సంకలనం ఇది. వీటిని కేంద్ర ప్రభుత్వం పరిశీలించేలా మీరు చొరవ తీసుకుంటే ఈ దేశమే మీకు రుణ పడి పోతుంది – ఇంతే కాదు వీటిలో రాష్ఠ్ర స్థాయిలో అమలు చేయ గల అంశాలను మీరు అమలు చేసినా రాష్ఠ్ర ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది మీ నవరత్నాలను విడతల వారిగా కాదు ఒక్క సారిగా అమలు చేయ వచ్చు )

భాగం:1

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో సింహ భాగం రుణాలు,రుణాల పై వడ్డీలు ,చక్కిర వడ్డీలు చెల్లించడానికే సరి పోతుంది .కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకుని విదేశి రుణాలను తీర్చి వేయ కలిగితేనే ఆది కష్ఠం అంత సు:ఖంలా  సత్ఫలితాన్ని ఇస్తుంది.

అ) రాష్ఠ్రపతి ,గవర్నర్ పదవుల రద్దు -వారి పాత్రను సుప్రీం కోర్టు/హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తులు పోషించగలరు .

ఆ)రాష్ఠ్రపతి భవన్,పార్లెమెంట్ భవనం,ప్రధాన మంత్రి అధికారిక నివాసం,రాష్ఠ్రాల్లోని గవర్నర్ భవన్లు ,అసెంబ్లి భవనాలు,సి.ఎంల అధికారిక నివాసాలు -వీటన్నింటిని గ్లోబల్ టెండర్ పిలిచి లీజుకు ఇచ్చి వేయడం

గమనిక: భవిష్యత్తులో సమావేశాలు వీడియో కాన్ఫ్రెన్సు పద్దతినే జరుగుతాయి కాబట్టి విర్చువల్ కార్యాలయాలు నడుస్తాయి కాబట్టి ఇవి సుసాధ్యమే

ఇ)స్విడ్జర్లాండ్ భ్యాంకు తరహాలో మన దేశంలోను ఒక బ్యాంకు స్థాపిస్తే విదేశాల్లో మొరుగుతున్న నల్లదనం తనంతట తనే రెక్కలు కట్టుకుని స్వదేశం చేరుతుంది

ఈ)వాహనాలకు పెట్రోలుతో పాటు ఎథనాల్ 60:40 నిష్పత్తిలో వినియోగించే ఎసలు బాటు. లగ్జరి కార్లకు డీజల్ పై రాయితీ రద్దు.

ఉ) వారానికి ఒక దినాన్ని కాలుష్య వ్యతిరేక దినంగా ప్రకటించి  బస్సులు,రైళ్ళు మినహా అన్ని వాహనాల రాక పోకలను నిషేదించడం ( రక్ష,వైద్య,అత్యవసర సేవలకు మినహాయింపు)

ఎ)దేశంలోని 18+వయస్సుగల ప్రతి పౌరునికి ఉచిత సైకిళ్ పంపిణి -సైకిళ్ళకు మెయిన్ ట్రాక్

ఏ)వ్యభిచారానికి చట్ట బద్దత

భాగం:2

కేంద్ర బడ్జెట్లో రుణాలు,వడ్డీలు కాకుండా అత్యధిక దనం కేటాయింప పడేది రక్షణకే. దీనిని ఎదోలా తగ్గించుకోకలిగితేనే  దేశ ప్రగతి సాధ్యం

అ)పాక్,చైనా,బంగ్లాదేశ్ వివాదస్పదం చేస్తున్న భారత భూభాగాలను ఐక్య రాజ్య సమితి కార్యకలాపాలకు మాత్రం పరిమితం చేసి సతరు భూభాగం యొక్క రక్షణను ఐరాస శాంతి పరిరక్షణ దళం  గైకొనేలా చూడడం.

ఆ)నక్సల్ ప్రభావిత ప్రాంతాల నిర్వహణ,ప్రభుత్వ ప్రగతి/సంక్షేమ పథకాల అమలును నక్సల్సు మద్దత్తు దారులుగా ముద్రపడిన పౌర హక్కుల సంఘాల వారికి అప్పగించడం.

భాగం: 3

ప్రభుత్వ యంత్రాంగంలోని నిర్లక్ష్యం అవినీతి భాద్యతారాహిత్యాలను అరి కట్టి ప్రభుత్వ నిర్వహణా వ్యాయాన్ని కనీశం 50 శాతం మెరకు తగ్గింఛాలి.

అ)కేంద్ర రాష్ఠ్ర ప్రభుత్వ ఉధ్యోగులందరికి వైద్య,సైకో మెట్రి పరీక్షలు నిర్వహించాలి.గత 10 సం.ల్లో చోటు చేసుకున్న మార్పులు గత 10 సం.ల్లో చోటు చేసుకోనున్న మార్పుల పై ఒక వివేదిక ప్రచురించి అందులోను పరీక్షలు న్రివహించాలి. వీటిలో అనర్హులుగా తేలిన వారికి గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇవ్వాలి.(వారి వారసుల్లో అర్హులైన వారికి ఉధ్యోగవకాశం కలిపించ వచ్చు)

ఆ)ప్రస్తుత ఖాళిలు -పై తెలిపిన పరీక్షల కారణంగా ఏర్పడిన ఖాళీలకు అభ్యర్దులను టెండర్ల ద్వారా మాత్రమే పూరించాలి. అంటే కావల్సిన అర్హత ఉండి తక్కువ జీతానికి పని చేయడానికి ముందుకొచ్చే వారికి ప్రాధాన్యత.

ఇ)శని ఆదివారాలు ,స్వాతంత్రయ దినోత్శవం మినః అన్ని శెలవులను రద్దు చెయ్యాలి సం.లో 11 నెలల పాటు నిరాటకంగా పని చేసిన వారికి మాత్రం నెల రోజుల శెలవు+జీతం

ఈ)చెరువులు,ఏర్లు,కొలములు,జలాశయాలను ఆక్రమించిన వారి వివరాలను సేకరించి సైన్యం చే తగు కఠిన చర్యలు (ఆక్రమణల తొలగింపు+ఖైదు).లింకింగ్ చానల్సును ఆక్రమించిన వారు తమ భవనాలకు యు.జిలో వాటిని పునరుద్దరించే అవకాశం .వీలు కాకుంటే కూల్చి వేయడం.ఈ వ్యవహారాల్లో ఎదురయ్యే వ్యవహారాలను పరిష్కరించడానికి  Fast Track special courts ఏర్పాటు

ఉ)ప్రతి పౌరుడు ఆన్లైన్ ద్వారా తన వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వానికి అంద చేసే ఏర్పాటు (సాముహిక,ఆర్థిక స్థితిగతుల పై)  ఎటువ్ంటి క్రాస్ చెక్ చెయ్యకనే వీటి ఆధారంగా ప్రభుత్వ ప్రగతి /సంక్షేమ పథకాల రూప కల్పన. (అయితే 3 నెలల లోపు ర్యేండమ్ స్యాంపుల్ ప్రాతిపదికన ఫీల్డు చెక్ అప్ చేయాలి .తప్పుడు సమాచారం ఇచ్చిన వారి పై క్రిమినల్ చర్యలు -ఈ విషయాన్ని ముందుగానే తగు రీతిలో తెలపడం ముఖ్యం)

ఊ)రోడ్ల నిర్మాణం కేవలం ప్లాస్టిక్ వ్యర్థాలతోనే జరిగే ఏర్పాటు.

రు)కోర్టులు 365 రోజులు,16 గంటలు పని చేసే ఏర్పాటు. ఏ సిబ్బందైనా 8 గం.లకు మించి పని చెయ్యకుండా అదనపు సిబ్బంది నియామకం. షిఫ్టు పద్దతి.

రూ) మత సంస్ఠలు కాలక్రమంలో మతపరమైన కార్యకలాపాలను తగ్గించుకుని దేశ ప్రగతికి సహకరించే ఏర్పాటు. ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో

పెద్ద ఆలయాలు,మఠాలు,ప్రార్ఠనా మందిరాలు సోలార్,విండ్ మిల్ ద్వారా విద్యుత్ ,బయోగ్యాస్ యూనిట్లతో గ్యాసు జెనరేట్ చేసి సతరు ఊళ్ళకు విద్యుత్/గ్యాసు  సరఫరా చేసే ఏర్పాటు. సాముహిక వంట శాలలు-వాటికి గ్యాస్ సరఫరా.

ఎ)స్థానిక కూరగాయల మార్కెట్,చేపల మార్కెట్ ఎదురుగా నాటి ఎస్.టి.డి బూత్ తరహాలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి చిరు వ్యాపారులకు/ఫుట్ పాత్ వ్యాపారులకు డి.ఎల్ (డెయిలి లోన్) అందించే ఏర్పాటు.

భాగం:4

అ)దేశంలోని 10 కోట్ల మంది నిరుద్యోగులతో ప్రత్యేక సైన్యం -సతరు సైన్యం చే నదుల అనుసందానం.  జలమార్గ రవాణాకు అనువుగా కాల్వల నిర్మానం.

ఆ)గ్రామ పరిది మొదల్గొని రైతు సంఘాల ఏర్పాటు. వ్యవసాయ పొలాలను సతరు సంఘానికి లీజు ప్రాతిపదికన అప్ప చెప్పి సమిష్థి వ్యవసాయం.

ఇ)సైన్యం,ప్రత్యేక సైన్యంలో ఒక విభాగం చే వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు అవసరమైన గిడ్డంగులు, కోల్డు స్ట్రోరేజిల నిర్మాణం. వ్యవసాయ ఉత్పత్తుల  రవాణాకు అవసరమైన రోడ్లు,రైల్వే లైన్ల నిర్మాణం.

ఉ)నదుల అనుసంథాన కార్యక్రమంలో పెట్టుబడి పెట్టే విదేశి వ్యాపార సంస్థలకు మాత్రమే భారత దేశంలో వ్యాపార అవకాశాలు.

ఊ) సంపూర్ణ మద్యపాన నిషేదం -ఆల్కహాలిక్సుకు కొకొ కోలా మెషిన్ తరహాలోని యంత్రాల ద్వార కాస్టు ప్రైజుకే మద్యం.

రు) ప్రతి విథ్యార్ది తన శరీరం ,మనస్సు,బుద్ది ,కుటుంభం,సమాజం,రాష్ఠ్రం,దేశం,ప్రపంచం గురించిన అవగాహణ పొంది తన కాళ్ళ పై తాను నిలబడి కుటుంభం మొదల్గొని దేశం దాక తన భాద్యతల్ని నిర్వర్తించేలా తీర్చి దిద్దే విద్యా విదానం

ఎ)విద్య అందించిన సంస్థకే విథ్యార్దికి ఉధ్యోగం తెచ్చి పెట్టే భాధ్యత.

ఏ)కలుషిత వ్యర్దాలను నదుల్లోకి /సముద్రంలోకి విడిచి పెట్టే పరిశ్రమలకు నిషేదం

ఒ) విద్యుత అవసరాలలో  కనీశం 50 శాతం సోలార్/విండ్ మిల్/బయోగ్యాస్ ద్వారా సమీకరించుకునే ఏర్పాటు

ఓ)పోలీసు శాఖలో ఖాళీలను తక్షణం పూరించడం -అలానే ప్రస్తుతం ఉన్న ఉధ్యోగాల సంఖ్యను మూడింతలుగా పెంచడం .షిఫ్టు పద్దతి అమలు చేయడం.ప్రతి పోలీస్ స్టేషన్లోను సి.సి.కేమరాల ఏర్పాటు+ వెబ్ కాస్టింగ్

పోలీసు శాఖ ప్రాధమిక దర్యాప్తు,కేసు నమోదుకే పరీమితం. కోర్టుల్లో నేరాలను రుజువు చేసేందుకు ప్రత్యేక సంస్థ ఏర్పాటు.

గమనిక:

ఇందాక చెప్పిన అంశాలను అమలు చేయడం -చేసాక రాజ్యాంగ సవరణ చేసి ప్రధానిని ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకునే విదానానికి శ్రీకారం.ప్రధానికి వీటో  పవర్.

ఎన్నికల్లో పార్టిలకు లభించిన ఓట్ల శాతం ప్రాతిపదికన ఎం.పీలను నామినేట్ చేసుకునే వీలు.ప్రతి పార్టి అన్ని స్థానాలకు తమ అభ్యర్దులను ముందుగానే ప్రతిపదించాలి. ఎవరైనా ఆకస్మికంగా మరణిస్తే ఉప ఎన్నికలకు వెళ్ళకుండా తమ అభ్యర్దుల పట్టికలోని తదుపరి అభ్యర్దిని ఎం.పి గా ప్రతిపాదించ వచ్చు.

నూరు శాతం పోలింగ్ జరిగేంతవరకు మ్యేన్ లెస్ పోలింగ్ కేంద్రాలు కొనసాగాలి .ఓటిచ్చిన ఓటరుకు రశీదు ల్యేమినేట్ చేయబడి అందే ఏర్పాటు ,సతరు రశీదులో ఓటు వేసిన తేది/సమయం నమోదై ఉండాలి .

ప్రభుత్వ  ఉధ్యోగాలు/ దేశ ప్రగతి /సంక్షేమ పథకాల్లో ముందుగా ఓటిచ్చిన వారికే అధిక ప్రాధన్యత

గౌరవనీయులైన ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారికి పంపిఅ లేఖ పూర్తి పాఠం ,

నమస్కరించి రాయునది ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తీర్పులు  చర్చనీయాంశమై ప్రాచుర్యం  పొందుతున్నాయి. ఈ తీర్పుల పై నాకు బిన్నాభిప్రాయం ఉన్నప్పటికి నాటి సుప్రీం కోర్ట్ జస్టిస్ వి.ఆర్. కృష్ణ అయ్యర్ చెప్పిన “జుడిషియల్ యాక్టివిజం “ ఇదని సరిపెట్టుకుంటున్నాను.

ఈ నేపథ్యంలోనే నేను ఈ లేఖ తమకు పంపుతున్నాను. దీనిని రిట్ పిటిషన్ గా స్వీకరించి ప్రతిపక్ష నాయకుల కి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  నోటీసులు జారీ చేస్తారు అని విశ్వసిస్తున్నాను. ఈ లేఖతో పాటుగా నా దేశం నా స్వప్నం అనే ప్రచురణను జాతా పరచాను .నా ప్రతిపాదనల ముఖ్య ఉద్దేశం వాటి అమలుకై నేను 1995 నుండి చేస్తున్నటువంటి  ప్రయత్నాలు అన్ని అందులోనే ఉన్నాయి .

ఇక్కడ మీ చొరవ – జోక్యం నా ప్రతిపాదనలు అమలుకి దోహద పడతాయి అన్న ఉద్దేశంతోనే ఈ లేఖను  తమకు పంపుతున్నాను. ఇప్పటికే  ముఖ్యమంత్రి కార్యాలయం దీనిపై ప్రాసెస్ మొదలు పెట్టింది కాబట్టి నెలకో- రెండు నెలలకో ఒక అవుట్ వచ్చే అవకాశం ఉంది. 

అయినా గత జూన్,29 నాడు వీటి పై ఒక ఎక్స్ పెర్ట్ కమిటి వెయ్యాలని కోరుతూ సి.ఎం గారికి మళ్ళీ ఒక లేఖ వ్రాసి యున్నాను. రొటీన్ ప్రాసెస్ ద్వార గాని –లేదా నా మనవిని మన్నించి ఎక్స్ పెర్ట్ కమిటి వెయ్యడం ద్వారగాని నా ప్రతిపాదనలు అమలుకు నోచుకునే అవకాశం ఉంది .

అయితే  నాడు ముఖ్యమంత్రిగా ఉన్న దశలో నా ప్రతిపాదనలను తగిన రీతిలో వాడుకుంటామని లేఖ పంపిన నేటి ప్రతిపక్ష నేత వీటి అమలుకు మోకాలడ్డే అవకాశం లేక పోలేదు .(సతరు లేఖ ప్రతి జతపరచాను)

అందుకే తమరు ఇరువర్గాలకు నోటీసులు జారి చేసిన ఎడల కాలయాపన -కోర్టు వ్యవహారాలు వారించపడతాయని నమ్ముతున్నాను.

 నాపై దయ ఉంచి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై నాకున్న చిత్తశుద్ధిని అర్థం చేసుకుని నా ప్రతిపాదనలు త్వరలో అమలయ్యేలా చూడాలని కోరుతున్నాను.

 ఇట్లు

 చిత్తూరు మురుగేశన్

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.