నేనూ మీ అందరిలా ఈ సృష్టికి కేంద్ర బిందువుని నేనే అన్న భ్రమతో, అహం తో బ్రతికిన వాడినే. గత జన్మలోని సాధన ఫలితంగా ఈ జన్మలో నాకు అందిన సూచనలను అందుకుని పాటించిన ఫలితంగా మరణానికి ఏక్షణమైనా కరచాలనం చేసే స్థితికి ఎదిగాను.అవును మరణాన్ని ఎదుర్కోవడానికి నేర్చుకోవడమే జీవిత ధ్యేయమై ఉండాలి. ఎంత బతుకు బతికినా చావడం ఖాయం. మరి ఆ చావును ఎదుర్కొనే సత్తా లేక ఏం బతికినా ఏముంటుంది గర్వకారణం?

మనమందరం ఎప్పుడో ఏదో రూపంలో కలిసే ఉన్నాం. ఒక మహా విశ్ఫోటం కారణంగా చెదిరిపోయాం. మళ్ళి కలవాలని తపిస్తున్నాం. ఆ కలయకకు మన శరీరాలే అడ్డమని అపోహ పడుతున్నాం. శారీరికంగా కలావాలని ప్రయత్నిస్తాం అసే సెక్స్. లేదా మన శరీరాలను వదిలించుకోవడానికి హత్యలు,ఆత్మ హత్యలకు పాల్పదుతున్నం. ఒక్కసారిగా హత్య,ఆత్మ హత్య దైర్యం చాలనివారం వాయిదాల్లో ప్రయత్నిస్తున్నాం. లేదా చావడానికి/చంపడానికి ప్రత్యామ్నాయాలు వెతుకుంటున్నాం. అవే డబ్బు,సెక్స్,అధికారం,కీర్తికాంక్ష. ఇంతకీ మనం కలవడానికి అడ్డం ఈ శరీరాలు కావు. మన అహమే, మన స్వార్థమే. అహాన్ని త్యజిస్తాం,. స్వార్థం వీడూఅం. మనమందరం ఒక్క తల్లి బిడ్డలమే . కలిసి ఉంటే కలదు సుఖము. కలిసి వచ్చును అద్రుష్ఠము

31 thoughts on “నా గురించి

  1. ***నేనూ మీ అందరిలా ఈ సృష్టికి కేంద్ర బిందువుని నేనే అన్న భ్రమతో, అహం తో బ్రతికిన వాడినే.
    ## భ్రమా? ఎప్పుడు బాబూ? అదీ “మీ అందరిలా”. మమ్మల్ని నీతొ కలుపుకోవటం ఎందుకు? స్రుష్టికి కేంద్ర బిందువా? మేం అనుకున్నామా? వామ్మో… వీడు కే.ఏ.పాల్ కన్నా స్టోరీలు ఎక్కువ చెప్తున్నాడు.

    — — — —

    *** గత జన్మలోని సాధన ఫలితంగా ఈ జన్మలో నాకు అందిన సూచనలను అందుకుని పాటించిన ఫలితంగా మరణానికి ఏక్షణమైనా కరచాలనం చేసే స్థితికి ఎదిగాను.
    ## గత జన్మ లో సాధన ఫలితమా? ఏం ఫలితం?
    ఏం సూచనలందినాయ్ నాయనా?
    మరణానికి కరచాలనమా? నీ మొహమా?
    — — — —
    ***ఎంత బతుకు బతికినా చావడం ఖాయం.
    ## యెస్. అందుకే నీ ఒక్క బ్లాగ్ చాలు చచ్చిపోవటానికి.
    — — — —
    *** మళ్ళి కలవాలని తపిస్తున్నాం.
    ###తపనా? ఏం తపనా? నిన్ను కలవానా? ఒరేయ్ ఈ టార్చర్ ఏంట్రా?
    — — — —
    *** ఆ కలయకకు మన శరీరాలే అడ్డమని అపోహ పడుతున్నాం. శారీరికంగా కలావాలని ప్రయత్నిస్తాం అసే సెక్స్. లేదా మన శరీరాలను వదిలించుకోవడానికి హత్యలు,ఆత్మ హత్యలకు పాల్పదుతున్నం.
    ###శారీరకమా? నీవయసెంత? పబ్లిక్ సైట్ లో ఇలాంటి బూతులు రాస్తావా?
    — — — —

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.