మిని జ్యొతిష్య భోదిని

చిత్తూరు ఎస్. మురుగేశన్

ముందు మాట
ప్రతి వ్యక్తి వెనుక ఒక కథ ఉంటుంది. జ్యోతిష్కుల గురించి చెప్పక్కర్లేదు. నాకిప్పుడు 51 సం.ల వయస్సు. చెప్పుకోవడానికి పెద్ద కథే ఉంది . కాని ఈ చిన్ని పుస్తకం వెనుక ఉన్న కథను మాత్రం ఇక్కడ చెబుతా .
మా నాన్న జిలా ఖజానా అధికారి .మా అమ్మ అరక్కోనం మణ్యకారు పుత్రికా రత్నం. నా సోదరులందరు (3) డబుల్ పోస్ట్ గ్రాజుయేషన్. నేను బికాం ఫెయిల్. 1984-1986 ప్రాంతంలో కాసనోవాలా పెద్ద ఆటే ఆడేసాను. కామి కాని వాడు మోక్ష కామి కాలేడు కదా. మో.కా అయ్యాను. ఐ మీన్ ఈ వైపుగా తొలి అడుగు పడింది. స్వతా:గా ఆంజనేయ స్వామి భక్తుడనయ్యాను.
అందరిలాగే నేను కూడ బ్రహ్మచర్యాన్ని గై కొన్నాను. బయాలజికల్గా అది అసాధ్యమని అందరికి తెలుసు. నాకూ తెలుసు. ఓ మూనెల్లు ఇలా గడిచాయి. తదుపరి ఓషో గురించి ఏమి తెలియకనే కామ వాంచను అంగీకరించాలి –అంగీకరిస్తే కాని దానిని జయించలేమన్న నిర్ణయానికి వచ్చాను. విక్రమార్కుడు ఆరు నెలలు రాజ్య పాలన -6 నెలలు ఆరణ్య పాలన చేసినట్టు పదిహెను రోజులు బ్రహ్మ చర్యం ఒక రోజు రిలాక్సేషన్ మళ్ళీ బ్రహ్మ చర్యం ఇలా సాగింది.
ఈ ప్రక్రియకు వివాహమే లీగల్ మార్గమని గ్రహించి ఒక అమ్మాయిని ప్రేమించాను (గతంలో లాగా కాసనోవా తరహాలో కాదు ) . ఒక రోజు సినిమాకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఒక ఫుట్ పాత్ జ్యోతిష్కుడ్ని కలిసాను . అందరు ప్రేమికుల్లాగే నా పేరు –ఆ అమ్మాయి పేరు చెప్పి అడిగాను .అతను ఒక రోజు –ఒక వారం –ఒక నెల మించి పోతే ఒక సం.లో విడిపోతారు అన్నాడు. చిర్రెత్తుకొచ్చింది .
ఆతరువాత ఆ అమ్మాయిని పెళ్ళి కూడ చేసుకున్నానుకొండి. తెలుగు సినిమాలో లాగా ఊరు వాడ అంతా కలిసి మా ఇద్దర్ని విడకొట్టేసారు. దీంతో నాకు జ్యోతిష్యం పై గురి ఏర్పడింది . అప్పట్లో నిరుధ్యోగిని కాబట్టి – ఏ చీకు చింతా పని పాటా ఉండదు కాబట్టి జ్యోతిష్యం గురించి లోతైన అన్వేష్నే చేసాను .ఈ పని ఎంత దీక్షతో చేసాను అంటే 1990 మార్చి కి ఆఫీస్ పెట్టేసాను .ప్రొఫెష్నల్ అయి పోయాను .
అక్కడ నుండి 2009 దాక కూడ జాతకులను ప్రత్యక్షంగా కలవడం ఫలితాలు చెప్పడం. వారి ఫీడ్ బ్యేక్ తీసుకోవడం చేస్తూ వచ్చాను . 2000 నుండే అంతర్జాలంలో రచనలు చేస్తున్నప్పటికి 2009 దాక అవి పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. ఆ తరువాత కొంత క్రెడియబిలిటి సాధించి ఆన్ లైన్ సేవలు మొదలు పెట్టాను. కొన సాగిస్తున్నాను. నేను చదివిన జ్యోతిష్య గ్రంథాల్లోని కంటెంట్స్ చాలా ఇరుకుగా –సంక్లిష్ఠంగా ఉండేవి. ఎంతో కష్ఠ బడితే గాని అర్థం చేసుకునే వీలుండేది క్కాదు. బేసికల్గా నేను రచయితను /కొంత మెరకు సరళమైన బాషా శైలి గల వాడ్ని కాబట్టి పాఠకులు తేలిగ్గా అర్థం చేసుకునే విదంగా రచనలు చెయ్యాలని ఎప్ప్పటినుండో నాకు అనిపిస్తూ ఉండేది .
నా మా తృ బాష తమిళం కాబట్టి కొంత జంకుండేది . అయినా సాహసించి 32 పేజీల పాకెట్ సైజ్ పుస్తకంగా 2004 లో ప్రచురించడం జరిగింది (స్పాన్సరర్ ఆర్థిక సాయంతో) ఇప్పుడు ఇ-బుక్స్ సీజన్ కాబట్టి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు కాబట్టి ఇంకొన్ని విషయాలు కలిపి ఇ –బుక్ రూపంలో మీకు అందిస్తున్నాను.
-చిత్తూరు మురుగేశన్

జ్యొతిష్యం ఒక మహా సముద్రం
జ్యొతిష్యం నిజంగనే ఒక మహా సముద్రం. కొల్లేరు ప్రాంతంలోని రొయ్యల పెంకం దార్లవలే దేశంలోని జ్యొతిష్యులు కొంత జ్ఞానాన్ని నిల్వ ఉంచుకొని అదే జ్యొతిష్యం అని చెప్పుకుంటున్నారు . (నేను సైతం)
వృత్తిపరమమైన జ్యొతిష్యులు పరిస్థితే ఇదంటే ఒక రచయితగా, కవిగా ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ స్థాపనకు గత 33 సంవత్సరాలుగా కృషి చేస్తున్న నా పరిస్థి వేరే చెప్పకర్లేదు. ఒక టెస్ట్ ట్యూబ్-లో ఆ సముద్రపు నిటిని ప్రోగు చేసి అందులో తర్కం,మానవత్వం, అనే రంగులను కలబోసి చూపుతున్నానని చెప్పుకోవచ్చు.
ఈ ఇంటర్-నెట్ సం స్కృతిలోని కీలకాంశాలను సరళీకరించి సామాన్యులు సైతం తెలుసుకునేలా చెయ్యాలన్న సతుద్దేశంతో ఈ మిని జ్యోతిష్య భోధినిని రూపోందించడం జరిగింది. ఈ చిన్న పుస్తకంలోని అంశాలను తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ జ్యోతిష్కులై పోతారని చెప్పలేను. అయితే జ్యొతిష్యం పేరుతో మోసపోకుండా మిమ్మల్ని ఈ చిన్న పుస్తకం రక్షిస్తుందని మాత్రం హామీ ఇవ్వగలను.
జనన జాతకం:
గర్బదానం చేయబడిన సమయం (తల్లి, తండ్రుల సంయోగం) , శిశువు సిరోదయం జరిగిన సమయం, బిడ్డ కెవ్వున అరచిన సమయం వీటిలో ఏదో ఒక దానిని తీసుకొని ఆ సమయంలోని గ్రహా స్థితిని పట్టి ఫలితాలు చెబుతారు. ప్రస్తుతం బిడ్డ కెవ్వుమని అరచిన సమయాన్ని బట్టి జాతకం, జాతక ఫలాలు వ్రాస్తూ, చెబుతూ ఉన్నారు.
రుతు జాతకం:
స్ర్తీలకు రుతు జాతకం కీలకమని కొందరంటారు. (వారు వువ్పువతులైన సమయంలోని గృహస్థితి) అయితే ఇది తర్కరహితం. ఆ స్త్రీ భూమి పై పడిన క్షణం నుండి ఆమెకేం జరగాలో అది ఆమె జాతక చక్రంలోనే ఉంటుందన్నది నా అభిప్రాయం, అనుభవం.
అయితే ఆ రుతు జాతక ప్రభావం దాదాపుగా 2 ½ సంవత్సరాల కాలం వరకు ఆమె పై ఉండే అవకాశాన్ని పూర్తిగా త్రోసి పుచ్చలేం.
జాతక ఫలాలు :
ఇందులో దశాభక్తుల ఫలం, గోచార ఫలం అంటూ రెండు ఉంటాయి. దశభుక్తుల ఫలానికి జనన జాతకంలోని గ్రహస్థితే మూలం . గొచార ఫలితం అన్నది ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిని పట్టి చెప్పపడుతుంది. (నేడు పత్రికల్లో వెలుబడేవన్ని గోచార ఫలితాలే)
జనన కాల గ్రహస్థితి :
ఎప్పుడో నేను పుట్టినప్పుడున్న గ్రహస్థితి జీవితాంతం నన్నెలా ప్రభావిస్తుందని మీరు ప్రశ్నించవచ్చును. కెమెరాలో ఫిలిం ఉంతుంది. కెమరా క్లిక్ మన్నప్పుడు షటర్ తెరుచుకున్న క్షణంలో ఎదురుగా ఉన్న దృశ్యం ఆ ఫిలిం లో చిత్రీకరింపపడుతుంది. ఒక్కసారి ఈ ప్రక్రియ జరిగి పోయిన తరువాత ఆ చిత్రంలో మార్పు చేయడం అసంభవం. ఇటువంటిదే మీ జనన కాల గ్రహస్థితి.
తాత్కాలిక గ్రహస్థితి :
కంప్యుటర్లు/ కలర్ ప్రింటర్స్ లేనప్పుడు బ్లాక్ & వైట్ ఫోటోలకి (ముఖ్యంగా చనిపోయి నవారి) రంగులు వేయించుకునే వారు. తాత్కాలిక గ్రహస్థితి కూడ అంతంత ప్రభావాన్నే మనిషి పై చూపుతుంది.
1.జన్మనక్షత్రం :
క్యాలండరులో ప్రతిరోజు తేదితో పాటు వారం కూడ మారుతుంటుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే నక్షత్రాలు కూడ మారుతుంటాయి. (దాదాపుగా అన్ని క్యేలెండర్ల లోను దీనిని చూడ వచ్చు)
మీరు జన్మించినప్పుడు /ఆ నాటి క్యేలండరులో వారంతో పాటు పేర్కొన్న బడిన నక్షత్రమే మీ జన్మ నక్షత్రం. (మీకు తేలిగ్గా అర్థం కావడం కోసం ఇలా చెప్పాను ) కాస్త టెక్నికల్గా చెప్పాలంటే ఆకాశ వీథిలో చంద్రుడు 27 నక్షత్రాల గుండా సంచరిస్తూ ఉంటాడు . మీరు జనిమించినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రం గుండా సంచరిస్తున్నాడో అదే మీ జన్మ నక్షత్రం. నక్షత్రాలు మొత్తం 27. అశ్విని మొదటిది. రేవతి చివరిది. మీ నక్షత్రాన్ని బట్టి మీ జన్మరాశి – జన్మదశ నిర్ణయించబడ్తుంది.
నక్షత్రాలు: 27

1.అశ్విని
2.భరణి
3.కృత్తిక
4.రోహిణి
5.మృగశిర
6.ఆరుద్ర
7.పునర్వసు
8.పుష్యమి
9.ఆశ్లేష
10.మఖ
11.పూర్వఫల్గుణి
12.ఉత్తర
13.హస్త
14.చిత్త
15.స్వాతి
16.విశాఖ
17.అనూరాధ
18.జ్యేష్ట
19.మూల
20.పూర్వాఆషాఢ
21.ఉత్తరాషాఢ
22.శ్రవణము
23.ధనిష్ట
24.శతభిష
25.పూర్వాభద్ర
26.ఉత్తరాభద్ర
27.రేవతి.

2. జన్మరాశి :
మీరు పుట్టిన సమయంలో చంద్రుడు సంచరించిన నక్షత్రం ఏ రాశికి సంభందించిందో ఆ రాశియే మీ జన్మరాశి. రాశులు మొత్తం 12 .

1. మేషం,
2. వృషభం,
3. మిథునం,
4. కర్కాటకం,
5. సింహం,
6. కన్య,
7. తుల,
8. వృశ్చికం,
9. ధనుస్సు,
10. మకరం,
11. కుంభం,
12. మీనం

రాశుల (వారి) గుణ గణాలు
చంద్రుడు ఏ రాశిలో ఉంటే అదే జన్మ రాశి .మీ రాశిని పట్టి మీకు కొన్ని గుణ గణాలు సమ కూరుతాయి.అవేవో ఇప్పుడు చూద్దాం.
మేషం:
మీరు జస్ట్ ఒక సైనికులు వంటివారు. మీకు ఖచ్చితంగా ఒక కమాండర్/సలహాదారు అవసరం( కేవిపి వంటి వారు కాదు ముర్రో) ఈ సోమరి ప్రపంచంలో చురుగ్గా ఉండి మరి విమర్శలకు గురయ్యేది మీరొకరే. బాస్ తో ప్రత్యక్ష సంభంధమున్న పొజిషన్ లో ఉంటే భాగా రానిస్తారు. లేకుంటే సాటి ఉధ్యోగులు మిమ్మల్ని శతృవుగా పరిగణించే అవకాశం కూడా ఉంది. తగిన ప్లానింగ్ లేకుండా తలకు మించిన పనుల్లో దిగి తిక మక పడతారు. ముందంజలో ఉండాలని ఉవ్విళ్ళురుతారు. కాని దాని కోసం పెద్ద పోరాటమే చెయ్యవలసి వస్తుంది.వీరు అగ్ర సంతానంగా, లెదా కుటుంభాన్ని,సంస్థను ముందుకు తీసుకెళ్ళే పొజిషన్లో ఉంటారు. కాని దీనికోసం ఇన్నో పోగొట్టుకుంటారు. చివరికి ఇతరుల విమర్శలకు సైతం గురవుతారు.
2.వృషభం:
వీరిది చిన్నపిల్లల మనస్తత్వం . అల్ప సంతోషులు, ఎదుటివారు కొద్దిగా ఆప్యాయంగా మాట్లాడితే చాలు తమ మనస్సులో మాట ఇట్టే కక్కేసి చిక్కున పడతారు. వీరికి మాట,కుటుంభం, దనం అంటే ప్రాణం.
జీవితం చాలా కౄరమైంది .ఎవరికి ఏదంటే ప్రాణమో దానినే దూరం చేస్తుంది, వీరు అత్యవసర పరిస్థితిలో సైతం టూకిగా మాట్లాడలేనంతగా మాటలకు భానిసలై ఉంటారు. ఇచ్చిన మాట నిలుపుకోవాలని చూస్తారు. దీనినే ఎదుటివారి వద్దనుండి కూడ ఎదురు చూస్తారు.లేకుంటే అలుగుతారు.
కుటుంభాన్ని ప్రేమిస్తారు. ప్రేమతో కుటుంభ అభివృద్ది కోసం వీరు చేసే సూచనలను ఇతరులు నిర్లక్ష్యం చేసినప్పుడు అలుగుతారు. కుటుంభానికే దూరమైనా కావచ్చు. మార్పును వ్యతిరేకించే వీరు సాంప్రదాయ పద్దమైన పెళ్ళికే మొగ్గు చూపుతారు. ఒక వేళ ప్రేమించి పెళ్ళి చేసుకున్నా క్రమేణా కుటుంభంతో దగ్గరవుతారు. గానుగలో ఎద్దులాగా ఒక రొటీన్ కి అలవాటు పడి పోతారు. వీరికి కొంత గడ్డి పడేసి వీరిని ఇతరులు భాగా వాడుకుంటుంటారు
మిథునం:
మిథునం అన్న పథం మైదునం అన్న పదం నుండి వచ్చింది. మైథునం అంటే నేటి తరానికి తెలియదేమో? రతి అని భావం.ఇప్పట్లో వచ్చే పంచాంగాల్లో మిథున రాశి సింబల్ పేరిట విడిగా ఉన్నస్త్ర్రీ పురుషుల బొమ్మలను ముద్రిస్తున్నారు. మా ఇంట 1932 నాటి పంచాంగం చూసాను ( మా తాత మునస్వామి జ్యోతిష్యలో ప్రవేశం మొదల్గొని అన్ని విషయాల్లోను ఇంచుమించు నా టైపే. అంటే నేను మేథావి వర్గం ఆయన శ్రామిక వర్గం . ఆయన చెయ్యని వృత్తి వ్యాపారమంటూ లేదు. అన్నీ ఆరు నెలలకే పరిమితం) పాయింటుకొస్తా..1932 నాటి పంచాంగంలో రతి భంగిమలో ఉన్న స్త్రీ పురుషుల బొమ్మ ఉండే. అప్పుడు కాని నాకు స్పార్క్ కాలేదు.
ఈ రాశి వారి జీవితంలో సెక్స్ అత్యంత ప్రాధన్య కలిగి ఉంటుంది.వారి వారి జాతక విశేషాలను కాబట్టి అతిగా లభ్యం కావడమో, అస్సల్ దొరక్క పోవడమో ఉండొచ్చు గాని ప్రాముఖ్యత ప్రాధన్యత మాత్రం సెక్సుకే. అలానే బ్రదర్స్,సిస్టర్స్ ప్రభావం కూడ ఎక్కువ. మంచైన చెడైనా వారిద్వారే జరుగుతుంటది.
వీరి జీవితంలో నుండి సోదర భంధాన్ని ఎప్పటికి విడదీయలేం. వీరు అధికంగా ప్రయాణాలు చేస్తుండొచ్చు. ( మెడికల్ రెప్స్?) వీరికి రెండు పేర్లు,రెండు వృత్తులు, రెండు చిరునామాలుండవచ్చు. వీరి జీవితంలో మరో వింత కూడ ఉంటుంది. ఏదైన పెద్ద మంచి విషయం జరిగితే వెంటనే ఏదో ఒక పెద్ద దుఖం,కష్ఠం,నష్ఠం కూడ కలుగుతుంటుంది.
ఈ రాశి వారిలో పురుషుల్లో నాజూగు ఎక్కువ ( ఫిమెలిష్) , స్త్రీల్లో మొరటు తనం ఎక్కువ ఉండే అవకాశం గలదు. విద్యా వైద్య జోతిష్య గణిత రంగాల్లో ఆసక్తిగలవారై, అన్ని వర్గాల ప్రజలతో మాటా మంతి గలవారై ఉంటారు.
కర్కాటకం:
వీరి సమస్యల్లోచాలావరకు మనోసంభంధమైనవే ఉంటవి. మనస్సు అనే పదం అడుగడుగున వీరి మాటల్లో చోటు చేసుకుంటుంటుంది. అప్పుడప్పుడు మూడ్ అవుట్ కావడం.తేలిగ్గా చికాకు పడటం వెంటనే శాంతించడం ఉండొచ్చు. వీరికి శీతల సంభంధ రోగాలు వస్తవి. చంచల స్వభావం ఎక్కువ. అసలు విషయాలను పక్కన పెట్టి సైడ్ ట్రాక్ పట్టే అవకాశం కూడ ఎక్కువే.
జాగ్రత్తగా పరిశీలిస్తే వీరిలో ఒక నెలలో పన్నెండు రాశులవారి గుణగణాలు కనబడుతుంటవి. ఆలోచన,మాటలు,చేతలు,వృత్తి,సంపాదన, మానవ సంభంధాల్లో సైతం స్థిరత్వం ఉండదు. దైర్యం, భయం తరచూ ఒకటి వెనుక ఒకటి బహిర్గతమవుతుంటవి.
వీరికి ఆశ్చర్యం, దిగ్బ్రాంతి కలిగించే విషయాలంటే ఆసక్తి ఎక్కువ. రాజ విక్రమార్క ఏడాదిలో ఆరు నెలలు రాజుగా,ఆరు నలలు దేశ దిమ్మరిగా బతికాడంటారే ఆ టైపు జీవితం వీరిది. మానసిక ఉద్రిక్తతల వలన వీసింగ్, బి.పి.అల్సర్, నవ్వ వంటి సమస్యలు రావచ్చు.ప్రముఖుల భార్యలు సాయ పడతారు.
వీరి ఫిసిక్ లో సైతం పెనుమార్పులుంటవి.కొంతకాలం బక్క చిక్కి ,మరి కొంతకాలం లావెక్కి కనబడతారు. ఇంచు మించు వీరిది ద్విపాత్రాభినయం. వీరి గురించి తెలుసుకోవాలంటే కొన్ని క్లూస్ ఇస్తా వీరి గుణగణాలకు చంద్రుడు, నది,సముద్రం, మిర్రర్,జలం యొక్క ధర్మాలకు దగ్గర పోలికలుంటవి.
ఉ: రవి కాంతిని చంద్రుడు ప్రతిబింబించినట్టే వీరు సైతం ఎవరో ఒక ఆదర్శ పురుషుని ఖ్యాతిని చాటుతుంటారు. ఈ రాశివారు ద్యానం, భక్తి, సెలిబ్రిటీస్ ను ఆదర్శంగా తీసుకోవడం వంటి ఏదో చిట్కాను వాడకుంటే ఎందుకూ పనికి రానివారిగా తయారవుతారు.
వీరి జీవితంలో తల్లి,ఇల్లు,వాహనం,విద్యలకు అత్యంత ప్రాధన్యత ఉంటుంది. అంటే ఇవి కూడ రెండు విదాలుగా ఎఫెక్ట్ ఇస్తుంటాయి. నెలలో ఒక పెదునాలుగు రోజులు అనుకూలంగాను, మరో పదునాలుగు రోజులు ప్రతికూలంగాను ఉంటవి.
సింహం:
జాతకునిలో ఒకింత వరకు సోమరి తనం, అతి విశ్వాసం, చిటపటలాడటం ఉండొచ్చు. తండ్రితో వైరుధ్యం లేదా అతని వెనుకంజ సాధ్యమే. తల్లి మీద అమిత ప్రేమ ఉంటుంది. ( దీనిని డెపెండెన్స్ అని కూడ చెప్పొచ్చు) భవిష్యత్తులో అత్తా కోడళ్ళ పోరులో వీరు భలి పశువు అయ్యే ప్రమాదం కూడ ఉంది.( తల్లికి ఇచ్చే అత్యంత ప్రాధన్యత వలన). వీరు ఇతరులకు అప్పిస్తే తిరిగి రావడం కష్ఠమే వీర్ని ప్రశ్నించే స్థాయిలో ఉన్నవారు అతిత్వరలో బలహీన పడి పోతారు.( ఆర్థికంగా/శారీరకంగా). దాన గుణం ఉంటుంది. గుడి గోపురాలకన్నా క్రమ శిక్షణ, విద్యుక్త ధర్మానికే అధిక ప్రాధన్యత ఇస్తారు. మానవత్వమూ ఉంటుంది. సూర్యుని గురించి సైంటిఫిక్ గా తెలుసుకుని సూర్య నమస్కారం చేస్తూ వస్తే గొప్ప వారుగా తయారవుతారు. ఉదాహరణకు ఆరు నుండి సా.ఆరు దాక ఉత్సాహంగా ఉంటారు.ఆ తరువాత డల్ ఫీలవుతారు. వీరున్న ఇంటికి ఇదురిల్లు పాత పడి పోతుంది అని ఒక విశ్వాసం
కన్యా :
కన్యా రాశివారి గురించి చెప్పాలంటే మూడే ముక్కలు శతృ,రోగం,రుణం, ఇవి ఈ రాశి వారిని కాదండోయి వీరి చుట్టూ ఉన్నవారిని సైతం బాధిస్తాయి.ఇందుకు చక్కని పరిహారం ఉంది, కన్యా లగ్నం లో జన్మించిన వారే కాదు, వారి చుట్టూ ఉన్న వారు కూడ క్రింది పరిహారాలు చేసుకుంటే మంచిది. లేకుంటే చుట్టూ ఉన్నవారితో బాటు జాతకుడు సైతం రోగిష్ఠిగానో, అప్పుల అప్పారావుగానో, కోర్టు కేసులంటూ తిరుగు వాడుగనో తయరవుతారు.
పరిహారం:
ఏ మంచి పని మొదలు పెట్టినా ఒక్క రూపాయన్న అప్పు చేసిన సొమ్ముతోనే ప్రారంభించాలి. గ్రీన్ కలర్ దుస్తులు,వస్తువులు ఎక్కువగా వాడాలి. తమ ఆఫీసు రూమ్/ పడక గదిని ఆసుపత్రి/కోర్టు /బ్యాంకును తలపించే విదంగా అలంకరించుకోవాలి
ఉదాహరణకు గ్రీన్ కలర్ స్క్ర్రీన్స్, బెడ్ కవర్,పిల్లో కవర్ వాడండి, మీకు అవసరం లేక పోయినా ఖాళి ప్రొనోట్స్,రెవిన్యూ స్టాంపులు, స్తాంపు పేపర్లు నిల్వ ఉంచండి, చక్క సుత్తి, న్యాయ దేవత బొమ్మ వాడండి. మీ అభిమాన నాయకుల్లో/ కథానాయకుల్లో ఎవరన్నా లాయర్/ డాక్టర్ ఉంటే వారు సతరు డ్రెస్ లో ఉన్న ఫోటో మీ కళ్ళ ముందు పెట్టుకొండి. ఒక ఐదు వారాలు ఏదైన విష్ణు ఆలయానికి వెళ్ళి తులశి మాల వేసి దండం పెట్టుకుని రండి (మరెప్పుడన్నా మీకు శతృ,రోగ,రుణ బాధలు కల్గినా ఈ పని చెయ్యండి)
తుల:
పుట్టిన ఊళ్ళో ఉన్నంత వరకు కుండలో దీపం. దానిని విడిచాక కొండ మీద దీపం. మీ ఆర్థిక పురోగతిని చూస్తే రొటేషన్ చక్రవర్తి అని చెప్పొచ్చు. మీ జీవితం పై ఫ్రెండ్,లవర్, భాగస్వాముల ప్రభావం అదికంగా ఉండొచ్చు. మంచైనా చెడ్డైనా వారి వల్లే జరిగే అవకాశం ఉంది.
సుఖాన్వేషిగా వృషభరాశివారికి ఏమాత్రం తీసిపోరు. అయితే వృషభరాశివారు అటు ఇటుగా సర్దుకు పోయి సుఖాన్ని పొందితే మీరు పోట్లాడైనా సరే సుఖాన్ని పొందుతారు. వారు కాస్త స్లో , మీరు కస్త ఫాస్ట్ . వారు డబ్బును ఫణంగా పెట్టడానికి సైతం వెనుకాడుతురు. మీరు ఎదగడం కోసం జీవితాన్నే ఫణంగా పెట్టే దమ్ము గలవారు.మీ పెళ్ళి కూడ శతృ కుటుంభ జనిత అమ్మాయి/అబ్బాయితోనే అవుతుంది. కొత్త సంభంధమైతే క్రమేణా అత్తా మామలకు దూరమవుతారు. మీకు పొదుపు చాలా అవసరం. ఆస్తుల పై పెట్టుబడి పెట్టి ఏ పరిస్థితిలోను వాటి జోలికి పోకుండా ఉండాలి. లేకుంటే మీ వింత వైఖరి వలన అయినవారే మిమ్మల్ని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. తస్మాన్ జాగ్రత్తా!
వృశ్చికం:
వీరు ఎంత ఓర్పుగా ఉండ దలచినా పరిస్థితి అందుకు సహకరించదు. వీరికే తెలియకుండా వీరి మాటలు ఎదుటివారికి కాసింత బాధ కల్గించి వేస్తాయి. వీరికి ఊపిరితిత్తులు సంభంధ సమస్యలు రావచ్చును ( పొగ,సెగ,మానసిక వత్తిడి కారణంగా) .వీరికి యుద్దమంటే ఎంతో మక్కువ. చాలాసార్లు వీరే సమర శంఖం పూరిస్తారు. ఒక శతృవు ఉన్నంత కాలం ఎంతో యాక్టివ్ గా ఉంటారు. లేకుంటే బోర్ అనిపిస్తుంది. వీరికి బాల్యంలో అమ్మోరు, ట్యూమర్స్ వంటివి వచ్చుండొచ్చు. లేదా ఎత్తైన చోటునుండి క్రింద పడిపోవడం,కొమ్మున్న జంతువులు, కరెంట్,అగ్ని సంభంధంగా నష్ఠం జరిగి ఉండవచ్చు. కొమ్మున్న జంతువుల వలన ఆర్థిక నష్ఠం కూడ కలిగి ఉండవచ్చు వీరిలో శక్తి జెనరేట్ అవుతూ ఉంటుంది. దానిని సక్రమంగా వినియోగించుకోకుంటే మానసిక వత్తిడి,షుగర్, వంటివి రావచ్చు. ఫిసికల్ ఎక్సర్ సైజు అనివార్యం. వీరికి ప్రజా జీవితం అంతగా అచ్చురాదు.
దనస్సు:
ఒకింతవరకు దూర దృష్థి ,పొదుపు,భవిష్యత్ గురించిన ఆలోచన గలవారే. కాని డబ్బులిచ్చి మోస పోయినవారు, ప్రైవేటు చిట్ ఫండ్స్, చిన్నా చితకా బ్యాంకుల్లో పొదుపు చేసి మోస పోయినవారు, ఆస్తి వివాదాల్లో తలమునకలయ్యేవారొలో దనుర్ రాశి వారు ఎక్కువగా ఉంటారు. మగవాడన్నాక సంపాదనార్థం దూరదేశాలకు సైతం వెళ్ళాల్సిందేననే ఆలోచన గలవారు. పుణ్యక్షేత్ర యానం, తీర్థయాత్రలకు ప్రాధన్య ఇస్తారు. మీరు భవిష్యత్తులో పది మందికి మంచి చెడ్డా చెప్పే గురు స్థానంలో ఉండాల్సినవారు.కాని బాల్యం,యవ్వనంలో “అటు ఇటుగా” ప్రవర్తిస్తుంటారు. కొందరు మద్య వయస్సులో సైతం డబుల్ యాక్ట్ ఇస్తుంటారు ( చదివేది రామాయణం – దూరేది ….గుడిసెలు అన్న చందంగా) .ఒక వ్యవహారం క్లీష్థంగా తయారవ్వాలంటే వీరిని రంగంలో దింపితే సరి. తమ మాటలతో పరిష్కారమవుతున్న వ్యవహారాన్ని మొదటికి తెస్తారు. వీరి జీవితంలో తండ్రి ,తండ్రి ఆస్తి, ఆయన తరపు బంధువులు,దూర ప్రయాణాలు,పూజా పునస్కారాలు, తీర్థ యాత్రలు అధిక ప్రాధన్యత కలిగి ఉంటాయి. దూర దేశాలతో సంభంధాలు కలిగి ఉంటారు. ఈ ఏడాది ఆదాయాన్ని ఈ ఏడాదే అనుభవించే యోగం తక్కువనే చెప్పాలి. దానిని డంప్ చేసి దాని పై పెద్ద పోరాటం చేసి తదుపరి ఏడాది అనుభవించేలా చేసుకుంటారు.
మకరం:
మీ లగ్నం మకరం .ఇది రాశి చక్రంలో పదో రాశి కాబట్టి మీరు ఒర్కహాలిక్ గా ఉంటారు ( మీ లగ్నాధిపతి శని అయినందున కాస్త ఆలశ్యం తామసం ఉన్నప్పటికి మీరు ఒర్క హాలిక్. లగ్నాధిపతితో చంద్రుడు చేరాడు కాబట్టి మీ చురుకుదనంలో నిలకడ లేని తనం ఉండొచ్చు. ముఖ్యంగా అమావాశ్య తరువాత వచ్చే పద్నాలుగు రోజుల్లో కాస్త సోమరిగా ,ఊహల్లో మునిగి తేలుతూ ఉండొచ్చేమో గాని పౌర్ణమి తరువాత మాత్రం కర్మయోగి లెవల్లో పనుల మీద దృష్ఠి పెడతారు) మీరు చేసే పని ఏది? దాని విలువెంత? అందుకుగాను మీకు ముట్టేదెంత? అసలు దాని ప్రతిఫలం ఎవరికి చేరుతుందని కూడ ఆలోచించరంటే చూసుకొండి.
కుంభం:
వీరి జీవితంలో ఎంతటి గడ్డు స్థితి వచ్చినా ఏదైనా సరే బొత్తిగా ఖాళి కాదు. అది డబ్బుకావచ్చు, పలుకుబడి కావచ్చు ప్రేమ కావచ్చు, లోపలి మనుషులు .రహస్యాలుంటవి. ఏది చేసినా “నాకేంటి?” అని ప్రశ్నించుకుని (లాభమండి బాబు) కాని పనిలో దిగరు. యవ్వనంలో ఈ నేచర్ కనబడక పోవచ్చేమో క్రమేణా స్వార్థపరులుగా తయారవుతారు. వీరి పనితీరులో కాస్త నిదానం ఉండవచ్చేమోగాని డాబు,డబ్బాల పై ఆసక్తి ఉండదు. ముఖ్యంగా నాలవల్టీస్, ఫేన్సి, కాస్మెటిక్స్ పై నిరాసక్తత ఉండును. జీవితాంతం యూనిఫార్మ్/జిడ్డు/ మురికి/కంపు కనీశం ఆ వాతావరణం వీరిని వీడదు. మీ జీవితంలో వృద్ద సోదర,సోదరిమణుల ప్రభావం అత్యధికంగా ఉండొచ్చ్యు. ఎవడు ఏమై పోతే నాకేంటి నా పని నాది,నా కూలి నాకు గిట్టిందా అని ఉన్నప్పటికి ఏదైన సందర్భంలో ఓనరు/ఉన్నతాధికారులతో డీ అంటే డీ అని దిగే అవకాశం కూడ లేక పోలేదు.
మీనం:
ఇది మీ చివరి జన్మ అని కూడ కొందరు చెబుతారు. మీకు ఇతరులకి బేసికల్ గా ఉండే వ్యత్యాసం ఇది.ఇతరులు అన్ని కావాలని ఉవ్విళ్ళూరి అన్నీ పొందే ప్రయత్నంలో ఖర్మ ఖాతాలో ఖర్మను సైతం ఎక్కువ చేసుకుంటూ పోతారు (దీని ఫలితంగా తదుపరి జన్మల్లో కష్థ నష్ఠాలకు గురై ఈ ఖర్మలను పోగొట్టుకుంటారు)
కాని మీకు ఇదె చివరి జన్మ కాబట్టి మీరు అంటి ముట్టనట్టే ఉంటారు. పతి దానిలోను కొద్దిగానైనా కష్ఠ నష్ఠాలకు గురవుతుంటారు. కాని జీవితపు మొదటి గట్టంలో రివర్స్ ఎఫెక్ట్ కారణంగా అన్నీ తమకే కావాలని ఉవ్విళ్ళూరే అవకాశం కూడ ఉంది.
ప్రారంభ దశలో భాగా సంపాదించినప్పటికి ఆ తరువాత అంత:కరణ ప్రేరణతో ఆదాయం చేతికందే మునుపే ఖర్చులు ప్లాన్ చెయ్యడం, అప్పులు చేసైనా ఖర్చులు చెయ్యడం మొదలవుతుంది. సుదూర ప్రయాణాల్లో ఆసక్తి ఉంటుంది. అసలు గమ్యం తెలీని ప్రయాణాల పై కూడ ఆసక్త్ గలదు. వీరికి పాదాలు, నడకలో కొంత తేడా కనిపించే అవకాశం కూడ ఉంది.ఎందులోను పెద్దగా కమిట్ కారు. జారిపోతుంటారు. అందుకేనేమో ఇతరులు మిమ్మల్ని చిక్కడు దొరకుడు అంటుండవచ్చు.
రాశ్యాధిపతులు :
ముందుగా ఏరాశికి ఏగ్రహం అధిపతియో తెలుసుకోండి. మేషం – కుజ , వృషం –శుక్ర ,మిథునం –బుధ ,కర్కాటకం –చం ,సింహం –రవి ,కన్య –బుధ ,తుల –శుక్ర, వృశ్చికం –కుజ ,దనస్సు –గురు,మకర,కుంభం –శని ,మీనం –గురు
గమనిక: రాహు కేతువులకు ఏ రాశిపైన ఆధిపత్యం లేదు.

3.జన్మలగ్నం :
ప్రతి రోజు రవి తూర్పున ఉదయించి పడమరన అస్తమించి తిరిగి మరుసటి దినం తూర్పున ఉదయిస్తాడు. ఈ 24 గంటల్లో ప్రతి రెండు గంటలు (దాదాపుగా) ఒక రాశిని తేజోమయం చేస్తాడు. మీరు పుట్టిన సమయంలో రవి ఏ రాశిని తేజోమయం చేస్తున్నాడో అదే మీ జన్మలగ్నం .
4.జాతక చక్రం :
ఈ చక్రం చతుర్భుజాకారంలో ఉంటుంది. ఇందులో 12 గళ్ళు ఉంటాయి. మన సౌఖర్యార్దం దీనిని చతుర్భుజాకారంలో వేస్తుంటాం గాని నిజానికి ఇది కోడి గ్రుడ్డును పరుండ పెట్టినట్టు ఉంటుంది .
ఇందులోని 12 గళ్ళు మేషం మొ మీనం దాక ఉన్న 12 రాశులన్న మాట.వీటిని జాతక పరిశీలనలో భావాలు అని కూడ పేర్కొంటాం.ఈ జాతక చక్రం లేదా రాశి చక్రం మొత్తం 360 డిగ్రీలు. ప్రతి భాగం 30 డిగ్రీలు ఉంటుంది.
గమనిక :
జాతక ఫలాలు తెలుసుకోవడంలో లగ్నాన్ని గోచార ఫలాలు తెలుసుకోవడంలో రాశిని స్టార్టింగ్ పాయింట్ గా తీసుకోవలి. గళ్ళు లెక్కించే సమయంలో క్లాక్ వైస్ అంటే ఎడమ వైపు నుండి కుడి వైపుగా లెక్కించాలి.
నవగ్రహాలు :
రవి, చంద్ర, కుజ, గురు, శని, బుధ, శుక్ర 7 గ్రహాలు మరియు రాహు కేతువులనే 2 ఛాయా గ్రహాలను కలిపి నవగ్రహాలంటాం.
నవగ్రహాల శుభత్వం- పాపత్వం :
నవగ్రహాల శుభత్వ పాపత్వాల నిర్ణయంలో రెండు పద్దతులు ఉన్నయి. ఒకటి నైసర్గిక శుభత్వ, పాపత్వం మరొకటి లగ్నాత్ శుభత్వ పాపత్వం .
నైసర్గిక శుభత్వ పాపత్వం :
శుక్ల పక్ష చంద్రుడు, గురు, పాపులతో కలవని బుదుడు, శుక్రుడు శుభులు తక్కిన వారు పాపులు .లగ్నం లేదా రాశి నుండి లెక్కించినప్పుడు,
కొణ స్థానాలు :
1,5,9-కొణ స్థానాలు. ఇక్కడ నైసర్గిక శుభులుంటే బెస్ట్ –పాపులుంటే బెటర్
కేంద్ర స్థానాలు:
4,7,10- కేంద్ర స్థానాలు. ఇక్కడ నైసర్గిక పాపులుంటే బెస్ట్ –శుభులుంటే బెటర్
దుస్థానాలు:
6,8,12- దుస్థానాలు ఈ స్థానాధిపతులు, దుస్థానాధిపతులు (అత్యంత వినాశ్కారులు) వీరు ఈ భావాలలోనే మారి మారి ఉంటే బెటర్ (ఉ: ఆరింట –ఎనిమిదవ భావాధిపతి)
శుభత్వ పాపత్వ నిర్ణయం :
జోతిష్య శాస్త్రంలో నైసర్గిక / లగ్నాత్ శోభత్వ పాపతృములంటూ రెండున్నప్పటికి అనుభవంలో చూసినప్పుడు లగ్నత్ శుభత్వ పాపత్వ నిర్ణయమే మరింత హేతు బద్దంగా ఉంది.
ఒకే గ్రహానికి శభత్వం పాపత్వం :
ఒకే గ్రహానికి శుభత్వ పాపత్వం కలుగుతుంటుంది ఉదాహరణ : లగ్నం మిధునం అనుకోండి ! శని 8,9 రెండు భావాలకూ అధిపతి అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితిలో (ఒకేగ్రహానికి శుభత్వం+పాపత్వం కలిగినప్పుడు) ఆ గ్రహం మొదట పాపిగాను ఆ తరువాత శుభుడు గాను ఫలితాన్నిస్తాడు .ఆదశలో ప్రధమ భాగం దుష్బలితాలను తదుపరి భాగం శుభఫలితాలను ఇస్తుంది .
గ్రహబలం :
గ్రహాలు తాము ఉచ్చబలం పొందే రాశికి ఏడవ ఇంట నీచం పొందుతారు. ఏ గ్రహం ఏ రాశిలో ఉచ్చబలం పొందుతుందో క్రింది పట్టికలో చ్య్డగలరు.
రవి – మేషం
చం – వృషభం
కుజ -మకరం
గురు-కర్కాటకం
శని – తుల
బుధ – కన్య
శుక్ర-మీనం
ఏ గ్రహం బలంపొందాలి- ఏ గ్రహం బ్లహీనపడాలి :
1,5,9 అధిపతులు అత్యంత బలం
4,7,10 అధిపతులు మద్యంతర భలం పొందాలి.
6,8,12 అధిపతులు పూర్తిగా బలహీనపడాలి.
ఏ గ్రహం ఏ గ్రహంతో కలవాలి :
1,5,9 అధిపతులు పరస్పరం కలుస్తే 100% మంచిది
విరు 4,7,10 అధిపతులతో కలుస్తే 75% మంచిది లేదా 4,7,10 అధిపతులే పరస్పరం కలుస్తే 50% మంచిది
1,5,9,4,7,10 అధిపతులు 2,11 అధిపతులుతో కలుస్తే 35% మంచిది. అయితే పై చెప్పిన అధిపతుల్వెరికి 6,8,12 అధిపతులొతో కలయక ఉండరాదు. పై చెప్పిన నిభందనలను మీ జాతక చక్రానికే కాక నేటి గ్రహస్థితికి కుడ అన్వతించి చూడవచ్చున.
ద్వాదశ (10+12=12) భావ ఫలాలు :
జాతక చక్రన్ని 12 గళ్ళుగా విభజించారని ముందే చెప్పుకొన్నాం. ఈ 12గళ్ళు మీ జీవితం అనే పోర్టబుల్ టి.వి లోని 12 చానల్స్ ని చూపిస్తాయి. ఈభావాలకు భావాధిపతులకు పై చెప్పిన నిభందనలను అన్వయిమ్చి చూడండి. అవి ఎంత మేరకు సరిపొతయో అమ్తకుమేరకు క్రింద 12 భావాలు సూచించే రంగాల్లో మికు మంచి రానింపు ఉంటుంది.
ద్వాదశ భావాలు:
1, లగ్నం లేదా రాశి : మి తల రంగు , ఎత్తు, బరువు, ఆరోగ్యం, గుణ గబాలను తెలుపుతుంది.
2. దవభావం : రెవిన్యూ ఇన్కమ్, కళ్ళు, కంఠంమాట, వాగ్దాతి, కుటుంభంతో మీ సంభందాలను సూచిస్తుంది.
3.సోదర భావం : మీ ప్రయత్నం, సాహాసం, సోదరులు , చిన్న ప్రయాణాలు, సంగిత అభీరుచి.
4.మాతృ భావం : తల్లి, ఇల్లు, వాహనం , విద్య, హృదయం.
5. పుత్రభవం : మీ బుద్ధి కుశలత , అదృష్ఠం , ప్రశాంతత , ద్యానం , సంతానాలు .
6. రోగ భావం : శత్న , రోగ , రుణ బాధలు , మేనమామ , పొత్తికడుపు.
7. కళత్రం : ప్రెండ్ , లవర్ , పార్ర్ట్నర్ , భార్య , నాభి .
8 . ఆయుర్భావం : దీర్ఘ రోగాలు , జైలు పాలు , ఐ.పి వేయడం , భానిసత్వాలు , మర్మాంగం .
9 . పితృభావం : మీ పూజ , తండ్రి , పితురార్జితం , విదేశీ యాణం , తీర్థయాత్రలు , గురువు , మోకాలు .
10 . జీవనం : వృత్తి , వ్యాపారం , ఉద్యోగాలు .
11 . లాభం : అక్క , అన్న , వ్యాపారంలో రానింపు .
12 . వ్యయం : నిద్ర , సెక్స్ , ఖర్చు పెట్టే విదానం.
గ్రహ కారకత్వం
ఒక్కో భావం కొన్ని విషయాలను సూచిస్తున్నట్టే/ ప్రభావిస్తున్నట్టే ఒక్కో గ్రహం ఈ ప్రపంచంలోని – మన జీవితంలోని కొన్ని విషయాలను సూచిస్తుంది , ప్రభావిస్తుంది దీనినే గ్రహ కారకత్వం అంటారు . ఇక గ్రహాల కారకత్వం గురించి చూద్దాం.
ఒక గ్రహం జాతకంలో శుభుడై బలం పొంది ఉంటే ఆ గ్రహం కారకత్వం వహించే విషయాలు జాతకునికి అనుకూలిస్తాయి.
రవి కారకత్వాలు: ( పోర్ట్ ఫోలియో)
తండ్రి ,తండ్రి ఆస్తి,తండ్రి తరపు భంధువర్గం, తూర్పు దిక్కు, కెంపు రత్నం, గడియారం,ఆత్మ, ఆత్మ విశ్వాసం, పల్లు (టీత్) ,ఎముక, వెన్నెముక,కుడి కన్ను, కొండ ప్రదేశాలు, నాయకత్వ లక్షణాలు, ప్రాక్టికాలిటి, సూపర్ వైజింగ్.
క్వాలిటి కంట్రోల్, తామర పువ్వు, వ్యాపార ప్రకటనలు, అనవున్స్ మెంట్స్, దిన పత్రికలు, నిస్వార్థ సేవలు, ఇత్తడి, రోజువారి షెడ్యూల్డ్ ప్రయాణాలు, షటిల్ ప్రయాణాలు, గ్రామం, గ్రామాధిపత్యం, పురపాలక సంస్థ, పారదర్శకత, దానం, నిక్క పొడుచుకుని ఉన్న తల వెంట్రుకలు గల వారు, పై కప్పు లేని ఇల్లు, ఏక పుత్రుడు, బోన్ ఫ్రేక్చర్, నిద్ర లేమి ,ముళ్ళున్న కాయలు,పుష్పాలు, స్వేచ్చా స్వాతంత్ర్యం, ఆరంజ్ రంగులకు రవియే అధిపతి.

గమనిక: శరీరంలోని కుడి కన్ను, కుడి భాగానికి రవి అధిపతి. అయితే ఇది స్త్త్రీల విషయంలో వామ భాగం రవి ఆధిక్యతలో ఉంటుంది,

చంద్ర కారకత్వం: ( పోర్ట్ ఫోలియో)

శరీరంలోని ఎడమ కన్ను , ఎడమ భాగం (స్త్రీల విషయంలో ఇది కుడి కన్ను,కుడి భాగమై ఉంటుంది) వాయు దిక్కు ( నార్త్ వెస్ట్) ముత్యం, ప్రముఖుల భార్యలు, తల్లి, తల్లి, ఆమె తరపు భంధువులు, ఆమె తాలూకు ఆస్తి ఊపిరి తిత్త్లులు, మూత్ర పిండాలు,రాత్రి సమయం, ఊహా శక్తి, కనికరం, మంచి మానవత్వం, పౌర్ణమి, సముద్ర తీరం, చంచలం, చపలత్వం, ఆకస్మిక నిర్ణయాలు, ఆకస్మిక ప్రయాణాలు, అనుకోని అతిథి, కుళ్ళి పోయే కూర గాయలు, పూలు, మనోల్లాసం, ఆశ్వర్యం కలిగించే విషయాలు ( రెండు తలలతో పుట్టిన దూడ వంటివి) జల సంభంధ ప్రదేశాలు, ఎవరు ఎంత సేపుంటారో తెలీని ప్రదేశాలు, ఉ: పెళ్ళి మండపం, సినిమా హాళ్ళు సంత, మార్కెట్, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, విమానాశ్రయం, పడవ, నావ, సముద్రయానం, ఇసక, సీజనల్ వ్యాపారాలు, ప్రజలతో ప్రత్యక్ష సంభంధం గల పనులు నది , నది తీరం, తల్లి వయస్సుగల స్త్ర్రీలు, మదర్లి ఫిసిక్ ఉన్న స్త్ర్రీలు, రెండుంపావు రోజుల్లో పూర్తికాగల ప్రాజెక్టులు, నిలకడన లేని తనం, నీరు ,ద్రవ పదార్థాలు, అనిశ్చితి ,

కుజ కారకత్వం:( పోర్ట్ ఫోలియో)
పోలీస్,మిలిటరి, రైల్వే,భూములు,సోదరులు,కెమికల్స్, అగ్ని,ఇందనాలు (ఫ్యూయల్స్) కట్టెలు,విద్యుత్, ప్రేలుడు పదార్థాలు, శతృవులు,మీకన్నా వయస్సులో చిన్నవారు, చిన్నవారిలాకనబడే వారు ( ఫిసిక్ – రూపం) , రాజు కులస్తులు, అగ్ని ముఖ వృత్తి వారు, దక్షిణ దిక్కు,ఉష్ణ రోగాలు, ట్యూమర్స్, రక్త శుద్దిలో సమస్యలు, కడుపులో మంట.పెప్టిక్ అల్సర్, పైల్స్, శస్త్ర్ర చికిత్స, రోడ్డు ప్రమాదం, అగ్ని ప్రమాదం, కోపం,ద్వేషం, రంపు,రచ్చ, కొమ్మున్న జంతువులు,పాలు ,పాల ఉత్పత్తులు, మాంసం, సుబ్రమణ్యస్వామి, స్పోర్ట్స్, వంట, మార్షల్ ఆర్ట్స్,యుద్దాలు, తర్కం, వ్యూహం, పగడం, ఎముకలోని బోన్ మ్యేరో, వ్యాధి నిరోధక శక్తి, బలి, మాంసాహారం.

రాహు కారకత్వం: (పోర్ట్ ఫోలియో)
సినిమా,లాటరి, సారాయి, జూదం, పొగాక,సర్పాలు, విష జంతువులు,ఇతర బాషస్తులు, అన్ వారంటడ్ మోషన్స్, వామిటింగ్ సెన్సేషన్స్, ఎగుమతి,దిగుమతి,వేదేశాలు, విదేశీ యానం, కాకిలాంటి నల్లని రంగు గల మనుష్యులు, కాకిలా ఓర చూపు చూసే వారు, త్రాగు బోతులు, జూదరులు, మేజీషియన్స్, అల్లోపతి మందులు, రసాయినిక ఎరువులు, సి.ఐ.డిలు, ముసుగు దొంగలు, మాఫియా, డ్యూప్లికేట్ వస్తువులు, రాత్రి పూట చేసే పనులు, చీకటిలో చేసే రహస్య కార్య కలాపాలు ,కుట్రలు, రహస్య శతృవులు.స్మగ్లింగ్, పన్ను ఎగవేత,బ్లాక్ మని, తెర వెనుక ఆడించే రాజ్యాంగేతర శక్తులు,నడుముకు క్రింది భాగం, అక్కడ గుర్తు తెలియని నొప్పులు, బలహీనతలు దొంగ లెక్కలు, సరకుల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, వయసుకు తగిన ఇదుగుదల లేక బక్క చిక్కి ఉండటం ,లేదా బోద శరీరం, ఫుడ్ పాయిజనింగ్, మెడికల్ అలెర్జి,మాధక ద్రవ్యాలు.

గురు కారకత్వం: ( పోర్ట్ ఫోలియో)
గోల్డ్, కుదువ వ్యాపారం, నామ మాత్రపు వడ్డీతో సాగే ఫైనాన్స్ వ్యాపారం, టీచింగ్, రాజకీయం, తి.తి.దే వంటి ధార్మిక సంస్థలు, వృద్దులు, గెజటడ్ ఆఫీసర్శ్, ఖజాణా, బ్యాంకులు, పెళ్ళి, భార్యా, పిల్లలు, గౌరవం,పలుకు బడి, బ్రాహ్మణులు, పురాణ ఇతిహాసాలు, సంస్కృతం,గుళ్ళు,గోపురాలు,సేవా సంస్థలు,హిందూ మతం, మత సంస్థలు, ఈశాన్య దిక్కు, న్యాయ స్థానం, పుష్యరాగం,హృదయం, కడుపు, జ్నాపక శక్తి, ఆస్తికత్వం,ప్రభుత్వ గుర్తింపు, అవార్డు,రివార్డులు, ప్రభుత్వ గృహ వసతి, గురువులు (ఉ: షిర్డి సాయి, వీరబ్రహ్మేంద్ర స్వామి, తీర్థ యాత్రలు, క్యేషియర్/ షరాఫ్ , ముందు చూపు,ప్రణాళికలు రోపొందించుకోవడం, బిజినస్ అడ్మినిస్ట్ర్రేషన్, ఈశాన్య దిక్కు, కనక పుష్యరాగం,కోర్టు, బ్రాహ్మణులు,వేదాలు,యజ్న యాగాదులు, బెల్లం,పప్పు దినుసులు.

శని కారకత్వాలు: ( పోర్ట్ ఫోలియో)
ఐరన్,స్టీల్,ఆయిల్, సెకండ్ హ్యాండ్ వస్తువులు, దుమ్ము దూళి నిండినవి, కుళ్ళు కంపు వచ్చేవి, జిడ్డు గలవి,నల్ల రంగుగలవి , పడమర దిశ, ఇస్.సి, బి.సి లు క్లాస్ ఫోర్ ఎంప్లాయిస్, పేద ప్రజలను దోచుకునే వ్యాపారాలు, (ఉ. నూటికి పది వడ్డి వ్యాపారం) , యూని ఫార్మ్ దరించిన కార్మికులు, కార్మిక సంఘాలు, నల్లని చాయ కలిగిన వ్యక్తులు, వికలాంగులు (ముఖ్యంగా కుంటి వారు) , నరాల వ్యవస్థ, కాలు, ఆసనం, ఆలశ్యం, బంధించపడటం, అవమానం, వ్యవసాయం, క్వారిలు,స్వరంగాలు, దీర్ఘ కాల ప్రాజక్టులు, దళిత వాడలు (మాల పల్లెలు), మరుగు దొడ్లు, డ్రెయినేజి వ్యవస్థ, సోమరితనం, కూలడానికి సిద్దంగా ఉన్న, కోర్టువ్యాజ్యాల్లో ఉన్న నివాసాలు, కాయులా పడ్డ కర్మా గారాలు, ప్రేతాత్మలు, బక్క చిక్కి పీక్కు పోయిన శరీరం,ముఖం గలవారు,కాళ్ళు,నూనె విత్తనాలు,లాయర్లు, మంద బుద్ది, అశుబ్రత, మరణ సంభంధ ఆదాయాలు, చేదైన వస్తువులు, చెత్త,చెదారం, స్క్రాబ్, భానిస వృత్తులు, మరణ సంభంద వ్యాపారాలు ( ఫ్రీజర్ బాక్స్) , జెయిలు, మార్చువరి,వల్లకాడు, మల బద్దకం ఆలశ్యం.ఇనుములు.

బుధ కారకత్వం 😦 పోర్ట్ ఫోలియో)
పోస్టల్,ఇస్.టి.డి, మొబైల్స్, మెడిసిన్స్, గణితం , అకౌంట్స్, ఆడిటింగ్, కన్సల్టన్సి, కొరియర్,లైసెన్ ఆఫీసర్, అఫిషియల్ స్పోక్స్ మ్యెన్, విద్యా, వైద్య సంస్థలు, సంఘాలు ,సమైఖ్యలు, .వ్యాపార రంగం, కమీషన్ ఏజెన్సి, డీలర్ షిప్, ఫ్రాంచెస్.వైశ్యులు ఉత్తర దిక్కు ,బజారు వీథి , చేంబర్ ఆఫ్ కామర్స్, చర్మం, పురుషుల్లో అండం (టేస్టికల్స్ ), స్త్ర్రిలలో ఓవరీస్ , కీళ్ళు, సమాచార సేకరణ, క్రోడీకరణ, వాటిని సక్రమంగా పొందుపరచడం ( భావ ప్రకటనా సామర్థ్యం) ప్రభుత్వం+ప్రైవేటు రంగాలవారు కలిసి నిర్వహించే సంస్థలు . కొత్తవారిని జంకు బొంకు లేక సంప్రదించే శక్తి, కన్సల్టన్సి,జ్యోతిష్యం,ముందు వెనుకా తెలియని ఏ ఇరువురిని కలిపే వృత్తైనా అది బుధుని కారకత్వమే. మార్కెటింగ్, సేల్స్ రెప్, కథ, వ్యాస రచన,ఇంటర్ నెట్, కంప్యూటర్,సహకార సంస్థలు, అరేటరి (ప్రసంగం చేయు శక్తి)
సెమినార్, పార్క్, చిత్త భ్రమ, మేనమామ , మామగారు,వైష్ణవ నామం గలవారు, చర్మ రోగం గలవారు, పిచ్చోళ్ళు

కేతు కారకత్వాలు: (పోర్ట్ ఫోలియో)
రాజ యోగం, ద్యానం,వేదాంతం,విరక్తి,సన్యాసులు, బైరాగులు,దేశ దిమ్మరులు,హిప్పీలు, పుండ్లు, తల,శరీరంలో పేను, వృధా ఖర్చులు,త్రిప్పుట అలసట,అకారణ,తర్కాతీత సమస్యలు, వీధిన పడటం, అన్నానికి అలమటించటం, కట్టుకోవడానికి బట్టలు సైతం లేని దుస్థితి,మనస్సున గుర్తు తెలియని భీతి ఇవరైనా చేతబడి చేసారేమోనన్న ఫీలింగ్, పాము పుట్ట వద్ద పనుకొన్నంత పరిస్థితి ,మంత్ర విద్యల్లో ఆసక్తి, నిదులు, వశీకరణం, రసవాదం వంటి వాటి పై పిచ్చి, నమ్ముకున్న వారెల్లా నట్టేట ముంచటం, విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించి మోస పోవడం,విదేశాల్లో ఉండగా పాస్ పోర్టు,వీసా మిస్ అవడం,లేదా యుద్దం ప్రకటించ పడటం, ముందు వెనుక తెలియని చోట దారి తప్పడం,అన్య మతస్థులు,అన్య మత ప్రార్థనా స్థలి

శుక్ర కారకత్వాలు: ( పోర్ట్ ఫోలియో)

హౌసింగ్,ఆటో మొబైల్స్, స్నాక్స్,చిరు తిండులు,వాహణాలు, ఫర్నిచర్స్, జాలి టూర్, పక్నిక్,పెళ్ళీళ్ళు,పేరంటాలు,పార్టీలు, సెక్స్, జన్య భాగాలు, ఆపోజిట్ సెక్స్, లలిత కళలు, ఫ్యేన్సి, నావల్టీస్, గర్భస్త బ్రాహ్మణ స్త్రీ, పట్టు వస్త్రాలు, అందమైన భార్య/ప్రియురాలు, మంచి నిద్ర నృత్యం, గానం , ఆకలిని తీర్చని చిరు తిండులు (కోక్ పీట్సా) , దప్పికను తీర్చని పానీయాలు (కొక్కో కోలా) ఫైవ్ స్టార్ హోటెల్, ఏ.సి గదులు ,స్లీపర్స్, ఆగ్నేయ దిక్కు ( సౌత్ ఈస్ట్) ,వెండి. హ్యేండి క్రాఫ్ట్ ,రంగులు,కలర్ సెన్స్,టెక్స్ టైల్స్,రెడిమేడ్స్, బ్యూటి పార్లర్స్, హై క్లాస్ సెలూన్స్,హోమ్ నీడ్స్, టూర్స్ అండ్ ట్రావల్స్, వుల్వా బస్సులు, విందు వినోదాలు, రతి

కుజ , సర్ప దోషాలు
ఇతర గ్రహాలు భలహీన పడి ఉంటే సతరు గ్రహ భలం జాతకుని లేదు అని మాత్రమే చెబుతారు .కాని కుజ –రాహు –కేతువులు చెడి ఉంటే మాత్రం దానిని కుజ –సర్ప దోషాలు అంటారు . ఆ జాతకాలను విడిగా ఉంచి వాటిని అటువంటి దోష జాతకాలతోనే కలపాలి అంటారు. దీనిని పట్టే ఈ గ్రహాల ప్రాధాన్యత ఏమిటో అర్థమవుతుంది .
కుజగ్రహం జన్మ లగ్నం నుండి 3 , 6 , 10 , 11 స్థానాలు కాక మరే స్థానాంలో ఉన్నా అది కుజదోషం .
రాహు కేతువులు 3 , 6 , 10 , 11 , 4 , 12 తప్పించి మఱ్ స్థానంలో ఉన్నా అది సర్పదోషం .
దోషాలున్న వారు లేన్నివార్ని చేసుకుటే చస్తారన్నది . అతిశోయుక్తి . మరణాన్ని నిర్ణయించేది వారి వారి జాతకాలే . కేవలం జీవిత భాగస్వామి జాతకంలో ని దోషం మాత్రమే మరణాన్నిస్తుందంటే అది కేవలం మూఢ విశ్వాసమే అవుతుంది .
1 . కుజ దోష పరిహారం : మీ శారీరక ధారుఢ్యతను పట్టి రక్త దానం చేయండి కుజదోషం పరిహారం అవుతుంది.
2. సర్ప దోష పరిహారం : విదేశీ భాష ఒక దానిని నేర్చుకొండి ఉదాహరణకు జెర్మన్ , ఫ్రెంచ్ మొ : దోషాలున్నవారు , దోషాలున్న వారినే వివాహం చేసుకోవడంవలన దోషాలు పోవు . ఒకే గూటికి చెందిన పక్షుల్లా ఒకరినొకరు తేలిగ్గా అర్ధం చేసుకోగలరు శుద్ద జాతకులు అనవసరంగా తమకు లేని ఇబ్బందులనుకొని తెచ్చుకోక రక్షింపపడ్తారనే పెద్దలు ఈ ఏర్పాటును చేసియున్నారు .
గమనిక:
వీటితో పాటు తదుపరి అద్యాయంలో ఇచ్చిన నవగ్రహ దోషాలకు హేతుబద్ద పరిహారాలు శీర్షికన కుజ ,రాహు,కేతు గ్రహాలకు ఇచ్చిన పరిహారాలను పాటించండి. కాసింత ఉపసమనం ఖచ్చితంగా లభిస్తుంది .

నవగ్రహ దోషాలకు హేతుబద్ద పరిహారాలు
1. రవి బలహీణుడైన యెడల చేసుకోవలసిన పరిహారాలు:

సూర్య నమస్కారం, ఉదయం ,సాయంత్రం వాక్ చెయ్యడం ,ఆదిత్య హృదయం శ్లోకాలు చదవడం, క్యేల్షియం అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం, యూరిన్ టెస్ట్ చెయించుకోవడం ( లాస్ ఆఫ్ క్యేల్షియం ఉందేమో చూసుకోవడం , యూరిక్ యాసిడ్ మోతాదుకన్నా ఎక్కువ ఉందేమో చూసుకోవడం) ఒక వేళ ఉంటే వెంటనే చికిత్స ప్రారంభించడం, రవి కారకత్వ వృత్తి వ్యాపారాల్లో ఉంటే పై తొలగడం, అనివార్య పరిస్థితిలో కొనసాగవలసి వస్తే ఆ ఆదాయంలో నుండి కొంత భాగాన్ని తండ్రి లేదా తండ్రి వరస వచ్చే వారికి ఇవ్వడం. ఇంటి మద్య భాగాన రోలు, గుంత ఉంటే వాటిని సరిచేసుకోవడం

2. చంద్రుడు బలహీణ పడియున్న యెడల చేసుకోవలసిన పరిహారాలు:
ఇంట్లోపు చిన్న సైజు ఫౌంటేన్ (రెడిమేడ్స్ దొరుకుతాయనుకుంటా) , అక్వేరియం ఏర్పాటు చెయ్యండి.ఊయల ఉంటే మంచిది .ఊగండి. అమావాశ్య తరువాత వచ్చే పదునాలుగు రోజులూ మూన్ లై ట్ డిన్నర్ ( ఇంటి డాబా పై) చెయ్యండి. చంద్ర కారకత్వ వృత్తి వ్యాపారాల్లో ఉంటే పై తొలగడం, అనివార్య పరిస్థితిలో కొనసాగవలసి వస్తే ఆ ఆదాయంలో నుండి కొంత భాగాన్ని తల్లి లేదా తల్లి వరస వచ్చే వారికి ఇవ్వడం.దుమ్ము,దూళి, టెన్షన్ పనికిరాదు. వీటికి దూరంగా ఉండండి. ఏనీరంటే ఆ నీరు త్రాగకండి. ఇంటినుండే ఒక బాటిల్లో తీసుకెళ్ళినా బెటరే. ఆయుధం దరించని శాంతస్వరూపు అయిన అమ్మవారిని పూజించండి. ముఖ్యంగా కన్యాకుమారి అమ్మవారు. ఎవరికీ ఖచ్చితమైన మాట ఇవ్వకండి. కమిట్ కాకండి. చూద్దాం చూద్దాం అంటూ పోతే మంచిది.స్విమ్మింగ్, తల స్నానం అధికం చెయ్య కూడదు. వాయు దిక్కులో వంటగది ,గుంతలు, భావి, ఉండ కూడదు . మీరనుకున్న చెడ్డ విషయాలు జరిగిపోయే పమాదం ఉంది. అనుకోని మంచి విషయాలే అనుకోని సందర్భంలో జరుగుతాయి.

3. కుజుడు బలహీనుడైన యెడల పరిహారాలు:
రక్తదానం , మాంసాహార విందు ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలలు, లైబ్రరిలు, దర్గా,గుళ్ళకు విద్యుత్ పరికరాలు దానం చెయ్యడం, యోగాసనం, వ్యాయామం, మార్షెల్ ఆర్ట్స్ నేర్చుకోవడం. మీ ఇంటికి దక్షిణాన ఖాళి స్థలమ్, పల్లం, ఉంటే సరి చేయండి. కొండ మీద ఉన్న సుభ్రమణ్య స్వామిని పూజించండి. చంద్ర కారకత్వ వృత్తి వ్యాపారాల్లో ఉంటే పై తొలగడం, అనివార్య పరిస్థితిలో కొనసాగవలసి వస్తే ఆ ఆదాయంలో నుండి కొంత భాగాన్ని సోదరుడు/సోదరి లేదా ఆ వరస వచ్చే వారికి ఇవ్వడం. కుజ సంభంధ కారకత్వాల్లో మెళకువ పాటించడం. వీలున్నంత వరకు దూరంగా ఉండడం.

4. రాహు బలహీనుడైన యెడల చేయవలసిన పరిహారాలు:
పుట్ట కలిగి, బ్రహ్మణులు పూజ చెయ్యని అమ్మవారి గుడి సందర్శన ఫ్రెంచ్,జెర్మన్ వంటి విదేశీ బాషలను నేర్వడం. ఫోటోగ్రఫిని హాబిగా పెట్టుకోవడం, దోపిడి, నేరాలను చిత్రీకరించే సినిమాలు చూడడం. కథలు చదవడం, తమాషాకు ఇస్పేటు కాయితాలాడటం, నష్ఠ పోవడానికే లాటరి టికెట్ కొనడం , పరమ పదం ఆడడం, ఇంటి హాల్, బెడ్ రూమ్స్ గోడలకు చైనీస్ డ్రాగన్ పోస్టర్, రబ్బర్ పాములు వేసి ఉంచడం.
నెలకొక సారైనా ఎవరన్నా ముసలి వానికి ఒక క్వార్టర్ మందు దానం చెయ్యండి. మీకా అలవాటుంటే మానెయ్యండి. తప్పక దానికి భానిసలై పోతారు. పామువంటి ఉంగరం దరించడం, పులిమీద ఉన్న అమ్మవారిని పూజించడం,
గమనిక:
రాహు కేతువులు ఒకరికొకరు సమసప్తకంలో అంటే 180 డిగ్రీల్లో ఉంటూ ఒకరినొకరు ప్రభావిస్తారు కాబట్టి కేతు సంభంధ విషయాల్లోనూ మెళకువ పాటిస్తూ,కేతు కారకత్వాల్లోనుండి కూడ దూరంగా ఉంటే మంచిది

5. గురువు బలహీనుడైన యెడల చేసుకోవలసిన పరిహారాలు:
గురువారం పసుపు బట్టలు దరించి శివాలయం లేదా ఎవరైన గురువుల వద్దకు వెళ్ళి దర్శనం.
భంగారం దరించక బ్యాంక్ లాకర్స్ లో దాచడం. అజీర్తిని వారించడం,వయస్సుకు తగ్గ వ్యాయామం. బ్రాహ్మణ స్నేహితులుంటే వారికి బ్రేక్ ఫాస్ట్ ,మీల్స్ ఆఫర్ చెయ్యడం. గురు కారకత్వం గల విషయాలకు దూరంగా ఉండటం. సేవా కార్యక్రమాలకు ముఖ్యంగా గుళ్ళు గోపురాలకు డబ్బులు ఇవ్వొచ్చు కాని చొరవ తీసుకోకూడదు. పెద్ద మనుషులతో కాస్త మెళకువతోనే వ్యవహరించడం. బ్యాంక్, కోర్టు,ప్రభుత్వ సంభంధ విషయాల్లో పక్కా గా వ్యవహరించడం. ఉదయమే లేచి పళ్ళు తోమి బిల్వ ఆకులు నమిలి తినడం. ఇంటికి
ఈశాన్యంలో వంటగది, మరుగు దొడ్డి, మెట్లు, మిట్ట, సెప్టిక్ ట్యాంక్ వంటివి ఉంటే తొలగించండి.సంపు నిర్మించుకొండి.

6. శని బలహీనుడైన యెడల చేసుకోవలసిన పరిహారాలు:
వంటకు మంచి నూనె వాడటం – సైనస్ తదితర సమస్యలు (చంద్ర సంభంధమైన జబ్బు) లేనియెడల ప్రతి శనివారం మంచి నూనెతో తలంటి స్నానం చెయ్యడం,నలుపు రంగు వస్తువులు,భట్టలు మాని నీలి రంగు వస్తువులు,బట్టలు ఎక్కువగా వాడటం. శని వారం దళితులకు ఇనుముదానం, సువాసనాది ద్రవ్యాలు వాడకుండుట, వేప చిగుళ్ళు తినడం, ఆవుకు అవిశాకు పెట్టడం,వండి తామూ తినడం, కాకరకాయ సైడ్ డిష్ గా పెట్టుకోవడం, వీలు కాకుంటే కాకర కాయఒడియాలు నంచుకోవడం. వెండిలో నీలం పొదిగించి దరించడం. స్టీల్ ఉంగరం, కడియం దరించడం. పరిసరాలను మరీ అలంకరించక, అతిగా శుబ్రపరచకుండుట, వీలుంటే తోట పెంచడం, వీలు లేకుంటే మొక్కలు పెంచడం,మల బద్దకాన్ని వారింఛడం, గ్రామ దేవతను పూజించడం, చనిపోయిన పూర్వీకులను పూజించడం ,అమావాశ్య రోజు కాకికి భోజనం పెట్టడం. ఎవరైన పోలీస్ స్టేషన్, కోర్టు,ఆసుపత్రి,వల్లకాటికి లిఫ్ట్ అడిగితే ఇవ్వడం. ఇంటికి పడమర ఖాళి స్థలం,పల్లం లేకుండా జాగ్రత్త పడండి.

7. బుధుడు బలహీనుడైనయెడల చేసుకోవలసిన పరిహారాలు:
మీ దైనందిన జీవితానికి , మీ వృత్తి వ్యాపారాలకు అవసరం లేని విషయాలను తెలుసుకోకండి. సమాచారం కలుషితం కావడమే చిత్త భ్రమకు హేతువు .ఎవరి మాట ఎవరికీ చెప్పకండి. ధౌత్యం పనికి రాదు. వ్యాపార రంగం మీకు పనికి రాదు. మూడో వ్యక్తుల మాట నమ్మకండి.స్వయంగా క్రాస్ చెక్ చేసుకొండి. బుధ కారకత్వ వృత్తి వ్యాపారాలు వద్దు. ( తప్పదంటే మీ ఆదాయంలో కొంత భాగం మీ మేనమామ /మామగారికి ఇవ్వండి). ఏ సమాచారాన్నైనా మీరే స్వయంగా తెలపండి. ఎవరిని ధూతగా వాడకండి. క్లబ్బులు,యూనియన్స్ మీకు పనికి రావు . ఇన్ ఆక్టివ్ గా ఉండండి.బుధ సంభంధ వ్యక్తుల వద్ద మెళకువ పాటించండి. చర్మ సంభంధ రుగ్మతలుంటే వైద్యం చెయ్యకండి. ( ప్రక్టుతి వైద్యం ఒకటే దీనికి పరిష్కారం) విథ్యార్థులు గణితం, సైన్స్ ముఖ్య సబ్జెక్టులుగా తీసుకోకండి. బుధవారం శ్రీ కృష్ణుని పటానికి తులశి మాల వేసి పూజించండి. జాతి పచ్చ ఉంగరం దరించండి

8. కేతు బలహీనంగా ఉన్నయెడల పరిహారం:
సన్యాసులకు భోజనం పెట్టడం, అన్య మత ప్రార్థనా స్థలాలకు వెళ్ళడం, అన్య మత గ్రంథాలు చదవడం, తగిన గురువును ఆశ్రయించి యోగా ( యోగాసనం కాదు) నేర్చుకోవడం,పై కప్పు సైతం లేని వినాయక స్వామిని పూజించడం, వైడూర్యం దరించడం, వారంలో ఒక్క రోజైనా కాషాయం దరించడం. శుభ కార్యాలు, విందు వినోదాలకు దూరంగా ఉండటం.

గమనిక:
రాహు కేతువులు ఒకరికొకరు సమసప్తకంలో అంటే 180 డిగ్రీల్లో ఉంటూ ఒకరినొకరు ప్రభావిస్తారు కాబట్టి రాహు సంభంధ విషయాల్లోనూ మెళకువ పాటిస్తూ,రాహు కారకత్వాల్లోనుండి కూడ దూరంగా ఉంటే మంచిది.

9. శుక్రుడు బలహీనంగా ఉన్న యెడల పరిహారాలు:
అవివాహితులు బ్రహ్మచర్యం పాటించడం/వివాహితులు రతుల సంఖ్యను తగ్గించుకొని , భావ ప్రాప్తికి ప్రయత్నించడం ,డాబు మాని నిరాడంభర జీవితం గడపడం, లగ్జరి,ఫ్యాన్సి ,వాహణాలు వాడటం మానడం. ఆరు శుక్రవారాలు లక్ష్మి పూజ . ఆరో శుక్రవారం అరుగురు ముత్తైదువులకు వెండి/ పూలు,పళ్ళు,/పసుపు కుంకుమ/ సబ్బు, /సెంటు వంటివి తాంబూలంలో పెట్టి ఇచ్చి వారి ఆశిస్సులు పొందటం. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి తెల్ల పట్టుచీర అర్పించాలని డబ్బులు కూడ పెట్టడం.
టివి,సినిమా,చాటింగ్,గానా భజానాలు మానాలి. ఇంటికి ఆగ్నేయంలో పల్లం, సెప్టిక్ ట్యాంక్, బాత్ రూమ్ వంటివి ఉంటే వాటిని సరి చేసుకోవడం.కటిక నేల పై పడుకోవడం,ఫర్నిచర్స్ వాడకుండుట.

వివాహ పొంతనాలు
వివాహ పొంతనాలను 3 విదాలుగా చూస్తారు .
1 .వధూ , వరుల జాతకాలను పట్టి .
2 . వారి జన్మ నక్షత్రాలను పట్టి .
3 . వారి పేర్లను పట్టి .
వీటిలో మొదటిది హేదుబద్దం , వధూవరుల జాతకాలను పరిశీలించినప్పుడు గురు , శుక్ర స్థితి ముఖ్యం అలాగే దోషాలు ఉంటే ఇరువురీకీ ఉండాలి . (అన్నది పెద్దల నిర్ణయం )
రెండవది 35 % హేతుబద్దం సాధారణంగా 10 పొంతనాలు చూస్తారు . వీటిలో రజ్జు , నాడికీలకం , జాతకాలు కలిసి రజ్జు నాడి బాగున్నా శుభంగా వివాహం చేయవచ్చును ( అన్నిది నా అభిప్రాయం) రజ్జు + నాడితో కలిపి కనీసం 6 పొంతనాలు ఉండాలి (అన్నది శాస్త్రం).
మూడవది పేర్లమ కుదర్చడం , ఆ పేర్లు వారి జన్మనక్షత్రాల కనుగుణంగా పెట్ట్ట్టబడి ఉంటే 35% హేతుబద్దమే . అలాకాక ఉత్తుత్తి పేర్లకు , ముద్దు పేర్లకు , ఆక్షణం నిర్ణయించుకున్న పేర్లకు పొంతనాలు చూడడం అహేతుకం , అశస్త్రీయం .

పరిహారాలు : ఒక హేతుబద్ద విశ్లేష్ణ
సాంప్రదాయక గ్రహ పరిహారాలు :
గ్రహాలిచ్చే అశుభ పలితాలను తగ్గించడానికి రుషులు సూచించిన మార్గాలనే పరిహారాలు అంటారు . ప్రతి ఒక్క గ్రహానికి ఒక వృక్షం, లోహం , రంగు , కులం , రత్నం ఉంటాయి .ఓ గ్రహం అశుభఫల ధాయకంగా ఉంటే ఆ గ్రహానికి సంభందించిన దేవతను పూజించాలి . సతరు గ్రహసంభంద వృక్షానికి నీళ్ళు పొయ్యాలి . (పూజ చెయ్యడంకాదు) అక్కడ కాసేపుండి ఆ గాలిని ఆస్వాదించాలి , లోహాన్ని దానం చెయ్యాలి . సతరు రత్నం దరించాలి ఇదే సాంప్రదాయిక పరిహారం .
హేతుబద్దపరిహారాలు :
పూజలు , పునస్కారాల పై విశ్వాసం లేనివారు , సాంప్రదాయిక పరిహారాలతో సత్పలితాన్ని పొందలేక పోయిన వారి కొరకు అన్వేషించి నేను కనుగొన్నవే హుతుబద్ద పరిహరాలు . అశుభఫలధాయకంగా ఉన్న గ్రహం మనకు చేయనున్న కీడును మనకు మనమే స్వయంగా ముందుగా జరుపుకోవడం . ఉదాహరణకు ప్రమాదాలను వారించడానికి రక్తదానం .

జ్యోతిష్యం గురించిన అపొహలు !
జ్యోతిష్యం గురించిన అపొహలతో ప్రభుత్వం , ధాతలు , జ్యోతిష్కులు , పత్రికలు , ప్రజలు అందరు జ్యోతిష్య శాస్త్రాన్ని బ్రష్ఠు పట్టిస్తునారు . గత , వర్దమానాలు మనకు అందుబాటులో ఉంటాయి . అందుబాటులో లేనిది భవిష్యత్తు ఒక్కటే . అందుకే భవిష్యత్తు విశేషాలను వివరించే జ్యోతిష్యం అంటే ప్రతి ఒక్కరికి ప్రితి .
ఇదైతే అందుబాటులో ఉండదో దాని కొరకు ఉవ్విళ్ళూరడం మానవుల భలహీనత . మానవుల భలహీనతలతో ఆడుకోవడం , డబ్బు చేసుకోవడం స్వార్ధపరుల వ్యాపార దక్షత . భవిష్యత్తు విషయాలను తెలుసుకోవాలన్నా , అంచన వెయ్యాలన్నా మనిషి ప్రక్కన పెట్టవలసినవి రెండు విషయాలే !
ఒకటి స్సార్ధం మరోకటి అహంకారం . భవిష్యత్తు దేవ రహస్యం విచిత్రమైనది . ఎవరికైతే దాని పై ఆసక్తి లేదో , ఎవరి మనస్సులో అహంకారం కించిత్తన్నా లేదో , ఎవరి గుండెలో స్వార్ధం లేదో వారికే దర్శనమిస్తుంది .మానవా మస్తిష్ఠకం ఒక అపురూప సృష్థి . అది కేవలం ఒక రేడియో ట్రాన్స్ మీటర్ గా కూడపనిచేయలేదు .
ఇక్కడ రేడియో రిజీవర్ అంటే మన భవిష్యత్తు గురించి , ఈ సమస్థ సృష్టి గురించి ఆ సృష్టి గురించి ఆ సృష్టిలో కాలక్రమంలో జరుగనున్న మార్పుల గురించి స్వయాన ఆ సృష్ఠే అందించే సందేశాలను అందుకోవడం అన్నమాట .
ట్రాన్స్-మీటర్ అంటే ఈ సృష్టికి మస్తిష్కం ద్వార సందేశాలను అందించడం అన్న మాట . ఒక మహా విస్ఫోటంతో పుట్టిన ఈ సృష్టిలోని పదార్థాలతో రూపు దిద్దుకొన్నదే ఈ భూమి . ఈ భూమిలోని పదార్థాలతో రూపు దిద్దుకొన్నవే మానవ శరీరాలు , మస్తిష్కాలు ,
ఈ సృష్టిలో ఒక లయ ఉంది . ఒక క్రమ శిక్షణ ఉంది . పున్నమి , అమావాస్యలే కాదు ప్రళయాలు , మహా ప్రళయాలు కూడా ఒక లయతో , క్రమ శిక్షణతో నిర్ణీత కాల ప్రమాణంలోనే చోటు చేసుకుంటాయి . సర్పం ఎరింగిన కాలపురుషుని మస్తిష్కాన్ని యూనివర్సల్ మైండ్ అంటారు .
ఈ భూమి మీద మానవుడు అహం , స్వార్ధం లేని యూనివర్సల్ మైండ్ –తోనే పుడుతుంటాడు . అయితే తల్లి తండ్రులు , ఉపాధ్యాయులు , సమాజం అతనిలోకి అహాన్ని చొప్పిస్తారు . సర్వం ఎరింగి ఉండవలసిన మస్తిష్కం , అహంతో స్వార్థంతో ఈ సృష్టికి తనే కేంద్ర బిందువని బ్రమిస్తుంది.
దీంతో భవిష్యత్తును తెలిపే కణాలు (న్యూరాన్స్) మూగపోతాయి. వాటిని అహం , స్వార్ధం అనే పొరలు కప్పేస్తాయి . భవిష్యత్తు దేవ రహస్యం ఆ దేవుని అనుమతి లేనిదే దానిని ఎవడూ తెలుసుకోలేదు . షిర్డి సాయి జివితంలో జరిగిన ఒక సఘటన ఈ సత్యానికి సాక్ష్యం ఇస్తుంది .
బాబా భక్తుడు ఒకడు విరేచనాలతో చావు బ్రదుకుల్లో ఉంటే బాబా వేంచిన వేరు శెనగలను తినిపిస్తాడు . దీంతో ఆభక్తునికి విరేచనాలు ఆగింది. అది బాబా మహత్యం .
జ్యోతిష్యంలో కూడ ఎన్నో సూత్రాలు ఉన్నవి . అందరు జ్యోతిష్కులు తమ వద్ద ఉన్న పంచాంగాలు చూసి మాత్రమే ఫలితాలు చెబుతారు . కాని కొందరు చెప్పినవి నిజమవుతాయి.ఆ కొందరు చెప్పినవే కొన్ని సమయాల్లో నిజమవుతాయి.మరి కొన్ని సమయాల్లో కావు . పంచాంగాలు –గణితం అన్నీ కేవలం నిమిత్త మాత్రమే . దేవుని అనుమతి , అనుగ్రహలే ముఖ్యం .
పుర్వం చెప్పిన బాబా కథలో అదే భక్తుడు ఇంకోసారి విరేచనం ఏర్పడితే వేంచిన శెనగ పప్పులు తిన్నాడు. విరేచనం ఆగక మరింత ఉధృతమైంది .
జ్యోతిష్య శాస్త్ర సూత్రాలు కూడ వేంచిన వేరు శెనగలే . భగవంతుని అనుగ్రహమే ముఖ్యం . జ్యోతిష్యం చెప్పేవారి జాతకం కూడ వారి హాక్కు ఫలించడానికి దోహద పడే రీతిలో ఉండాలి .
జాతక చక్రంలోని 2వ భావం వాక్ఫలితాన్ని + దనాగమనాన్ని సూచిస్తుంది . ఈ భావం 100% భలంగా ఉంటే జ్యోతిష్కులకు వాక్ఫలితంతో పాటు దనాగమనం కూడ సౌజావుగా ఉంటాయి . అయితే యధార్థంలో ఏ జాతకం చూసినా ఏ భావం కూడ 100% ఫల ప్రదంగా ఉండడం లేదు .
అందుకే వేలాది రూపాయల ఫీజు గుంజే జ్యోతిష్కుల వాక్కు గాలిలో కలిసిపోతాయి . పూట గడవక పస్తులపాలై ఉన్న జ్యోతిష్కుల వాక్కులు ఇట్టే ఫలిస్తున్నాయి
జ్యోతిష్కానికి కారకత్పం వహించేది బుధ గ్రహం . జాతకంలో బుదుడు లగ్నాత్ శుభుడై ఉండి 1,5,9 స్థానాల్లోనూ లేక పాపి అయ్యి 6,8,12 స్థానాల్లోనో ఉంటే ఈ ఆ జాతకుడు . జ్యోతిష శాస్త్రంలో ప్రావీణ్యతను పొందగలడు.
ఇందుకు విరుద్దంగా బుధ గ్రహస్థితి ఉంటే జ్యోతిష్యం చెప్పడం కేవలం అతనికో వృత్తి అయ్యి దనాగమన్ని ఇస్తుందే కాని అతనితో జ్యోతిష్యం చెప్పించుకున్న వారికి ఒరిగేది ఏమి లేదు . ఇలా జ్యోతిష్యం పై పట్టులేక ప్రజలను మోసగించి దనార్జన గావించే జ్యోతిష్కులకు భవిష్యత్తులో చర్మ వ్యాధులు , వరిభీజం, కీళ్ళ నొప్పులు వంటి సమస్యలు వచ్చి వడ్తాయి . అలాగే చిత్త బ్రమకూడ తఠస్తించవచ్చునన్నది శాస్త్రం .

మానవుల ప్రాథమిక కోరికలు రెండు
1 . చంపడం 2 . చావడం ఇవే పలు ముసుగులతో బైట బడుతుంటాయి .
ఉదాహరణకు నెలకి 100 రూపాయలకు 10రూపాయల వడ్డి గుంజడం ఇది మానవుని చంపే కోరికను తీరుస్తుంది. ఈ రెండు కోరికలు తీరేది డబ్బు లేదా సెక్సుతోనే , వీటిని పూర్తిగా పొందినాక లేదా పొంద గలం అన్న నమ్మకాన్ని పోగొట్టుకున్నాక ఆథ్యాత్మికాని మళ్ళుతుంటారు
ప్రతి ఒకరు ఆథ్యాథ్మికంగా ఎదగాలి తమకు మించిన ఓ శక్తి ఈ అండ చరా చర ప్రపంచాన్ని శాసిస్తుందన్న సంగతిని స్వయంగా తెలుసుకోవాలి. ఆ శక్తి తమలోను ఉందని అనుభవ పూర్వకంగా అంగీకరించాలి .కాస్త ముందుకెళ్ళి వర్ణనాతీత శక్తితో కర చాలనం చెయ్యాలి . మమేకం కావాలి అన్నదే నా ఉద్దేశం.
ఈ ఉద్దేశం భలంగా కలగాలంటే సెక్స్ గాని డబ్బు గాని తమలోని ప్రాథమిక కోరికలను(చచ్చే చంపే) పూర్తిగా తీర్చాలి . ఆ తరువాత ఈ రెండు కోరికలు కూడ తీరేది కేవలం ద్యానంతోనే అని గుర్తెరగాలి.
డబ్బు డబ్బు డబ్బు
ఎంతటి హీన ,హేయ,అరిష్ఠ జాతకంలోను ఎంతగా గ్రాహాలు భంగ పడి ఉన్న ఒక గ్రహానికన్న ఎంతో కొంత భలం మిగిలే ఉంటుంది . ఆ కొంత భలాన్ని సద్వినియోగం చేసుకున్నా అతను మానవుని ప్రాథమిక కోరికలైన చంపడం –చావడాన్ని డబ్బు +సెక్సుతో తీర్చుకో గలడు. మరి ఇదెలా సాధ్యం?
మీ కుటుంభ జ్యోతిష్కులను కలవండి :
గురు దన కారకుడు. భగవంతుడు గురు గ్రహానికి మరి ఏ ఏ విషయాల పై ఆధిపత్యాన్ని ఇచ్చాడో అడిగి తెలుసుకొండి .వాటిలో డబ్బును మాత్రం మినహాయించి తక్కిన విషయాలన్నింటిని త్యజించండి ! దూరంగా ఉండండి !
గురు గ్రహానికి మీ జాతకంలో ఉన్న ఆ కొంత భలం మీ సంపాదనకు మాత్రమే ఉపయోగ పడేలా ప్లాన్ చేసుకొండి .అలాగే జాతకంలోని 2 /5/9 /11 భావాలు కూడ సంపాదనకు సహకరించేవే. ఆ భావ కారకత్వాలను మిన్ జ్యోతిష్య బోధిని ద్వారా తెలుసుకొండి . వాటిలో అత్యవసరమైన వాటిని మాత్రం ఉంచుకొని మిగిలిన వాటిని వదిలెయ్యండి .
ఉ: దన భావం ( 2) దనం –వాక్కు –కుటుంభం ఇందులో దనం కీలకం . వాక్కు అంటే మాట .మాటలు తగ్గించండి.కుటుంభంతో వెచ్చించే సమయాన్ని తగ్గించుకొండి .మీరు లక్షాధికారులు కావడంఖాయం.
సయ్యా సౌఖ్యం (రతి)
సయ్యా సౌఖ్యం /రతి/సెక్సుకి కరకుడు శుక్రుడు. గురు విషయంలో చెప్పినట్లే మీ కు.జ్యోతిష్కులను కలిసి భగవంతుడు గురు గ్రహానికి మరి ఏ ఏ విషయాల పై ఆధిపత్యాన్ని ఇచ్చాడో అడిగి తెలుసుకొండి .వాటి త్యజించండి ! దూరంగా ఉండండి ! సకాలంలో వివాహం జరుగుతుంది . ఏం చక్క దాంపత్య సుఖాన్ని అనుభవిస్తారు .

– 0 –
సంప్రదింపులకు :
చిత్తూరు.మురుగేశన్,
#20-447, అన్నా స్వామి మొదలి వీథి,
మిట్టూరు,చిత్తూరు ఆం.ప్ర
517001
swamy7867@gmail.com
whatsapp: 9397036815

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.