స్విడ్జర్లాండ్లో డైరక్టు డెమాక్రసి ఉందట. అంటే యావత్ ప్రజానీకం ఒక చోట అసెంబుల్ అయ్యి విధాన పరమైన నిర్ణయాలు తీసుకుంటారట. మంచి కాలం మన దేశంలో -ముఖ్యంగా మన రాష్ఠ్రంలో అది లేదు. కేవలం ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిదులే అసెంబ్లిలో ఉంటార్. ఇక యావత్ ప్రజానీకం అసెంబుల్ అయ్యేలా ఉంటే సీన్ ఇంకా ఎంత దారుణంగా ఉంటుందేమో?

కాల,దేశ,వర్థమానాలను అనుసరించి మన భాష – హావ -భావాలుండాలి.  నేను సైతం టీ కొట్లను ,సెలూన్లను వేదిక చేసుకుని ఉపన్యాసాలు ఇచ్చినవాడ్నే. కాని ఆ ఉపన్యాసాల్లో వాడిన బాషను బ్లాగులో వాడితే ఎలా ఉంటుంది?

అసెంబ్లిలో ప్రసంగాలు ఎలా ఉండాలంటే కనీశం “అబద్దం” అన్న పదం కూడ వాడ కూడదట. సత్య దూరం అని చెప్పాలి. కాని శుక్రవారం రోజు వై.ఎస్.ఆర్ & జగన్నుద్దేశించి తె.దే.పా సభ్యులు చేసిన వ్యాఖ్యలు మరీ ధారుణం.

వై.ఎస్ బతికుండగా -తమ కలలో సైతం లేవనెత్తే సాహసం చెయ్యలేని అంశాలను తె.దే.పా సభ్యులు లేవనెత్తేరు. మరి వారి ప్రసంగాల్లో అన్ పార్లెమెంటరి వ్యాఖ్యలను వెతకడం కన్నా  పార్లెమెంటరి వ్యాఖ్యలను వెతకడం సుళువైన పని .

నన్నడిగితే జగన్ లా అండ్ ఆర్డర్ గురించి లేవనెత్తడమే అవివేకం. అది 10+ కుటుంభాలకు సంభందించిన విషయం. మరి వారి పార్టికి సంభంధించిన విషయం.

ఇదివరకే నేను ఒక సలహా ఇచ్చాను. పార్టిలో లీగల్ సెల్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. అందులో పార్టి పై అభిమానం ఉన్న లాయర్లను అకామడేట్ చెయ్యాలి. రాష్ఠ్రంలో ఏ కోశాన ఏ కార్యకర్తకు ఏ అన్యాయం జరిగినా లీగల్ సెల్ అక్కడ ప్రత్యక్షం అవ్వాలి.

ఎస్.ఐ/సి.ఐ/ఎస్.పి/డి.ఐ.జి/ఐజి /హోం మినిస్టర్ /సి.ఎం/గవర్నర్ ఇలా ఎన్నో ప్రత్యామ్నాయాలుంటాయి. జరిగిన అన్యాయాన్ని వారికి నివేదించ వచ్చు. మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించ వచ్చు. ప్రజాస్వామ్య బద్దంగా దర్నాలు, నిరాహార దీక్షలు చేపట్టొచ్చు. ఇవేవి ఉపకరించ లేదా? హై కోర్టులో పిల్ వేసుకోవచ్చు.

వై.ఎస్.ఆర్ & జగన్  గురించి ఎన్ని అభూత కల్పనలను తె.దే.పా అరిగి పోయిన రికార్డులా వినిస్పితూనే ఉందో అందరికి తెలుసు. లా అండ్ ఆర్డర్ పై చర్చలో మళ్ళీ వీటిని రీప్లే చేసే అవకాశం ఉందని జగన్ ఊహించలేక పోయారంటే దట్ ఈజ్ యె జోక్..

23 జిల్లాలు 13 జిల్లాలయి పోయాయి. హైదరాబాద్ పోవడంతో రాష్ట్ర ఆదాయం దుమ్ము కొట్టుకు పోయింది. కేంద్రం దయా భిక్షం మీద కాలం వెళ్ళ బుచ్చే గడ్డు పరిస్థితి వచ్చింది. ఎలాగైనా మళ్ళీ ఆ కుర్చి దక్కాలన్న దుర్బుద్దితో సాధ్యాసాధ్యాలను -ఉచితానుచితాలను క్షణం కూడ ఆలోచించక రైతు రుణ మాఫి మొదల్గొని అసంఖ్యాక హామీలను గుప్పించేసారు.

చంద్రబాబు బాషలో చెప్పాలంటే ఇబ్బందులున్నాయి-రాజదాని లేదు-ఎక్కడ కూర్చోవాలో తెలీదు. అయినా పాలక పక్షం ఇంతగా ఫౌ ల్ ప్లేకు పూనుకుంటుంది.

ప్రమాణ స్వీకారానికి కోట్లు, చేంబర్ మరామత్తుకు లక్షలు ,సింగపూర్ టూర్లు అంటూ ప్రజాదనాన్ని తగుల పెడ్తూ ఈ  విన్యాసాలకు పాలక పక్షం పాల్పడుతుంటే ..

ఒక వేళ రాష్ఠ్ర విభజణ జరక్క- 23 జిల్లాలకు బాబు సి.ఎం అయ్యుటే -ప్రతిపక్షానికి 67 ఎం.ఎల్.ఏలు లేక ఆరేడు ఎం.ఎల్.ఏలే ఉండి ఉంటే- కేంద్ర ప్రభుత్వం-రిజర్వు బ్యాంక్ అంగీకారంతో రైతు రుణ మాఫి సక్రమంగా అమలై పోయుంటే ఇంకా ఎలా రెచ్చి పోయేవారో ?

ఇక జగన్ విషయానికొస్తే లా అండ్ ఆర్డర్ రెండు పక్కలా పదునున్న కత్తి. కాని రుణ మాఫి అలాంటిది కాదు. లా అండ్ ఆర్డర్ విషయం పక్కన పెట్టి -నేను సూచించన ప్రత్యామ్నాయ మార్గాల్లో పరిష్కరించుకుని -రైతు రుణ మాఫి సబ్జెక్టు లేవనెత్తి ఉంటే అటు కోట్లాది రైతు కుటుంభ సభ్యులకు -రాష్ఠ్రానికి మేలు జరగడమే కాక పొలిటికల్ మైలేజ్ కూడ దక్కేది.

మరో సంగతేమంటే జగన్ ప్రజల నడుమ ప్రసంగానికి -ప్రజా ప్రతినిదుల నడుమ ప్రసంగానికి మధ్య తేడా ఏమిటో అవగాహణ పెంచుకుంటే మంచిది. ఇంకో విషయం. రాజకీయ నాయకుడు కోపం,ఆగ్రహం నటించాలే గాని నిజంగానే కోపోద్రేకుడు కాకూడదు.

నా ఉద్దేశం జగన్  నోట ఆ మాట (బఫూన్) దొర్ల కుండ ఉండి ఉంటే డిఫెన్సులో పడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. కనీశం ఆతరువాతనైనా తన వ్యాఖ్యకు (బఫూన్లు) బేషరత్తు క్షమార్పణ కోరి ఆ పై పాలక పక్షం వారి వ్యాఖ్యలకు వారి క్షమార్పణలకు పట్టు పట్టి ఉంటే బావుండేది .

ఈ సమావేశాల్లో స్పీకర్ తీరులో పక్ష పాతం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తీరు మారాలి . వాక్ అవుట్ చేసే పరిస్థితిని కల్పించి – కనీశం వాక్ అవుట్ పై మాట్లాడే అవకాశం కూడ ఇవ్వక పోవడం ధారుణం.

మొత్తానికి అటు పాలకపక్షం -ఇటు ప్రతిపక్షం రెండూ ప్రజా సమస్యలను బై పాస్ చేసి ఫౌల్ ప్లేకు పాల్పడ్డాయన్నది నిర్వివాదాంశం.

5 thoughts on “ఏ.పి.అసెంబ్లిలో ఫౌల్ ప్లే

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.